సేవా కూటాల పట్టిక
నవంబరు 11తో ప్రారంభమయ్యే వారం
పాట 27 (221)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను, (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో ఉన్న మొదటిది,) నవంబరు 15 కావలికోటను ఎలా అందించాలో రెండు వేర్వేరు ప్రదర్శనలను ప్రదర్శించండి. మన ప్రపంచవ్యాప్త పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుందో ఒక ప్రదర్శనలో వివరించండి.—కావలికోట 2వ పేజీని లేదా తేజరిల్లు! 5వ పేజీని చూడండి.
15 నిమి: సత్యారాధన మద్దతుదారులు—నాడు నేడు. నవంబరు 1, 2002, కావలికోట, 26-30 పేజీల ఆధారంగా ప్రసంగం.
20 నిమి: “మీ సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తకు మద్దతునివ్వండి.”a సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్త అయిన పెద్ద నిర్వహించాలి. 3వ పేరాను చర్చించేటప్పుడు, ఒకవేళ లభ్యమయితే పరిచర్య పాఠశాల పుస్తకంలోని 70వ పేజీపై వ్యాఖ్యానాలను చేర్చండి. పుస్తక అధ్యయన ఏర్పాటుకు మద్దతునిస్తున్న నిర్దిష్టమైన విధానాల కోసం సంఘాన్ని ప్రశంసించండి. అభివృద్ధి సాధించవలసిన అవసరం ఉన్న క్షేత్రాల వైపుకు దయచేసి అవధానాన్ని మళ్ళించండి.
పాట 23 (200), ముగింపు ప్రార్థన.
నవంబరు 18తో ప్రారంభమయ్యే వారం
పాట 21 (191)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. “చదవడానికి అత్యుత్తమమైనవి!” అనే బాక్సును చర్చించండి.
10 నిమి: ప్రశ్నా భాగం. అర్హతగల పెద్ద ఇచ్చే ప్రసంగం.
25 నిమి: “కుటుంబ శిరస్సులారా—మంచి ఆధ్యాత్మిక దినచర్యను పాటించండి.” 1-3 పేరాల ఆధారంగా క్లుప్తమైన ఉపోద్ఘాత ప్రసంగం ఇచ్చిన తర్వాత, 4-13 పేరాలను ప్రేక్షకులతో చర్చించండి. సమయం ఉంటే 7, 8, 11, 12 పేరాలను చదవండి. ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయండి. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సంబంధించి క్రమబద్ధమైన దినచర్యను కలిగివుండడానికి వారి కుటుంబానికి ఏది సహాయపడింది? అలా చేయడానికి వారు ఎలా కృషి చేయవలసి వచ్చింది? వారు ఎలా ప్రయోజనం పొందారు? 14వ పేరాపై ఆధారపడిన క్లుప్తమైన వ్యాఖ్యానాలతో ముగించండి.
పాట 20 (93), ముగింపు ప్రార్థన.
నవంబరు 25తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
10 నిమి: స్థానిక ప్రకటనలు. క్షేత్ర సేవలో కలిసి పనిచేస్తున్న ఒక వివాహిత జంట, అక్టోబరు-డిసెంబరు (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో మూడవది) మరియు డిసెంబరు 1 పత్రికలను అందించడానికి 8వ పేజీలోని సలహాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శిస్తారు. భార్య తేజరిల్లు!ను ఎలా అందించాలో చూపిస్తుంది, భర్త కావలికోటను ఎలా అందించాలో చూపిస్తాడు.
15 నిమి: “యేసును గురించిన సత్యాన్ని తెలియజేయండి.”b లభ్యమయితే, పరిచర్య పాఠశాల పుస్తకంలోని 278వ పేజీపై వ్యాఖ్యానాలను చేర్చండి. వచ్చేవారం సేవాకూటంలో నిర్వహించబడే “జీవితంలోని అతిప్రాముఖ్యమైన కార్యకలాపాల కోసం మనల్ని సిద్ధపరిచే పాఠశాల” అనే భాగం కోసం పాఠ్యపుస్తకాన్ని తెచ్చుకోమని అందరినీ ప్రోత్సహించండి.
20 నిమి: “‘తండ్రి లేనివారి’పట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధ కనపర్చండి.” తండ్రి లేని పిల్లలపట్ల యెహోవా దృష్టిని గూర్చి ఆర్టికల్‌లోని మొదటి పేరా మీదా, అంతర్దృష్టి సంపుటి 1 (ఆంగ్లం), 816వ పేజీ మీదా ఆధారపడిన మూడు నిమిషాల ప్రసంగంతో ప్రారంభించండి. మిగతా ఆర్టికల్‌ను ప్రశ్నా జవాబులతో పరిశీలించండి. ఇతరులు సహాయాన్నీ ప్రోత్సాహాన్నీ అందించగల ఆచరణాత్మకమైన మార్గాలను ఉన్నతపర్చండి. 3, 4 పేరాలను చర్చించేటప్పుడు అక్టోబరు 8, 1995, తేజరిల్లు! (ఆంగ్లం), 8, 9 పేజీలపై క్లుప్తమైన వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 17 (187), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 2తో ప్రారంభమయ్యే వారం
పాట 10 (82)
8 నిమి: స్థానిక ప్రకటనలు. నవంబరు క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించేటప్పుడు ఉపయోగించగల అందింపును క్లుప్తంగా పునఃసమీక్షించండి.—1998, జూన్ మన రాజ్య పరిచర్య, 8వ పేజీ చూడండి.
12 నిమి: స్థానిక అవసరాలు.
25 నిమి: “జీవితంలోని అతిప్రాముఖ్యమైన కార్యకలాపాల కోసం మనల్ని సిద్ధపరిచే పాఠశాల.” పాఠశాల పైవిచారణకర్త ప్రేక్షకులతో నిర్వహించే చర్చ. జనవరిలో ప్రారంభమయ్యే క్రొత్త పాఠశాల కార్యక్రమంపట్ల ఉత్సాహాన్ని పెంచండి. అక్టోబరు 2002 మన రాజ్య పరిచర్యలో మధ్యపేజీలలో ఇవ్వబడిన “2003వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక”లోవున్న అంశాల వైపు అవధానాన్ని మళ్ళించండి. పరిచర్య పాఠశాల పుస్తకంలో 282వ పేజీలో ఇవ్వబడినట్లు, పాఠశాలలో చేరడానికి కావలసిన అర్హతలను చెప్పండి. అర్హత ఉండి పాఠశాలలో ఇంకా చేరని వారుంటే, వారిని చేరమని ప్రోత్సహించండి.
పాట 15 (127), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.