నోవహు—ఆయన దేవునితోకూడ నడిచాడు అనే వీడియో నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు
ఆదికాండము 6:1 నుండి 9:19 వరకు చదవండి లేదా సమీక్షించండి. తర్వాత నోవహు వీడియోను చూడండి, ఆ తర్వాత ఈ ప్రశ్నలకు మీరెలా సమాధానమిస్తారో ఆలోచించండి: (1) నోవహు కాలంలో లోకం ఎలా ఉంది, అది ఎందుకలా తయారైంది? (2) నోవహును అంత ప్రత్యేకమైన వ్యక్తిగా చేసినదేమిటి, దేవుడు ఆయనకు ఏ పనిని అప్పగించాడు, ఎందుకు? (3) ఓడ బహుశా ఎక్కడ నిర్మించబడి ఉండవచ్చు, ఎంతకాలం పట్టింది, అది ఎంత పెద్దది? (4) ఓడను నిర్మించడమే గాక నోవహు, ఆయన కుటుంబము ఇంకా ఏమి చేయవలసి వచ్చింది? (5) ఓడ తలుపు మూసివేయబడిన తర్వాత దాని లోపల ఉండడం ఎలా ఉండి ఉండవచ్చునని మీరనుకుంటున్నారు? (6) మీరు జలప్రళయాన్ని తప్పించుకుని సజీవంగా ఉండివుంటే ఎలా భావించి ఉండేవారు? (7) జలప్రళయానికి సంబంధించిన ఏ జ్ఞాపికను మనం అప్పుడప్పుడు చూస్తాము, దాని భావమేమిటి? (8) నోవహును గురించిన బైబిలు వృత్తాంతం, మీ గురించి, మీ కుటుంబం గురించి, దేవుడు చేయమని మనకు అప్పగించిన పని గురించి మీకు ఏమి బోధించింది? (9) పరదైసులో మీరు నోవహును ఆయన కుటుంబాన్ని కలిసినప్పుడు ఏ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు? (10) ఇప్పుడు మీరు నోవహు వీడియోను ఎలా ఉపయోగించాలని పథకం వేసుకోవాలనుకుంటున్నారు?