కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/02 పేజీ 7
  • మన కాలానికి హెచ్చరికా మాదిరులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన కాలానికి హెచ్చరికా మాదిరులు
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • గంభీరంగా ఆలోచింపజేసే వీడియో
    మన రాజ్య పరిచర్య—2006
  • ఇశ్రాయేలీయులు చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • దీవెనలు లేక శాపములు—నేడు మన కొరకు ఉదాహరణలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 10/02 పేజీ 7

మన కాలానికి హెచ్చరికా మాదిరులు

వాటిని లక్ష్యపెట్టమని హృదయపూర్వకంగా చేస్తున్న విన్నపం

మన కాలానికి హెచ్చరికా మాదిరులు (ఆంగ్లం) అనే వీడియోలో చిత్రించబడిన బైబిలు నాటకం నుండి నేర్చుకున్న పాఠాలను లక్ష్యపెట్టడం ద్వారా మన యథార్థతను కాపాడుకోవాలన్న నిశ్చయతను మనందరం బలపర్చుకోవచ్చు. ఈ వీడియోను చూసే ముందు దయచేసి సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని, లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) రెండవ సంపుటిలోని 419వ పేజీ 3-5 పేరాలలోవున్న తత్సంబంధిత సమాచారాన్ని చదవండి. ఆ తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి: మోయాబీయులు ఎవరు, వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయవద్దని యెహోవా మోషేకు ఎందుకు ఆజ్ఞాపించాడు? (ద్వితీ. 2:9) ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయడానికి మోయాబీయులను ఉపయోగించుకునేందుకు బిలాము ఎలా పథకం వేశాడు? వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడానికి ముందు చాలామంది ఇశ్రాయేలీయులు ఒక ప్రాముఖ్యమైన పరీక్షలో విఫలమయ్యారన్న సంగతి మనం ఎందుకు మరచిపోకూడదు?​—1 కొరిం. 10:11, 12.

హెచ్చరికా మాదిరులు అనే వీడియోను చూస్తున్నప్పుడు, మనం విశ్వసనీయంగా ఉంటూ దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే నేడు మన జీవితంలో ప్రధానంగా అవధానం ఇవ్వవలసిన ఈ నాలుగు క్షేత్రాల గురించి ఆలోచించండి. (1) మనోవైఖరి: కొంతమంది ఇశ్రాయేలీయులు యెహోవాపట్ల, ఆయన ఏర్పాట్లపట్ల సరికాని మనోవైఖరిని ఎలా ప్రదర్శించారు? వారికి భిన్నంగా మనం ఎటువంటి మనోవైఖరిని ప్రతిబింబించడానికి కృషి చేయాలి? (2) సహవాసాలు: ఇశ్రాయేలీయులు మోయాబీయులతో స్నేహం చేయకూడదని యెహోవా ఎందుకు కోరుకున్నాడు? (నిర్గ. 34:12; సామె. 13:20) మనం మన స్నేహితులను ఎందుకు జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోవాలి? (3) నైతిక విలువలు: దాదాపు 23,000 మంది ఇశ్రాయేలీయులను చెడు సహవాసులు ఏ ఘోరమైన పాపం చేయడానికి నడిపించారు? (1 కొరిం. 10:⁠8) నేడు, దేవుని ప్రజలలో కొంతమంది అనైతికతకు పాల్పడేలా ఏది ప్రలోభపెట్టింది, అయితే మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు? (4) ఆరాధన: ఇశ్రాయేలీయులు తమ ఆరాధనకు సంబంధించిన పరిశుద్ధత విషయంలో ఎలా పరీక్షించబడ్డారు? నేడు కొందరు ఎటువంటి మోసపూరితమైన విగ్రహారాధనకు లొంగిపోగలరు, అయితే మనం దాన్ని ఎలా నివారించవచ్చు?​—కొలొ. 3:5.

నాటకంలో, యామీను తన నైతిక యథార్థతను బట్టి ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఈ వీడియో ద్వారా పరిపాలక సభ నిజ క్రైస్తవులందరికీ హృదయపూర్వకంగా చేస్తున్న విన్నపం ఏమిటి? మీరు ఒక కుటుంబ శిరస్సైతే, మీ కుటుంబం ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడడం యుక్తమని మీరు ఎందుకు భావిస్తున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి