కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/02 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2002
మన రాజ్య పరిచర్య—2002
km 3/02 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చి నెలలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయబడతాయి. ఏప్రిల్‌ మరియు మే నెలల్లో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ప్రపంచవ్యాప్త పని కొరకు చందా ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని ప్రచారకులు గృహస్థులకు తెలియజేయాలి. ఆసక్తి చూపించిన చోట బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకమైన కృషి చేస్తూ దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. జూన్‌ నెలలో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహస్థుల వద్ద ఈ ప్రచురణలు ఉంటే, సంఘపు స్టాకులో ఉన్న ఏదైనా బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.

◼ ఏప్రిల్‌లో సహాయ పయినీరు సేవ చేయాలనుకునే ప్రచారకులు ఇప్పుడే పథకాలు వేసుకుని, తమ దరఖాస్తులను ముందుగా ఇవ్వాలి. ఇలా చేయడంవల్ల అవసరమైన క్షేత్రసేవా ఏర్పాట్లు చేయడానికి, తగినన్ని పత్రికలు, ఇతర సాహిత్యం అందుబాటులో ఉంచేందుకు పెద్దలకు వీలౌతుంది. సహాయ పయినీరు సేవ చేయడానికి ఆమోదం పొందిన వారందరి పేర్లను ప్రతి నెలా సంఘంలో ప్రకటించాలి.

◼ జ్ఞాపకార్థ ఆచరణ మార్చి 28, 2002, గురువారంనాడు జరుగుతుంది. ఒకవేళ మీ సంఘంలో కూటాలు సాధారణంగా గురువారం జరిగేటట్లయితే, రాజ్యమందిరం అందుబాటులో ఉంటే, వారంలోని మరో రోజుకు వాటిని మార్చాలి. ఒకవేళ అలా వీలుపడక మీరు సేవా కూటము జరుపుకోలేకపోతే, ప్రత్యేకించి మీ సంఘానికి అన్వయించే భాగాలను మాత్రం ఇంకొక సేవా కూటములో చేర్చవచ్చు.

◼ సాహిత్యాలను పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసే రిక్వెస్ట్‌లను సంస్థ అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను బ్రాంచికి పంపించే ముందు ప్రతి నెలా దాని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావల్సిన సాహిత్యాలను తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల విషయం చూసుకుంటున్న సహోదరునికి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.

◼ యెహోవాసాక్షులు మరియు విద్య (ఆంగ్లం) బ్రోషుర్‌లను అవసరమైన భాషలలో సరిపడినంత స్టాకును సంఘాలు ఆర్డర్‌ చేయాలి. క్రొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే సమయమైన మే నెలాఖరు నుండి జూన్‌ నెల ప్రారంభం వరకు, స్కూలుకు వెళ్ళే పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు సరిగ్గా సన్నద్ధులై ఉండడానికి ఆ బ్రోషుర్‌లు దోహదపడతాయి.

◼ పత్రికలను, సాహిత్యాలను ప్రచురించి, రవాణా చేయడంలో ఇమిడివున్న ఖర్చుల దృష్ట్యా, నియమించబడ్డ సహోదరులు మరియు ప్రచారకులు ఈ క్రింద ఇవ్వబడ్డ విషయాలకు అవధానమివ్వడం సొసైటీకి ఆర్థికపరంగా సహాయపడుతుంది:

చాలా సంఘాలలో, సంవత్సరాల తరబడి ఉపయోగించడానికి సరిపడా పుస్తకాలు, బ్రోషుర్ల అదనపు స్టాకు ఉందని సంఘాలనుండి అందుకున్న సెప్టెంబరు 1, 2001, వార్షిక సాహిత్య ఇన్వెంటరీ వెల్లడిచేస్తుంది. అదే సమయంలో, ఇలాంటి సంఘాలనుంచి ఇంకా ఎక్కువ సాహిత్యాల కొరకు అడుగుతూ రిక్వెస్టులు వస్తున్నాయి. క్రొత్త సాహిత్యాల కొరకు రిక్వెస్టు చేసే ముందు ప్రస్తుతం ఉన్న స్టాకును ఉపయోగించవలసిందిగా అన్ని సంఘాలు ప్రోత్సహించబడుతున్నాయి. సంఘాలు, కేవలం మూడు నెలలకు సరిపడా సాహిత్యాలను మాత్రమే స్టాకులో పెట్టుకోవాలని ఆశించబడుతుంది. కాబట్టి, సాహిత్య రిక్వెస్టును సొసైటికి పంపించేముందు, సంఘం వద్ద అదనపు స్టాకు లేదని సేవా పైవిచారణకర్త స్వయంగా నిశ్చయపరచుకోవాలి.

తమ సంఘంలో పత్రికలు అలాగే పోగవ్వకుండా కార్యదర్శి మరియు సేవా పైవిచారణకర్త శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ అలా పోగైతే, వాటిని సాధ్యమైనంత త్వరగా అందించడానికి ప్రత్యేక అందింపు కార్యక్రమాల్ని చేపట్టి, సంఘపు పత్రికా సరఫరాను తగ్గించమని బ్రాంచి కార్యాలయాన్ని అడుగుతూ క్రొత్త ఆర్డర్‌ను పంపించాలి. పత్రికలు, సాహిత్యాలు ప్రచారకుల ఇళ్ళలో కూడా పోగవ్వకూడదు. ప్రచారకులందరు, వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి మరియు క్షేత్రసేవలో అందించడానికి అవసరమైనన్ని మాత్రమే రిక్వెస్టు చేయాలి.

◼ ఇండియా బ్రాంచి కార్యాలయాన్ని బెంగుళూరులోని క్రొత్త భవనాలకు మార్చే సందర్భంగా, 2002 మార్చి మధ్యనుంచి ఏప్రిల్‌ మధ్యవరకు, రిక్వెస్టు చేసిన సాహిత్యాలను, పత్రికలను పంపించడం కుదరదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి