కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/02 పేజీ 7
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్తరం ఇలా రాయవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—1996
  • ఉత్తరాల ద్వారా సందేశాన్ని అందజేయడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • మంచు, వర్షం, ఉత్తరాల పరిమాణం ఏదియు బట్వాడాను ఆపలేవు
    తేజరిల్లు!—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 5/02 పేజీ 7

ప్రశ్నా భాగం

◼ ఉత్తరాల ద్వారా సాక్ష్యమిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఎందుకు అవసరం?

ఉత్తరాల ద్వారా సాక్ష్యమివ్వడమనేది, సువార్తను అందజేసే విషయంలో కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ప్రభావవంతమైన పద్ధతి. అయితే ప్రపంచంలో ఇటీవల జరిగిన సంఘటనలు, అపరిచిత ఉత్తరాలను తెరవకుండా జాగ్రత్తపడేలా చేశాయి. గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చే కవర్లు లేదా పంపిస్తున్న వ్యక్తి చిరునామా లేని కవర్లు తరచూ అనుమానాస్పదమైనవిగా దృష్టించబడతాయి, ప్రత్యేకించి చేతివ్రాతతో ఉండి, ఎక్కువ కాగితాలతో కవర్లు లావుగా ఉంటే వాటిని తెరవడానికి సందేహిస్తారు. గృహస్థులు ఇలాంటి ఉత్తరాలను తెరవకుండానే పడేయవచ్చు. అలా జరగడాన్ని మనం ఎలా ఆపవచ్చు?

వీలైతే ఉత్తరాన్ని, కవరుపై చిరునామాను టైపు చేయాలి. కవరు మీద గృహస్థుడి పేరు వ్రాయాలి. “ఈ ఇంట్లో నివసిస్తున్నవారికి” అని వ్రాయకండి. అంతేకాకుండా ఎల్లప్పుడూ, మీ చిరునామాను ఇవ్వండి. మీ వ్యక్తిగత చిరునామాను ఇవ్వడం సబబుగా అనిపించనప్పుడు, మీ పేరును, రాజ్యమందిరం చిరునామాను ఇవ్వండి. పేరు లేకుండా ఉత్తరాలను పంపించకండి. బ్రాంచి కార్యాలయం చిరునామాను మాత్రం ఎన్నడూ ఉపయోగించకండి.​—1996 నవంబరు మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నాభాగం చూడండి.

మరిన్ని సలహాలూ, ఒక నమూనా ఉత్తరమూ, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి (ఆంగ్లం) అనే పుస్తకంలో, 71-3 పేజీలలో కనుగొనవచ్చు. ఈ మార్గనిర్దేశాలు, ఇతరులకు సువార్తను అందజేసేందుకు ఉత్తరాలను ప్రభావవంతంగా ఉపయోగించడానికి మనకు సహాయం చేస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి