కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/02 పేజీ 6
  • పరిపాలక సభ నుండి ఒక ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభ నుండి ఒక ఉత్తరం
  • మన రాజ్య పరిచర్య—2002
మన రాజ్య పరిచర్య—2002
km 3/02 పేజీ 6

పరిపాలక సభ నుండి ఒక ఉత్తరం

మనం 21వ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో అడుగుపెడుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘సహోదరులైన’ మీరు కష్టించి చేస్తున్న పనిని బట్టి మిమ్మల్ని మెచ్చుకుంటూ వ్రాయడం మాకు చాలా సంతోషంగా ఉంది. (1 పేతు. 2:17) దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసు ఇలా అడిగాడు: “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” (లూకా 18:⁠8) గత సేవా సంవత్సరంలో మీరు ఆసక్తితో చేసిన సేవ, యేసు అడిగిన ఆ ప్రశ్నకు అవును అని బిగ్గరగా సమాధానమిస్తోంది! మీలో కొందరు మీ విశ్వాసాన్ని బట్టి తృణీకారానికి, అవమానానికి గురయ్యారు. చాలా ప్రదేశాల్లో, యుద్ధాలు, విపత్తులు, వ్యాధులు, లేక ఆకలి వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు సహిస్తున్నారు. (లూకా 21:10, 11) మంచి కార్యాల పట్ల మీరు చూపిస్తున్న ఆసక్తి మూలంగా యేసు ఇంకా ‘భూమిమీద విశ్వాసము కనుగొనగలడు.’ దాని మూలంగా పరలోకంలో కూడా ఆనందం కలుగుతోందన్నది సుస్పష్టం!

సహించడం సులభం కాదన్నది మనకు తెలుసు. పశ్చిమ ఆసియాలోని ఒక దేశంలో మన సహోదరులు అనుభవిస్తున్న శ్రమలను పరిశీలించండి. ఆ దేశంలో యెహోవాసాక్షులపై దౌర్జన్యం దాదాపు సర్వసాధారణమైపోయింది. ఇటీవలే, 700 మందితో ప్రశాంతంగా జరుగుతున్న సమావేశానికి పోలీసులు భంగం కలిగించారు. హాజరు కాకుండా మరో 1300 మందిని మార్గావరోధాలు ఆటంకపరిచాయి. ముసుగులు ధరించిన మూక, సమావేశ స్థలానికి వచ్చి అల్లకల్లోలం సృష్టించి, సమావేశానికి వచ్చినవారిలో చాలామందిని కొట్టి, సమావేశ స్థలానికి నిప్పంటించారు, ముసుగులు ధరించిన ఆ మూకలో కొందరు పోలీసులు కూడా ఉన్నారు. మరితర సందర్భాల్లో మతసంబంధమైన తీవ్రవాదులు, మేకులు దిగగొట్టిన దుడ్డుకర్రలతో మన సహోదరులను అతి క్రూరంగా కొట్టారు.

అలాంటి దాడులు తల్లడిల్లజేసినప్పటికీ, అవి ఆశ్చర్యకరమైనవేమీ కాదు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమో. 3:12) మొదటి శతాబ్దంలో క్రైస్తవులు మౌఖిక, శారీరక హింసను సహించారు, కొందరైతే చంపబడ్డారు కూడా. (అపొ. 5:40; 12:2; 16:22-24; 19:9) అదే 20వ శతాబ్దంలో కూడా నిజమయ్యింది, నిస్సందేహంగా అది 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ యెహోవా మనకిలా హామీ ఇస్తున్నాడు: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు.” (యెష. 54:17) అది ఎంత అద్భుతమైన హామీ! వాస్తవానికి మనం యెహోవాకు ఎంతో అమూల్యమైన వారము, అందుకే ఆయన తన ప్రవక్తయైన జెకర్యా ద్వారా ఇలా చెప్తున్నాడు: ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు.’ (జెక. 2:8) యెహోవా ఆరాధకుల శత్రువులకు తుది విజయం లభించే అవకాశం లేదు. స్వచ్ఛారాధనే విజయం సాధిస్తుంది!

ఉదాహరణకు, ముందు ప్రస్తావించిన దేశంలోని యెహోవాసాక్షులు, 2001వ సేవా సంవత్సరంలో ప్రచారకుల సంఖ్యలో రెండు క్రొత్త శిఖరాగ్ర స్థాయిలను చేరుకున్నారు. అవును, సర్వత్రా ఉన్న సహోదరులు చేస్తున్నట్లుగానే అక్కడున్న మన సహోదరులు కష్టాలున్నప్పటికీ పట్టుదలతో కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత సేవా సంవత్సరంలో, యెహోవాకు తాము సమర్పించుకున్న దానికి గుర్తుగా ప్రతి వారం 5,066 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు ఈ క్రొత్తవారు మనందరితో పాటు “ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని” నిశ్చయంచుకున్నారు.​—కొలొ. 4:12.

గ్రీస్‌లో ఇటీవలే జరిగిన కొన్ని అభివృద్ధులను కూడా పరిశీలించండి. సంవత్సరాలపాటు గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చి నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు యెహోవాసాక్షులు “అందరికి తెలిసిన మతం” అని ప్రభుత్వ అంగీకారాన్ని పొందారు. ఆ గుర్తింపును ఇస్తున్న డాక్యుమెంట్‌, గ్రీస్‌ బేతేలు భవనం గురించి చెబుతూ “దేవుని ఆరాధన కోసం సమర్పించబడిన పవిత్రమైన, ప్రతిష్ఠించబడిన ప్రదేశం” అని కూడా చెబుతోంది. గత సేవా సంవత్సరంలో, అమెరికా, కెనడా, జపాన్‌, జర్మనీ, బల్గేరియా, రష్యా, రొమేనియా వంటి దేశాల్లో మన ఆరాధనకు సంబంధించి న్యాయస్థానాలు చట్టబద్ధంగా అనుకూలమైన తీర్పులను ఇచ్చాయని తెలియజేయడానికి కూడా మేము ఆనందిస్తున్నాము. ఆ దేశాల్లో కార్యానుకూలమైన మంచి సమయాన్ని ఇచ్చినందుకు యెహోవాకు మనమెంతగా కృతజ్ఞత తెలియజేస్తామో కదా!

ఈ అంత్యదినాల్లో యెహోవా తన ప్రజలకు మద్దతునిచ్చే మార్గాలను మనం పరిశీలిస్తుండగా, ఆయన మనం కలిగి ఉండగల శ్రేష్ఠమైన స్నేహితుడని గ్రహిస్తాము. ఆయన మనలను ప్రేమిస్తున్నాడని, మనకు బోధిస్తాడని, మనల్ని సరిదిద్దుతాడని తెలుసుకుని, ఆయనతో మనకు గల సంబంధం విషయంలో మనం ఆనందిస్తాము. అవును, మనకు విశ్వాస పరీక్షలు వస్తూనే ఉంటాయి. కానీ యెహోవాపై మనకున్న అచంచలమైన విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. యాకోబు ఇలా వ్రాశాడు: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” (యాకో. 1:2, 3) అంతేగాక, మన సహనం యెహోవాపై మనకున్న ప్రేమను వెల్లడిచేస్తుంది, అది మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది! ప్రియ సహోదరులారా, యెహోవా మనలో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తాడని నమ్మకం కలిగివుండండి. మనం నమ్మకంగా నిలిచివుంటే మనం నూతనలోకంలోకి ప్రవేశించేలా ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. మనం విజయవంతులమవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు.

కాబట్టి, మనముందున్న అద్భుతమైన ఆశీర్వాదాలను మనసులో ఉంచుకొమ్మని సహోదర సహోదరీలను, పెద్దలు చిన్నలను అందర్నీ మేము కోరుతున్నాము. మన దృక్పథం కూడా, “మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను” అని వ్రాసిన అపొస్తలుడైన పౌలు వలె ఉండాలి. (రోమా. 8:18) ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ యెహోవాపై ఆధారపడండి. సహించండి, వదిలిపెట్టకండి. అలా చేసినందుకు మీరెన్నటికీ పశ్చాత్తాపపడరు. దేవుని వాక్యం మనకిలా హామీ ఇస్తోంది: “నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.”​—హబ. 2:4.

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి