‘అందరియెడల మేలు చేయండి’
1 ‘దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించండి’ మరియు ‘సత్క్రియలు అను ధనము గలవారై ఉండండి’ అనేవి 2002 ఫిబ్రవరి, మార్చి మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లో ఉపయోగించబడిన అంశాలు. (కొలొ. 1:25; 1 తిమో. 6:18) ఆ సంచికలలో, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేలా ఆసక్తిగలవారికి సహాయపడడానికి, మళ్ళీ సంఘంతో కలిసేలా నిష్క్రియులకు సహాయపడడానికి, మన పిల్లలు మరియు యోగ్యులైన బైబిలు విద్యార్థులు సువార్తను ప్రకటించడం ప్రారంభించేందుకు సహాయపడడానికి అదనపు కృషి చేయాలని మనమందరం ప్రోత్సహించబడ్డాం. మనము కష్టపడి చేసిన ప్రయత్నాల ఫలితంగా మనం నిస్సందేహంగా కొంత విజయాన్ని సాధించాం. ఇప్పుడు, ‘మనకు సమయము దొరకినకొలది అందరియెడల మేలు చేయడంలో కొనసాగుదాము.’—గల. 6:10.
2 మళ్ళీ హాజరవ్వమని వారిని ఆహ్వానించండి: ఇండియా బ్రాంచి క్షేత్రంలో, గత సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వారిలో ముప్ఫైయి వేల కంటే ఎక్కువ మంది సువార్త ప్రచారకులు కాని వారున్నారు. వారు అలా హాజరవ్వడం వారికి కొంత ఆసక్తి ఉందని సూచిస్తోంది కాబట్టి ‘నిత్యజీవం పట్ల సరైన మనోవైఖరి గలవారు విశ్వాసులయ్యేందుకు’ వారిని ప్రేరేపించడానికి మనం ఏమి చేయాలి? (అపొ. 13:48, NW) సాధ్యమైనంత త్వరగా సంఘ కూటాలకు తిరిగి రమ్మని వారిని ప్రోత్సహించండి.
3 యెషయా ప్రవచనానికి సంబంధించిన ఆసక్తికరమైన చర్చను విని ఆనందించడానికి, ఒక ఆసక్తిగల వ్యక్తిని సంఘ పుస్తక అధ్యయనానికి ఎందుకు ఆహ్వానించకూడదు? ఆ వ్యక్తికి మీరు బంధువో లేదా పరిచయస్థులో అయితే, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మీకు ప్రసంగించే నియామకం ఇవ్వబడినప్పుడు, మీ ప్రసంగం వినడానికి రమ్మని ఆ వ్యక్తిని ఆహ్వానించవచ్చు. రాబోయే వారాలలో ఇవ్వబడే బహిరంగ ప్రసంగాంశాల గురించి అతనికి తెలియజేస్తూ ఉండండి. (ఇన్ఫర్మేషన్ బోర్డ్ మీద అప్-టు-డేట్ షెడ్యూల్ అంటించి ఉంచాలి.) యెహోవాను ఆరాధించాలనే కోరికను అతనిలో పునఃప్రేరేపించడానికి అవకాశాల కోసం వెదకండి. సంఘంలో ఎవరైనా ఇంకా ఆయనతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించనట్లైతే, మీరు ఆయనతో అధ్యయనం చేయడానికి సుముఖతతో ఉన్నట్లు స్నేహపూర్వకంగా ఆయనకు తెలియజేయవచ్చు.
4 నిష్క్రియులను ప్రోత్సహిస్తూనే ఉండండి: జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేవారిలో చాలామంది ఇప్పటికే యెహోవాకు సమర్పించుకున్నారు. కానీ, ఒకానొక సమయంలో వారు చురుకుగా సువార్త ప్రకటించడం మానేశారు. అయితే, ‘విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడల మేలు చేయండి’ అని పౌలు మనకు బోధించాడు. (గల. 6:10) కాబట్టి, నిష్క్రియులపై మనం ప్రధానంగా శ్రద్ధ చూపించాలి.
5 బహుశా, పరిచర్యలో మళ్ళీ పాల్గొనమని పెద్దలు, ఇతరులు అందించిన ప్రోత్సాహానికి కొందరు ఇప్పటికే ప్రతిస్పందించి ఉండవచ్చు. తిరిగి క్రియాశీలుడైన ప్రచారకునితో పనిచేయమని పెద్దలు మిమ్మల్ని నియమిస్తే, యెహోవాపై, క్షేత్రసేవపై మీకున్న ప్రేమ అతనిలో నమ్మకాన్ని పెంచుతుందని గుర్తుంచుకోండి. అతను పరిచర్య చేయడంలో ఆనందించి, దానిలో కొనసాగుతూ, యెహోవా ఆశీర్వాదాలను అనుభవించే విధంగా మీరు పరిచర్యకు సంబంధించిన వివిధ భాగాలలో ఎలా పాల్గొంటారో అతనికి చూపించండి.
6 క్రొత్త ప్రచారకులకు మంచి ఆరంభం ఇవ్వండి: క్రొత్తగా ఆసక్తి చూపించిన ఒక స్త్రీ తాను దేవుని నిజమైన సంస్థను కనుగొన్నానని గ్రహించినప్పుడు, వెంటనే సేవ చేయడం ప్రారంభించాలని అనుకొంది. దానికి ముందు తాను ఏమి చేయాలో తెలుసుకొన్న తర్వాత ఆమె, “నేను వెంటనే దాన్ని ప్రారంభించాలనుకొంటున్నాను” అని అన్నది. మీరు బైబిలు అధ్యయనం చేస్తున్న వ్యక్తి క్షేత్రసేవలో పాల్గొనడానికి అనుమతించబడితే, ‘వెంటనే ప్రారంభించవలసిన’ అవసరతను గ్రహించేందుకు అతనికి సహాయపడండి. అలా క్రొత్త ప్రచారకునికి మంచి ఆరంభం ఇవ్వండి. పరిచర్యకు సిద్ధపడి, ప్రతి వారం క్రమంగా క్షేత్రసేవలో పాల్గొనే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అతనికి సహాయపడండి.
7 ఇటీవలనే, బాప్తిస్మం పొందని ప్రచారకుడయ్యింది మీ కుమారుడే అయితే, తన వయస్సుకు సామర్థ్యానికి తగ్గట్టు అభివృద్ధి సాధించేందుకు అతనితోపాటు కలిసి పనిచేయండి. మీ నుండి కొంత సహాయం పొందిన తర్వాత, తాను ఒక వ్యక్తితో ఎంత విజయవంతంగా సంభాషించగలడు, బైబిలునుండి చదవగలడు, సాహిత్యాలను అందించగలడు అన్నది చూపించి మిమ్మల్నే ఆశ్చర్యపరచవచ్చు. క్షేత్రసేవలో, మంచిగా ప్రతిస్పందించిన వ్యక్తి అతనికి కలిస్తే, పునర్దర్శనం చేసి ఆసక్తిని పెంపొందింపజేయడానికి అతనికి శిక్షణనివ్వండి.
8 మీ పరిచర్యను విస్తరింపజేసుకోండి: జ్ఞాపకార్థ ఆచరణ కాలం తర్వాత కూడా సువార్త ప్రకటించే పనిలో ఎక్కువగా భాగం వహించడానికి మీ పరిస్థితులు అనుమతిస్తాయా? మీరు సాధారణంగా ప్రతి వారం సేవలో గడిపే సమయానికి ఒకటి లేదా రెండు గంటలు ఎక్కువ జోడించగలరా? మీరు మళ్ళీ సహాయ పయినీరు సేవ ఎప్పుడు చేయగలమా అని క్యాలండర్ చూస్తున్నారా? లేదా పూర్తికాల సేవ చేయడానికి మీరు మీ జీవిత విధానానికి మార్పులు చేసుకోగలరా? మనం పరిచర్యలో చేసే కృషి అంతా కూడా ఎవరైనా సత్యం అంగీకరించడానికి సహాయపడగలదు! (అపొ. 8:26-39) మనం రాబోయే రోజుల కోసం ఎదురుచూస్తుండగా, మనం ‘ఒకరియెడల ఒకరము, మనుష్యులందరి యెడల, ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొందాం.’—1 థెస్స. 5:15.
[3వ పేజీలోని బాక్సు]
సహాయపడుతూనే ఉండండి:
□✔ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారికి
□✔ తిరిగి క్రియాశీలురైన ప్రచారకులకు
□✔ బాప్తిస్మం పొందని క్రొత్త ప్రచారకులకు