కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/02 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఉపశీర్షికలు
  • ఏప్రిల్‌ 8తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 15తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 22తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 29తో ప్రారంభమయ్యే వారం
  • మే 6తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2002
km 4/02 పేజీ 2

సేవా కూటాల పట్టిక

ఏప్రిల్‌ 8తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

13 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఏప్రిల్‌ 22తో ప్రారంభమయ్యే వారంలోని సేవా కూటములో జరగబోయే చర్చకు సిద్ధపడటానికి యువత ఇలా అడుగుతోంది​—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం) అనే వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను మరియు ఏప్రిల్‌ 15 కావలికోటను ఎలా అందించాలో రెండు వేర్వేరు ప్రదర్శనలను ప్రదర్శించండి. ప్రతి ప్రదర్శనలోనూ, “నాకు నా స్వంత మతముంది” అని సంభాషణను ఆటంకపరిచే వారితో విభిన్నమైన రీతుల్లో ఎలా వ్యవహరించాలో చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 10వ పేజీని చూడండి.

12 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: “అందరియెడల మేలు చేయండి.”a ప్రశ్నా జవాబుల చర్చ తర్వాత, ఒకరు లేక ఇద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి, తమ పరిచర్యను ఎలా విస్తరింపచేసుకుంటున్నారో వారు చెబుతారు.

పాట 27 (221), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 15తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: పయినీర్లు ఇతరులకు సహాయపడుతూనే ఉంటారు. సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్త, ఒక పయినీరు, ఒక ప్రచారకుడు/రాలు ఉన్న గుంపుతో సేవా పైవిచారణకర్త జరిపే చర్చ. సేవా పైవిచారణకర్త, పయినీర్లు ఇతరులకు సహాయపడతారు అనే కార్యక్రమం గురించి 1998, సెప్టెంబరు మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీలో ఇవ్వబడిన సమాచారాన్ని పునఃసమీక్షిస్తాడు. తర్వాత, చర్చలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరితో ఈ కార్యక్రమంలో ఆమె గానీ అతడు గానీ వహించవలసిన పాత్ర గురించి, ఆ కార్యక్రమం తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తోందనే దాని గురించి చర్చిస్తాడు. దాన్ని సఫలం చేయడానికి ఏమి చేయబడుతుంది? పరిచర్యలో సహాయం కావాలని కోరుకొంటే తనకు తెలియజేయమని సేవా పైవిచారణకర్త ప్రచారకులందరినీ ఆహ్వానిస్తాడు. గతంలో సహాయం పొందిన వారు పరిచర్యలోని ఇంకొక అంశంలో మరింత సహాయం పొందేలా మళ్ళీ వారిని చేర్చుకోవచ్చు.

20 నిమి: “పూర్తికాల సేవలోని ఆనందాలు.”b సెలవు నెలల్లో సహాయ పయినీరు సేవ చేయడానికి దరఖాస్తు నింపమని యౌవనస్థులను ప్రోత్సహించండి.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 22తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ, ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ఒక సహోదరిని ప్రదర్శించమనండి, మే 1 కావలికోటను ఎలా అందించాలనేదాని గురించి ఒక పరిచర్య సేవకుడిని ప్రదర్శించమనండి. ప్రతి ప్రదర్శన తర్వాత, గృహస్థుల ఆసక్తిని రేకెత్తించడానికి ప్రచారకులు ఉపయోగించిన మొదటి ఒకటి రెండు వాక్యాలను మీరు మళ్ళీ చెప్పండి.

10 నిమి: సమయానికి రండి! ఒక ప్రసంగం. మన ఆరాధనకు, సేవకు సంబంధించిన కార్యకలాపాలు, “నిర్ణీత సమయం” అవసరమయ్యే ప్రాముఖ్యమైన కార్యాలు. (ప్రసం. 3:1, NW) దైవపరిపాలనా ఏర్పాట్లనుండి మనం పూర్తిగా ప్రయోజనం పొందాలనుకుంటాము. సంఘ కూటాలు, క్షేత్రసేవకు సంబంధించిన కూటాలు సరిగ్గా నిర్దేశించబడ్డ సమయానికే మొదలవ్వాలి. తన కార్యకలాపాలను నెరవేర్చడంలో యెహోవా ఎప్పుడూ ఆలస్యం చేయడు. (హబ. 2:3) ఈ విషయంలో మనము అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందా? అనివార్య కారణాల వల్ల కొందరికి అప్పుడప్పుడు ఆలస్యమైపోవచ్చు. కానీ మంచి వ్యవస్థీకరణ ఉంటే, కూటములో ప్రారంభపు పాట, ప్రార్థన అయిపోయిన తర్వాతగానీ, క్షేత్రసేవ ఏర్పాట్లు చేయడం అయిపోయిన తర్వాతగానీ అలవాటుగా ఆలస్యంగా రావలసిన అవసరం ఉండదు. మనము ఆధ్యాత్మిక కార్యకలాపాలన్నిటికీ సమయానికి ఉండేటట్టు తోడ్పడే మెరుగైన అలవాట్లను పెంపొందించుకోవడానికి ఆచరణాత్మకమైన పద్ధతులను చర్చించండి.​—జూన్‌ 15, 1990, కావలికోట, (ఆంగ్లం) 29వ పేజీ చూడండి.

25 నిమి: “హృదయపూర్వక ప్రతిస్పందన!”c మొదటి పేరాలో, యువత ఇలా అడుగుతోంది​—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం) వీడియో గురించి సంఘంలోని వారిని క్లుప్తంగా వ్యాఖ్యానించమనండి. వెంటనే 2-7 పేరాలలో ఇవ్వబడిన ప్రతి ప్రశ్నపై ప్రేక్షకులతో చర్చను ప్రారంభించండి. జూన్‌లో విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం (ఆంగ్లం) అనే వీడియోను పునఃసమీక్షిద్దాం.

పాట 21 (191), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 29తో ప్రారంభమయ్యే వారం

పాట 18 (162)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌ క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.

15 నిమి: “రాజ్య ప్రకటన ప్రాణాలను రక్షించేందుకు సహాయపడుతుంది!”d లేఖనాలు ఎలా అన్వయిస్తాయనే విషయంలో ప్రేక్షకులనుండి వ్యాఖ్యానాలను రాబట్టండి.

20 నిమి: తర్కించడం (ఆంగ్లం) పుస్తకం ఉపయోగించి పరిశోధించండి. ప్రేక్షకులతో చర్చ. తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో ఉన్న “ప్రిన్సిపల్‌ సబ్జెక్ట్స్‌” (5-6 పేజీలు) క్రింద ఇవ్వబడని విషయాలను గురించిన ప్రశ్నలు తరచుగా పరిచర్యలో తలెత్తుతాయి. మన నమ్మకాలను సమర్థించే లేఖనాలను వెతికి పట్టుకోవడానికి “ఇండెక్స్‌” (439-45 పేజీలు) చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇండెక్స్‌లో ఇటాలిక్కులలో ఉన్న పదాల క్రింద చూడడం ద్వారా, ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలను వెదకమని ప్రేక్షకులను ఆహ్వానించండి: జాతీయ గీతాలు, పతాకాల విషయంలో ఒక క్రైస్తవుడు ఎలాంటి దృష్టిని కలిగి వుంటాడు? దేవుడు విపత్తులను ఎందుకు అనుమతిస్తున్నాడు? విడాకుల విషయంలో బైబిలు దృష్టిని మీరు ఎలా వివరించగలరు? సహోదరీలు కొన్నిసార్లు ఎందుకు తలమీద ముసుగు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి? మదర్స్‌ డే మూలం ఏమిటి? బైబిలులో ఉన్న 1,44,000 అనే సంఖ్య అక్షరార్థ సంఖ్య అని మనకెలా తెలుసు? ధనవంతుడు మరియు లాజరు ఉపమాన భావం ఏమిటి? పరిచర్యలో తర్కించడం (ఆంగ్లం) పుస్తకం ఉపయోగించమని అందరినీ ప్రోత్సహించండి.

పాట 20 (93), ముగింపు ప్రార్థన.

మే 6తో ప్రారంభమయ్యే వారం

పాట 17 (187)

10 నిమి: స్థానిక ప్రకటనలు. పనిస్థలానికి ప్రయాణించేటప్పుడు, సెలవు సమయాల్లో, లేక సాక్షులు కాని బంధువులను సందర్శించేటప్పుడు అనియతంగా సాక్ష్యం ఇవ్వడాన్ని గురించిన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

10 నిమి: “కావలికోట, తేజరిల్లు! పత్రికల నుండి ప్రయోజనం పొందుతూనే ఉండండి.” ప్రేక్షకులతో చర్చ.

25 నిమి: “ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాలు​—ఎలా?”e ఆర్టికల్‌ చర్చించిన తర్వాత, ఫిబ్రవరి 15, 1999, కావలికోట, 10-12 పేజీల నుంచి కొన్ని ఆచరణాత్మకమైన అనుభవాలను చెప్పండి.

పాట 7 (51), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి