కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/02 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 3/02 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జన.-మార్చి

“ఇటీవలి సంవత్సరాల్లో కుటుంబ జీవితాల్లో హింస పెరిగిపోయిందని మనకు అవగతమౌతోంది. తమ స్వంత గృహాలలోనే బాధను అనుభవిస్తున్న వారికి సహాయం చేయడానికి ఏమి చేయవచ్చు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [జవాబు చెప్పిన తరువాత, కీర్తనలు 72:12, 14 చదవండి.] ‘హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం’ అనే ఈ ఆర్టికల్‌, అంతకంతకూ పెరిగిపోతున్న ఈ సమస్య యొక్క ఒక అంశాన్ని పరిశీలించి, నిరీక్షణా సందేశాన్ని అందిస్తుంది. ఈ సమాచారం ద్వారా ప్రయోజనం పొందగల వారెవరైనా మీకు తెలిసి ఉండవచ్చు.”

కావలికోట మార్చి 15

“నీతియుక్తమైన పరిపాలన ఈ భూమిని జీవించడానికి మరింత మంచి ప్రదేశంగా చేస్తుందని మీరు అంగీకరిస్తారా? [జవాబు చెప్పనివ్వండి.] బైబిలు ఏమి వాగ్దానం చేస్తుందో దయచేసి గమనించండి. [కీర్తన 37:⁠11 చదవండి.] ఈ ఆర్టికల్‌లలో గుర్తించబడిన ఆదర్శవంతమైన నాయకుని అధికారం క్రింద నిజమవ్వబోయే అటువంటి శాంతిని మనము అనుభవించగలము.”

తేజరిల్లు! జన.-మార్చి

“నేటి లోకంలో మంచివాళ్ళకంటే పూర్తిగా దుష్టులైన వారే చక్కగా బ్రతుకుతున్నారని అనేకులు భావిస్తారు. దానిలో కొంత నిజముందని మీరు అనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] “దేవుడు ఎంతవరకు సహిస్తాడు” అనే ఈ ఆర్టికల్‌, దేవుడు ప్రస్తుత పరిస్థితిని అనుమతించడానికి ఒక కారణముంది కానీ ఆయన సహనం త్వరలోనే సమాప్తమవుతుందని చూపిస్తుంది. మంచివారికి, చెడ్డవారికి అది ఏ భావాన్ని కలిగి ఉంటుంది, జవాబును ఈ పత్రికలో చదవడాన్ని మీరు ఆనందిస్తారు.”

కావలికోట ఏప్రిల్‌ 1

“బైబిలుల్లోంచి ఒక ఉల్లాసభరితమైన విషయాన్ని మీతో పంచుకోనివ్వండి. [మత్తయి 22:⁠37 చదవండి.] దీనర్థం ఏమిటని మీరనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] ‘మీ హృదయంతోను, మనస్సుతోను దేవుణ్ణి వెదకండి’ అనే ఈ ఆర్టికల్‌ను పరిశీలించండి. నిజమైన విశ్వాసమనేది కేవలం హృదయానికి సంబంధించినదేనా, లేక అది మనసుకు కూడా సంబంధించినదై ఉండాలా? ఈ ప్రశ్నకు జవాబు జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి