పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“మన కాలంలో భూకంపాలు చాలా నాశనాన్ని కలుగజేశాయి, లక్షలాదిమంది తమ ప్రాణాలు కోల్పోయారు. బ్రతికి బయటపడినవారు తిరిగి కోలుకునే దారిలేక తరచూ నిరాశ్రయులుగా విడవబడతారు. భూకంపం తర్వాతి పరిస్థితిని బాధితులు ఎలా తట్టుకుని నిలవగలిగారో తేజరిల్లు! యొక్క ఈ సంచిక చూపిస్తుంది. చాలా ప్రాముఖ్యమైన ఒక బైబిలు ప్రవచనంలో భూకంపాలు ఎలా ఒక పాత్రను కలిగివున్నాయో కూడా అది వివరిస్తుంది.”
కావలికోటసెప్టెం. 15
“‘పరిశుద్ధులకు’ ప్రత్యేకమైన శక్తి ఉంటుందనీ వారి ద్వారా ప్రార్థించడం మంచిదనీ లక్షలాదిమంది విశ్వసిస్తారు. అయితే మీరేమనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] యేసు క్రీస్తు ఏమన్నాడో గమనించండి. [యోహాను 14:6 చదవండి.] ఇది, ‘పరిశుద్ధుల’ ద్వారా ప్రార్థించడం గురించి కొందరు ఆలోచించేలా చేస్తుంది. కావలికోట యొక్క ఈ సంచిక ఆ ప్రాముఖ్యమైన అంశాన్ని చర్చిస్తుంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ కలిగివున్నారని నేను భావిస్తున్నాను. అవునా? మీరు గానీ మీకు తెలిసినవారు గానీ అధిక రక్తపోటుతో బాధపడుతుండవచ్చు? [జవాబు చెప్పనివ్వండి, తర్వాత 15వ పేజీలోని ఆర్టికల్ చూపించండి.] సృష్టికర్త ఏమి వాగ్దానం చేశాడో గమనించండి. [యెషయా 33:24 చదవండి.] ఈ ఆర్టికల్ మీకు ఎంతో సమాచారాన్ని అందివ్వగలదనీ, ఇది ఎంతో ఆచరణాత్మకంగా ఉంటుందనీ నేను ఖచ్చితంగా చెప్పగలను.”
కావలికోట అక్టో. 1
“నేడు మన చుట్టూ మనం చూస్తున్న యుద్ధాలు, నేరాలు, ఉగ్రవాద చర్యలు వంటి కష్టాలన్నింటికీ ఎప్పటికైనా అంతం వస్తుందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. మీరేమనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] బైబిలు ఓదార్పునిచ్చే ఈ హామీని ఇస్తోంది. [కీర్తన 37:10, 11 చదవండి.] దేవుడు ఇంత వరకూ దుష్టత్వానికీ అది తెచ్చే వేదనలకూ అంతం ఎందుకు తీసుకురాలేదో ఈ పత్రిక వివరిస్తుంది.”