కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/02 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఉపశీర్షికలు
  • మార్చి 11తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 18తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 25తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 1తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2002
km 3/02 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మార్చి 11తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (15)

13 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను మరియు మార్చి 15 కావలికోటను ఎలా అందించాలో రెండు వేర్వేరు ప్రదర్శనలను ప్రదర్శించండి. ప్రతి ప్రదర్శనలోనూ, “నాకు ఇష్టం లేదు” అంటూ సంభాషణను ఆపుచేసే వారితో ఎలా వ్యవహరించాలో వేరు వేరు విధాలుగా చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలోని 8వ పేజీని చూడండి.

12 నిమి: వేసవి సెలవుల్లో మీరేమి చేయాలనుకుంటున్నారు? ఒక పెద్ద లేక పరిచర్య సేవకుడు మరియు అతని కుటుంబం, తాము వేసవి నెలల్లో ఏమి చేయాలనుకుంటున్నామన్న దాని గురించి చర్చిస్తారు. వారు ఒక కుటుంబంగా సహాయ పయినీరు సేవ చేయడం గురించి, బహుశ సెలవు తీసుకుని వినోద కార్యక్రమాల కోసం కొంత సమయాన్ని వెచ్చించడం గురించి మాట్లాడతారు. వారు ఎక్కడికి వెళ్ళినా, కూటాలకు హాజరు కావడం, క్షేత్ర సేవలో భాగం వహించడం, కుటుంబ బైబిలు అధ్యయనం చేసుకోవడం వంటి దైవపరిపాలనా కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయడం తమకు ఇష్టంలేదని వారందరూ అంగీకరిస్తారు. వారు ఇంట్లో ఉన్నా లేక వేరే ప్రదేశానికి వెళ్ళినా, క్షేత్ర సేవకు సంబంధించిన తమ రిపోర్టు కార్యదర్శికి తప్పకుండా తెలియజేసేటట్లు నిశ్చయపర్చుకుంటారు.

20 నిమి: ‘సత్క్రియలు అను ధనము గలవారై ఉండండి.’a సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. మార్చి 28న జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపాటుగా పరిచర్యలో ఎక్కువగా పాల్గొనమని అందరినీ ప్రోత్సహించండి. మంచి ఫలితాలను సాధించడానికి, ప్రచురించబడిన ఆహ్వానాలను ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి. తమ బంధువులను, పొరుగువారిని, బైబిలు విద్యార్థులను, ఆసక్తిగల ఇతరులను గత సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేటట్లు ఎలా ఒప్పించగలిగారో, అది వారికి ఎలాంటి సంతోషాన్ని తెచ్చిందో చెప్పమని ప్రచారకులను ఆహ్వానించండి. ఏప్రిల్‌లో సహాయ పయినీరు సేవ చేయగలవారందరినీ చేయమని ప్రోత్సహించండి, కూటం తర్వాత దరఖాస్తు పొందవచ్చని చెప్పండి.

పాట 10 (82), ముగింపు ప్రార్థన.

మార్చి 18తో ప్రారంభమయ్యే వారం

పాట 17 (187)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు. “జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు” అనే అంశాన్ని చర్చించండి. ప్రతిదినము లేఖనములను పరిశీలించుట​—⁠2002 నందు సూచించబడిన ప్రకారం మార్చి 23-28 వరకు షెడ్యూల్‌ చేయబడిన జ్ఞాపకార్థ బైబిలు పఠన భాగాలను చదవమని అందరిని ప్రోత్సహించండి.

15 నిమి: “యెహోవాతోనూ ఆయన కుమారునితోనూ సంతోషంగా ఐక్యమై.” పెద్ద ఇవ్వాల్సిన పురికొల్పునిచ్చే లేఖనాధారిత ప్రసంగం. మనతోపాటు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేందుకు సాధ్యమైనంత ఎక్కువమందిని ఆహ్వానించడానికి ఇప్పటినుంచి మార్చి 28 వరకు తీవ్రమైన కృషి చేయమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.

20 నిమి: వార్షిక పుస్తకము మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తోంది? ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. ముందుగా, ఈ సంచికలోని 6వ పేజీలో ఉన్న “పరిపాలక సభ నుండి ఒక ఉత్తరం” నుండి ముఖ్యాంశాలను నొక్కి చెప్పండి. తర్వాత, వార్షిక పుస్తకములో ప్రత్యేకంగా తమకు ప్రోత్సాహకరమైనవిగా, విశ్వాసాన్ని బలపరిచేవిగా అనిపించిన నివేదికలను, అనుభవాలను తెలియజేయమని ప్రేక్షకులను అడగండి. వార్షిక పుస్తకము చదవడం పూర్తిచేయమని, బైబిలు విద్యార్థులు యెహోవా సంస్థతో సుపరిచితులయ్యేటట్లు దాన్ని ఉపయోగించమని అందరినీ ప్రోత్సహించండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

మార్చి 25తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

14 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌లో సహాయ పయినీరు సేవ చేసేందుకు దరఖాస్తు ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని తెలియజేయండి. 8వ పేజీలో ఇవ్వబడిన సలహాలను ఉపయోగిస్తూ, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా అందించాలో ఒక యౌవనస్థుడిని/యౌవనస్థురాలిని చూపించమనండి, ఏప్రిల్‌ 1 కావలికోటను ఎలా అందించాలో ఒక పెద్దను ప్రదర్శించనివ్వండి. ప్రతి ప్రదర్శన తరువాత, ఆ అందింపులోని కొన్ని మంచి విషయాలను ఎత్తి చూపించండి.

15 నిమి: స్థానిక అవసరతలు.

16 నిమి: తర్కించడం (ఆంగ్లం) పుస్తకం ప్రోత్సహించడానికి ఉపయోగించండి. ప్రేక్షకులతో చర్చ. ప్రతి ఒక్కరికీ అప్పుడప్పుడు ప్రేమపూర్వకమైన ప్రోత్సాహం అవసరం. కాబట్టి, పరిచర్యలో మనము కలిసే దుఃఖితులతో సహా ఇతరులతో “ఓదార్పుకరంగా” మాట్లాడడం అవసరం అని మనందరం గుర్తుంచుకోవాలి. (1 థెస్స. 5:14, NW) తర్కించడం (ఆంగ్లం) పుస్తకాన్ని ఉపయోగిస్తూ, 117-21 పేజీలలో సూచించబడినటువంటి కష్టాలలో ఒకదానిని అనుభవిస్తున్నవారికి ఏ లేఖనాధార ప్రోత్సాహాన్ని అందించగలరో చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ప్రతి ఒక్కరు అవసరమైనప్పుడు ఎవరినైనా ప్రోత్సహించడానికి ప్రయత్నించమని సూచించండి.​—గల. 6:10.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 1తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

7 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.

18 నిమి: “‘మనుష్యులలో ఈవులు’ దేవుని మందను సిద్ధమనస్సుతో కాస్తారు.” పెద్ద ఇచ్చే ప్రసంగం. పేర్కొనబడిన లేఖనాలను చర్చించండి. కాపరులు నిష్క్రియులను సందర్శించడం ద్వారా, తాము చేయగలిగినంత చేయడానికి బలహీనులకు సహాయం చేయడం ద్వారా ప్రోత్సాహకరమైన అనుభవాలు ఎలా ఎదురవుతాయో చూపించండి. యెహోవా సేవలో చురుకుగా కొనసాగడానికి మంద చేసే హృదయపూర్వక కృషిని ప్రేమగల కాపరులు విలువైనదిగా ఎంచుతారు.

20 నిమి: “ప్రకటించే పనిలో మీ సంతోషాన్ని అధికం చేసుకోండి.”b 5వ పేరాను చర్చించేటప్పుడు, స్థానిక క్షేత్రంలో ఎక్కువ ప్రభావవంతంగా ఉండడానికి ఆచరణాత్మకమైన సలహాలు ఇవ్వమనండి. క్లుప్తంగా సాక్ష్యమివ్వడానికి ఎవరినైనా సమీపించడానికి ఎలా చొరవ తీసుకోవచ్చో ఒకటి లేదా రెండు ఉదాహరణలను ప్రదర్శించండి. ఈ వారం సాక్ష్యమివ్వడానికి అవకాశాలను కల్పించుకోమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.

పాట 2 (15), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి