కావలికోట, తేజరిల్లు! పత్రికల నుండి ప్రయోజనం పొందుతూనే ఉండండి
సరళీకృత సాహిత్య పంపిణీ ఏర్పాటు అమలులోకి వచ్చినప్పటినుండి, కావలికోట, తేజరిల్లు! పత్రికలను తపాలా ద్వారా పంపించడాన్ని క్రమంగా నిలిపివేయాలని నిర్ణయించబడింది. కాబట్టి, మనకూ మనం ఎవరికైతే ప్రకటిస్తామో వారికీ ఒక్క సంచిక కూడా తప్పిపోకుండా అన్ని సంచికలూ అందేలా నిర్దారించుకొనేందుకు ఇప్పుడు అదనపు కృషి అవసరమవుతుంది.
వ్యక్తిగత ప్రతులు: మీ వ్యక్తిగత చందా గడువు తీరిపోయినప్పుడు, పత్రిక కౌంటర్ దగ్గర మీ ఆర్డర్‌ను పెంచుకోండి. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి తన స్వంత ప్రతి ఉండేలా సరిపడేన్ని పత్రికలను తల్లిదండ్రులు ఆర్డర్ చేయాలి. మీ వ్యక్తిగత ప్రతి మీద మీ పేరు వ్రాసుకుంటే, పరిచర్యలో ఆ పత్రిక పొరపాటున ఇతరులకు వెళ్ళిపోకుండా ఉంటుంది. పత్రికలు సంఘానికి వచ్చినప్పుడు, వాటిని చూసుకొనే సహోదరులు, ప్రతి సంచిక కూడా వెంటనే రాజ్య మందిరంలో లభ్యమయ్యేటట్టు చూస్తారు.
పత్రికా మార్గాలు: ప్రతి సంచికను పొందాలని కోరుకొనే ఆసక్తిగలవారందరితో పత్రికా మార్గాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రచారకులు కృషి చేయాలి. అటువంటి వారికి పత్రికలను స్వయంగా అందజేయడం, వారు చూపిన ఆసక్తిని పెంపొందింపజేసి బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి మనకు అవకాశాలనిస్తుంది.—1998 అక్టోబరు మన రాజ్య పరిచర్యలో 8వ పేజీని చూడండి.
ప్రత్యేక అవసరాలు కలవారు: అనియమిత క్షేత్రంలో నివసిస్తున్న ఒక వ్యక్తి యథార్థమైన ఆసక్తిని చూపిస్తే, అతను తపాలా ద్వారా పత్రికలు పొందడానికి అనుమతించవచ్చు. సంఘ క్షేత్రంలోనే నివసించే ఒక వ్యక్తి పత్రికలను పొందడానికి నిజంగా ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, పత్రికా మార్గం ద్వారా ఆయనను చేరుకోలేకపోయినప్పుడు, విషయాన్ని సంఘ సేవా కమిటీతో చర్చించండి. వాళ్ళు ఆమోదిస్తే, ఆ వ్యక్తికి తపాలా ద్వారా పత్రికలు అందేలా చూడవచ్చు. దాని కొరకు స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ ఫారాలను (M-1, M-101) ఉపయోగించవచ్చు.
కావలికోట, తేజరిల్లు! పత్రికల ద్వారా రాజ్యం గురించి తెలియజేయడానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ యెహోవా ఆశీర్వదిస్తూనే ఉంటాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.