సేవా కూటాల పట్టిక
ఫిబ్రవరి 11తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఫిబ్రవరి 25తో ప్రారంభమయ్యే వారంలోని సేవాకూటమిలో జరిగే చర్చకు సిద్ధపాటుగా, ఆదికాండము 6:1 నుండి 9:19 వరకు చదివి లేదా సమీక్షించి, నోవహు—ఆయన దేవునితోకూడ నడిచాడు (ఆంగ్లం) అనే వీడియోను చూడమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి.
20 నిమి: “దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించండి.”a (1-13 పేరాలు) సంఘాధ్యక్షుడు నిర్వహించాలి. మార్చిలోను, ఆ తర్వాతా మనం సాధించాలని కోరుకుంటున్నదాని గురించిన ఉత్సాహవంతమైన చర్చ. మార్చి నెలలో పరిచర్యలో వీలైనంత ఎక్కువగా పాల్గొనడానికి ఆచరణాత్మకమైన పట్టికను సిద్ధం చేసుకునేందుకు మధ్యపేజీల్లో ఇవ్వబడిన క్యాలెండర్‌ను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఆ నెలలో వీలైన వారందరినీ సహాయ పయినీరు సేవ చేయమని ప్రోత్సహించండి. 7, 8 పేరాలు చర్చించేటప్పుడు, గత జ్ఞాపకార్థదిన కాలంలో పయినీరు సేవ చేయడం ద్వారా ఆశీర్వాదాలను పొందిన వారిని, వాటి గురించి తెలియజేయమని కోరండి. సహాయ పయినీరు సేవ చేయడానికి అవసరమైన దరఖాస్తు ఫారాలను ఈ కూటమి తర్వాత పొందవచ్చునని ప్రకటించండి.
13 నిమి: “పత్రికల గురించి ఏమని చెప్పాలి?” ఈ అపాయకరమైన కాలాల్లోని సంక్షోభభరితమైన సంఘటనల సంబంధంగా పత్రికల్లోని ఆర్టికల్స్ ఏమి చెబుతున్నాయో చెప్పేందుకు సంసిద్ధంగా ఉండడానికి మన రాజ్య పరిచర్యలోని ఈ శీర్షిక ఎలా సహాయం చేసిందో ప్రచారకులను అడగండి. ప్రజలకు ఓదార్పునివ్వడంలో, కలతపరిచే ప్రశ్నలకు బైబిలు ఆధారిత సమాధానాలు కనుగొనడానికి వారికి సహాయం చేయడంలో కొందరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రెండు క్లుప్త ప్రదర్శనల్లో, జనవరి-మార్చి తేజరిల్లు!ను, ఫిబ్రవరి 15 కావలికోటను ఎలా అందించాలో చూపించండి.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 18తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు.
10 నిమి: “కొంత సొమ్ము నిలువ చేయవలెను.” ప్రేక్షకులతో చర్చ. ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వడంలో చూపించిన ఔదార్యాన్ని బట్టి సంఘాన్ని ప్రశంసించండి.
25 నిమి: “దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించండి.”b (14-23 పేరాలు) సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. మార్చిలో స్థానికంగా పరిచర్యలో ఎక్కువగా పాల్గొనడానికి చేయబడిన ప్రత్యేక కార్యక్రమాలను సమీక్షించండి. ఆ నెల కోసం ప్లాన్ చేయబడిన క్షేత్ర సేవా కూటాల సమయాలన్నిటినీ క్లుప్తంగా తెలియజేయండి. నిష్క్రియులుగా మారినవారు తిరిగి క్షేత్ర సేవలో పాల్గొనేలా చేయడానికీ, పిల్లలు బైబిలు విద్యార్థులు బాప్తిస్మం పొందని ప్రచారకులయ్యేందుకు సహాయపడడానికీ అవధానం ఇవ్వండి. మార్చిలో సహాయ పయినీరు సేవచేయడానికి దరఖాస్తులు ఇచ్చినవారి పేర్లను ప్రకటించి, ఇంకా ఎక్కువమంది వారితోపాటు కలిసి సేవచేయడాన్ని గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించమని ప్రోత్సహించండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 25తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
15 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి-మార్చి తేజరిల్లు!ను ఉపయోగిస్తూ ఒకటి, మార్చి 1 కావలికోటను ఉపయోగిస్తూ మరొకటి, రెండు పత్రిక అందింపులను క్లుప్తంగా ప్రదర్శించండి. వాటిలో ఒకదాన్ని యౌవనస్థుడు/రాలు ప్రదర్శించాలి. ఫిబ్రవరి క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.
15 నిమి: “సాక్ష్యాన్నిచ్చే వీడియోల ప్రభావం.” ప్రేక్షకులతో చర్చ. ఇప్పటి వరకు మనం మన సేవా కూటాల కార్యక్రమంలో మనకున్న వీడియోల్లో ఎనిమిదింటిని సమీక్షించాము. ఆర్టికల్‌లో ఇవ్వబడిన ఉదాహరణలను క్లుప్తంగా చర్చించిన తర్వాత, వీడియోలను ఇతరులకు చూపించడంలో తాము సాధించిన సాఫల్యాన్ని తెలియజేయమని ప్రచారకులను అడగండి.
15 నిమి: “నోవహు—ఆయన దేవునితోకూడ నడిచాడు అనే వీడియో నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు.” ఈ పేజీలోని బాక్సులో ఇవ్వబడిన ప్రశ్నలను మాత్రమే ఉపయోగిస్తూ, నోవహు వీడియో గురించి ప్రేక్షకులతో సూటిగా చర్చ ప్రారంభించండి. ఏప్రిల్‌లో మనం యువత ఇలా అడుగుతోంది—నేను అసలైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? అనే వీడియోను సమీక్షిస్తాము.
పాట 22 (124), ముగింపు ప్రార్థన.
మార్చి 4తో ప్రారంభమయ్యే వారం
పాట 1 (13)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
12 నిమి: “భూమిపైనున్న అత్యంత సంతోషభరితులైన ప్రజలు.”c అక్టోబరు 15, 1997, కావలికోటలోని 6వ పేజీలో ఉన్న “సంతోషం కొరకైన చర్యల”ను క్లుప్తంగా చేర్చండి.
12 నిమి: అధ్యయనాలు ప్రారంభించడానికి జ్ఞానము పుస్తకాన్ని ఉపయోగించండి. మార్చిలో గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలని మనం కోరుకుంటాము. ఆగస్టు 1998 మన రాజ్య పరిచర్య, 4వ పేజీ, 8వ పేరాలోని అనుభవాన్ని క్లుప్తంగా చెప్పండి. ఎవరైనా ఇటీవలే జ్ఞానము పుస్తకం నుండి అధ్యయనం ప్రారంభించి ఉంటే, అది ఎలా జరిగిందో అభినయించి చూపించండి. జనవరి 2002 మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లోని “జ్ఞానము పుస్తకం పరిచయం చేయడానికి సూచనలు” గురించి ప్రతి ఒక్కరికి గుర్తు చేయండి. ఆ పుస్తకాన్ని ఉపయోగిస్తూ, మధ్యపేజీల్లోని 6వ పేజీలో ఉన్న “సూటిగా ప్రస్తావించడం” అనేదాని క్రింద ఉన్న సూచనల్లో ఒక దాన్ని ప్రదర్శించండి.
16 నిమి: “ఎందుకు ప్రకటిస్తూనే ఉండాలి?”d అనేక సంవత్సరాల నుంచి ప్రకటిస్తూనే ఉన్న ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయడంతో ముగించండి. వారు ఈ పనిలో ఎందుకు పట్టువిడువక కొనసాగుతున్నారు, అది వారికి ఎలా ప్రయోజనం చేకూర్చింది అనే విషయాలపై వారి భావాలను వ్యక్తం చేయమనండి.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.