కొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
1 ఈ అస్థిర లోకంలో విశ్వాసమందు స్థిరంగా ఉండేందుకు మనం మన నమ్మకాన్ని యెహోవాపై ఉంచాలి. ఆ నమ్మకాన్ని మన దైనందిన జీవితంలో ఎలా ప్రదర్శించవచ్చు? యెహోవాపై నమ్మకముంచడం మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సాతాను లోకపు ప్రభావాన్ని నిరోధించడానికి అది మనకు ఎలా సహాయం చేస్తుంది? 2003 సేవా సంవత్సరం కోసం రూపొందించబడిన ప్రాంతీయ సమావేశ కార్యక్రమం ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. “యెహోవాను నమ్ముకొని మేలు చేయండి” అనేది దాని అంశం.—కీర్త. 37:3.
2 యెహోవాపై మనకున్న నమ్మకం కేవలం ప్రత్యేక సందర్భాల్లోనో అత్యవసర పరిస్థితుల్లోనో మాత్రమే ప్రదర్శించబడేది కాదు. అది మన దైనందిన జీవితాల్లోని ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విషయం, “అన్ని సమయాల్లోను యెహోవాను నమ్ముకోండి” అనే ప్రారంభపు ప్రసంగంలో ఉన్నతపర్చబడుతుంది. (కీర్త. 62:8) వివాహ బంధాన్ని పటిష్ఠంగా ఉంచుకోవడానికి, కుటుంబంలో తలెత్తే సమస్యలతో వ్యవహరించడానికి, వస్తుదాయకమైన అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడే బైబిలు ఆధారిత సమాచారాన్ని ఎలా కనుగొనాలో దాన్ని ఎలా అన్వయించుకోవాలో, “యెహోవాపైనున్న నమ్మకాన్ని వ్యక్తం చేయడం” అనే నాలుగు భాగాల గోష్ఠి మనకు చూపిస్తుంది.
3 ఏది సరైనది ఏది సరికాదు అనే విషయంలో వక్రీకరించబడిన దృక్కోణాన్ని మనపై రుద్ది, ఏది ప్రాముఖ్యము ఏది ప్రాముఖ్యము కాదు అనే విషయంలో మనల్ని తికమక పెట్టాలని సాతాను లోకం ప్రయత్నిస్తుంది. (యెష. 5:20) “జీవితంలోని వ్యర్థమైన వాటినుండి జాగ్రత్తగా ఉండండి,” “చెడును వదిలిపెట్టి, మంచి చేసేవారిగా ఉండండి” అనే ప్రసంగాలు, యెహోవా ఉన్నతమైన ప్రమాణాలను పాటించాలన్న మన తీర్మానాన్ని బలపరుస్తాయి.—ఆమో. 5:14.
4 యెహోవా దేవుడు ప్రస్తుత దుష్ట విధానానికి అంతం తీసుకుని వచ్చినప్పుడు ఆయన సేవకులు ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచవలసిన అవసరం ఉంటుంది. “లోకంలోని వేదన నుండి విమోచన సమీపించింది” అనే బహిరంగ ప్రసంగంలో ఈ విషయం ఉన్నతపర్చబడుతుంది. ఆ తర్వాత, “దేవుని రాజ్యానికి తగినవారిగా మీరు ఎంచబడతారా?” అనే భాగంలో మనల్ని మనం పరిశీలించుకోవాలని కోరబడతాము. “యెహోవా వాగ్దానాలపై నమ్మకముంచండి” అనే ఉద్బోధతో కార్యక్రమం ముగుస్తుంది.
5 బాప్తిస్మ ప్రసంగం ప్రతీ సమావేశంలో ఒక ముఖ్యాంశంగా ఉంటుంది. బాప్తిస్మం తీసుకోవాలని కోరుకునేవారు ఎవరైనా దానికి అవసరమైన ఏర్పాట్లు చేయబడడానికి వీలుగా సాధ్యమైనంత త్వరగా ఆ విషయాన్ని పైవిచారణకర్తకు తెలియజేయాలి.
6 ఈ అనిశ్చిత కాలాల్లో విశ్వాసానికి, స్థిరత్వానికి కేవలం యెహోవా మాత్రమే నిజమైన మూలం. (కీర్త. 118:8, 9) ప్రాంతీయ సమావేశ కార్యక్రమమంతటికీ హాజరవ్వడం ద్వారా మనమందరము ఆయనపై మనకున్న నమ్మకాన్ని బలపర్చుకుందాము.