చదవడానికి అత్యుత్తమమైనవి!
ఈ క్రింద ఇవ్వబడిన తేజరిల్లు! గత సంచికల్లోని ఆర్టికల్‌ల శీర్షికలను చూస్తే అవి చదవాల్సిన అత్యుత్తమమైన విషయాలని మీరు అంగీకరించరా?
“మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడం ఎలా”
“దైనందిన జీవితంలో స్త్రీని గౌరవించడం”
“ప్రతికూల భావోద్రేకాలు—వాటిని ఎలా జయించవచ్చు?”
“మీరు ప్రేక్షకుల ముందు మాట్లాడగలరు!”
“మీరు ఎలాంటి వినోదాన్ని ఎంపిక చేసుకుంటారు?”
వీటితోపాటు ఇంకా ఎన్నో ఆర్టికల్‌లు, 1992 తేజరిల్లు! సంచికల్లో వచ్చాయి. అవి మనకిప్పుడు ఎటువంటి ప్రయోజనం లేనంతటి పాతవా? ఎంత మాత్రం కాదు! మీరు ఇప్పటికీ 1992 తేజరిల్లు! సంపుటిని (బౌండ్ వాల్యూమ్) ఇంగ్లీషులో పొందవచ్చు. ఏ ప్రచారకుడైనా/ప్రచారకురాలైనా ఈ తేజరిల్లు! సంపుటి కావాలనుకునేవారు సంఘం కోసం సాహిత్యాలను చూసుకునే సహోదరుని ద్వారా తెప్పించుకోవచ్చు.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్త, రాజ్య మందిర లైబ్రరీలో ఈ సంపుటి ఉందో లేదో చూసి అవసరమైతే తెప్పించుకోవాలి.