అధ్యయనాలు ప్రారంభించడానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ను మీరు ఉపయోగిస్తున్నారా?
1 ఆసక్తిగల వ్యక్తితో క్లుప్తమైనవే అయినప్పటికీ క్రమంగా, పద్ధతి ప్రకారంగా బైబిలు చర్చలను చేసి, సిఫార్సు చేయబడిన ప్రచురణలలో ఒకదానినుండి సమాచారాన్ని పంచుకొన్నప్పుడు మీరు ఒక బైబిలు అధ్యయనాన్ని చేస్తున్నట్లేనని గ్రహిస్తున్నారా? అవును, అధ్యయనం గుమ్మం దగ్గర జరిగినా, టెలిఫోనులో జరిగినా ఇది వర్తిస్తుంది. మే మరియు జూన్ నెలల్లో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ను ఉపయోగించి అలాంటి అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రత్యేకమైన కృషి ఎందుకు చేయకూడదు?
2 సఫలత సాధించడానికి సిద్ధపడండి: దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ను ప్రతిపాదించేటప్పుడు, మీరు ఏమి చర్చించాలనుకుంటున్నారో స్పష్టంగా మనస్సులో ఉంచుకోండి. మీరు ఒకవేళ పునర్దర్శిస్తున్నట్లైతే, మొదటిసారి కలిసినప్పుడు మీ మధ్య జరిగిన సంభాషణ గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఆ చర్చను కొనసాగించి బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి, బ్రోషుర్లోని ఏ పేరాలపై నేను ప్రత్యేక అవధానాన్ని నిలపవచ్చు?’ మీరు ఇంటింటి పరిచర్య చేస్తున్నట్లైతే, ఒక యౌవనస్థునికి/రాలికి, ఒక వృద్ధునికి/రాలికి, ఒక పురుషునికి లేదా ఒక స్త్రీకి ఏ విషయాలు ఆసక్తికరంగా ఉంటాయో ఆలోచించండి. బ్రోషుర్లో చర్చించబడిన ముఖ్యమైన అంశాలను పరిశీలించుకుని, వారికి ఆసక్తి కలిగించే విషయాన్ని ఎన్నుకోండి. మీరు సంభాషణను ఎలా ప్రారంభించాలో నిర్ణయించుకున్న తర్వాత, దాన్ని అనేకసార్లు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం సఫలత సాధించడానికి ఒక కీలకం.
3 జనవరి, 2002 మన రాజ్య పరిచర్యలోని మధ్యపేజీల్లో “దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ను పరిచయం చేయడానికి సూచనలు” అనే ఆర్టికల్ ఎనిమిది సూచనలు ఇవ్వబడ్డాయి. అధ్యయనాలు ప్రారంభించడానికి బ్రోషుర్ను ఎలా ఉపయోగించాలో “సూటిగా ప్రస్తావించడం” అనే బాక్స్ చూపిస్తుంది. మీరు మొదటి సూచనను ఇలా సవరించుకోవచ్చు:
◼ “బైబిల్లోని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నకు కేవలం కొద్ది నిమిషాల్లోనే మీరు జవాబును కనుగొనగలరని మీకు తెలుసా? ఉదాహరణకు, క్రైస్తవమతాలని చెప్పుకునే మతాలు ఇన్ని ఎందుకున్నాయి? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?” ఆ వ్యక్తి ప్రతిస్పందించిన తర్వాత, 13వ పాఠానికి త్రిప్పి మొదటి రెండు పేరాలను చర్చించండి. సమయం ఉన్నట్లైతే, ఒకటి లేక రెండు వచనాలను చదివి చర్చించండి. తర్వాత, పేజీ మొదట్లో ఉన్న ఆఖరి ప్రశ్నను చదివి ఇలా అనండి: “మిగతా పాఠం, నిజమైన మతం యొక్క ఐదు గుర్తింపు చిహ్నాలను నొక్కి చెబుతుంది. మళ్ళీ వచ్చి వీటిని మీతో చర్చించడానికి నేను సంతోషిస్తాను.”
4 పట్టుదలతో ప్రయత్నించండి: దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ నుంచి అధ్యయనం ఎలా చేస్తామో చూపించడానికి ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోండి. యెహోవా ఆశీర్వాదం కోసం అడగండి. (మత్త. 21:22) మీరు మీ ప్రయత్నాలలో పట్టుదలతో ఉన్నట్లైతే, సువార్తకు ప్రతిస్పందించడానికి ఎవరికైనా సహాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని మీరు చవిచూడవచ్చు!