కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/02 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఉపశీర్షికలు
  • మే 13తో ప్రారంభమయ్యే వారం
  • మే 20తో ప్రారంభమయ్యే వారం
  • మే 27తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2002
km 5/02 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మే 13తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

15 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో ఉన్న మొదటిది.) మరియు మే 15 కావలికోటను ఎలా అందించాలో రెండు వేర్వేరు ప్రదర్శనలను ప్రదర్శించండి. ప్రతి ప్రదర్శనలోనూ, “పనితొందరలో ఉన్నాను” అని సంభాషణను ఆటంకపరిచే వారితో విభిన్నమైన రీతుల్లో ఎలా వ్యవహరించాలో చూపించండి.​—⁠బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 11వ పేజీ చూడండి.

10 నిమి: “మీరు మన సాహిత్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నారా?” పెద్ద ఇచ్చే ప్రోత్సాహకరమైన ప్రసంగం.

20 నిమి: “‘ఆసక్తిగల రాజ్య ప్రచారకులు’ యెహోవాసాక్షుల జిల్లా సమావేశం 2002.”a కార్యదర్శి నిర్వహించాలి. బైబిలు కాలాలనుంచి మన కాలం వరకు దేవుని ప్రజలను బలపర్చడంలో పెద్ద సమావేశాలు గొప్ప పాత్రను పోషించాయి. [ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకంలో 254వ పేజి 1-3 పేరాలు మరియు అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1లో, 821వ పేజి 5వ పేరా చూడండి.] ఈ సంవత్సరం జిల్లా సమావేశపు మూడు రోజులూ హాజరవ్వడానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభించమని అందరిని ప్రోత్సహించండి.

పాట 23 (200), ముగింపు ప్రార్థన.

మే 20తో ప్రారంభమయ్యే వారం

పాట 1 (13)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు. ప్రశ్నా భాగాన్ని సమీక్షించండి.

10 నిమి: మన క్రైస్తవ తటస్థతను కాపాడుకోవడం. సమర్థుడైన పెద్ద ఇచ్చే ప్రసంగం. దేశభక్తిని ప్రదర్శించడమనేది పాఠశాలలో ఉద్యోగ స్థలంలో మరియు మన ఇరుగుపొరుగు ప్రాంతాల్లో సర్వసాధారణమైపోయింది. దీన్ని ప్రోత్సహించే అనేకులు జాతీయ దుర్ఘటనల వల్ల కలిగే ఆందోళనను, బాధను అధిగమించడానికి ఒక మార్గంగా అలా చేస్తారు. లోకంలో చూస్తున్న విషయాలను బట్టి మనము కూడా చింతిస్తున్నప్పటికీ, విశ్వ సర్వాధిపత్యాన్ని గురించిన వివాదాంశాన్ని మనము అర్థంచేసుకుంటాము, రాజ్య సందేశాన్ని బట్టి ఓదార్పు పొందుతాము. జాతీయతకు సంబంధించిన కార్యకలాపాల్లో మనం ఎందుకు భాగంవహించమో ఇతరులకు యుక్తిగా వివరించేటప్పుడు, దేవుని వాక్యములో మనం కనుగొన్న ఓదార్పును నిరీక్షణను కూడా వారితో పంచుకోవాలి. యెహోవాసాక్షులు మరియు విద్య (ఆంగ్లం) బ్రోషుర్‌లో 20-4 పేజీలలో, “ద ఫ్లాగ్‌ సెల్యూట్‌” అనే సబ్‌హెడ్డింగ్‌ క్రింద, దేశభక్తికి సంబంధించిన ఆచారాలలో మనం భాగం వహించకపోవడానికి గల కారణం వివరించబడింది. ముఖ్యాంశాలను చర్చించండి, తమ పిల్లలతో ఈ సమాచారాన్ని జాగ్రత్తగా సమీక్షించమని తల్లిదండ్రులను ప్రోత్సహించండి. బ్రోషుర్‌లోని 20వ పేజీలోను, 1996 జనవరి 8 తేజరిల్లు! (ఆంగ్లం) 31వ పేజీలోను ఉన్న అనుభవాలను చెప్పండి. ప్రభుత్వ అధికారానికి గౌరవం చూపిస్తూ అదే సమయంలో, యెహోవాకు అనితర భక్తి చూపించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పండి.

8 నిమి: స్థానిక అవసరాలు.

15 నిమి: “పరిశుభ్రత దేవుణ్ణి ఘనపరుస్తుంది.” పెద్ద ఈ ఆర్టికల్‌ను ప్రేక్షకులతో చర్చిస్తాడు. 2002, ఫిబ్రవరి 1, కావలికోటలో 6-7 పేజీలలో ఉన్న సమాచారాన్ని సమీక్షించడం ద్వారా ముగించండి.

పాట 17 (187), ముగింపు ప్రార్థన.

మే 27తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

12 నిమి: స్థానిక ప్రకటనలు. మే నెల క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో ఉన్న మూడవది.) ఎలా అందించాలనే దాని గురించి ఒక యువ ప్రచారకుడు/ప్రచారకురాలిని ప్రదర్శించమనండి, జూన్‌ 1 కావలికోట!ను ఎలా ప్రతిపాదించాలో ఒక పెద్దవయసున్న ప్రచారకుడిని/ప్రచారకురాలిని ప్రదర్శించమనండి. ప్రతి ప్రదర్శన తర్వాత, ఆ ప్రదర్శనలో లేఖనం ఎంత సులభంగా చేర్చబడిందనే విషయంపై వ్యాఖ్యానించండి.

15 నిమి: “మీ సంఘానికి విస్తారమైన సేవా ప్రాంతం ఉందా?” సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. సంఘానికి ఎంత సేవా ప్రాంతం ఉందో, గత సంవత్సరం ఆ ప్రాంతంలోని ఎంత భాగాన్ని పూర్తిచేయడం జరిగిందో చెప్పండి. ఇవ్వబడిన సూచనలను స్థానికంగా ఎలా అన్వయించవచ్చో వివరించండి. చాలా అరుదుగా పనిచేసిన సేవా ప్రాంతాన్ని సమీప భవిష్యత్తులో పూర్తిచేయడానికి వేస్తున్న ప్రణాళికలను సమీక్షించండి.

18 నిమి: “అధ్యయనాలు ప్రారంభించడానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను మీరు ఉపయోగిస్తున్నారా?” (ఈ చర్చకు అందరి దగ్గర 2002 జనవరి మన రాజ్య పరిచర్య మధ్యపేజీలు ఉండాలి.) 3వ పేరాలోని ఉదాహరణను ఉపయోగిస్తూ, అధ్యయనాన్ని ఎలా ప్రారంభించాలో బాగా సిద్ధపడిన ప్రచారకుడిని ప్రదర్శించమనడంతో ప్రారంభించండి. తర్వాత, బ్రోషుర్‌లోని ముఖ్యాంశాలను తెలియజేసి, అధ్యయనాలను ప్రారంభించడానికి అది ఎలా చక్కగా రూపొందించబడిందో వివరించండి. 2002, జనవరి మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లో సూచించబడిన అందింపులను పునఃసమీక్షించడం యొక్క విలువను చూపించండి. ఏ అందింపులు ఫలవంతంగా ఉన్నాయని వారు కనుగొన్నారో ప్రేక్షకులను అడగండి. పైన చెప్పబడిన ప్రదర్శనను మళ్ళీ చేయడం ద్వారా ముగించండి.

పాట 20 (93), ముగింపు ప్రార్థన.

జూన్‌ 3తో ప్రారంభమయ్యే వారం

పాట 20 (93)

15 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రచారకులు, తాము మార్చి, ఏప్రిల్‌ లేక మే నెలల్లో సహాయ పయినీరు లేదా క్రమ పయినీరు సేవ చేయడం ద్వారా అనుభవించిన ఆశీర్వాదాల గురించి చెప్పడానికి ఏర్పాటు చేయండి.

15 నిమి: తర్కించడం (ఆంగ్లం) పుస్తకం, ఇతర బైబిలు అనువాదాలను ఎలా ఉపయోగిస్తుంది. క్లుప్తమైన ప్రసంగం తర్వాత ప్రేక్షకులతో చర్చ. తర్కించడం పుస్తకంలోని 8వ పేజీలో ఉన్న 2వ పేరాను చదివి, బైబిలును మన పరిచర్యలో ఎందుకు తరచుగా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అన్నది వివరించండి. 6వ పేజీలో ఉన్న బైబిలు సంక్షిప్తరూపాల పట్టికను చూపించి, మనము ఇతర బైబిలు అనువాదాలలోని పదబంధాలను ఎందుకు ఉపయోగిస్తామో వివరించండి. 1997 అక్టోబరు 1, కావలికోట, 16వ పేజీలోని 2వ పేరాలో మరియు 20వ పేజీలోని 15వ పేరాలో ఇవ్వబడిన హెచ్చరికలను చర్చించండి. తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో ఉన్న “అపోస్టెలిక్‌ సక్సెషన్‌,” “ఇమేజెస్‌,” “ట్రినిటీ” అనే విషయాల గురించి, సత్యాన్ని బోధించడానికి అనువాదాలను పోల్చిచూడడం ఎలా సహాయకరంగా ఉండగలదో వివరించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

15 నిమి: “సత్‌క్రియలు చేయడానికి మన విశ్వాసం మనలను కదిలిస్తుంది.”b 2వ పేరాను చర్చించేటప్పుడు, ఒక ఉత్సాహవంతమైన సాక్షిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఇతరులకు సాక్ష్యమివ్వడం, తన విశ్వాసాన్ని ఎలా ప్రదర్శిస్తుందో, ఎలా బలపరుస్తుందో ఆ ప్రచారకుడిని లేదా ప్రచారకురాలిని చెప్పమనండి.

పాట 4 (43), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి