కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/01 పేజీ 1
  • “నాకు టైమెక్కడ దొరుకుతుంది?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నాకు టైమెక్కడ దొరుకుతుంది?”
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉన్న సమయాన్నే చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • మీరు తగినంత ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవడమెలా
    మన రాజ్య పరిచర్య—1996
  • యెహోవా సేవను కేంద్రంగా చేసుకొని మీ జీవితాన్ని నిర్మించుకోండి
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2001
km 11/01 పేజీ 1

“నాకు టైమెక్కడ దొరుకుతుంది?”

1 మన జీవితాలు అనేక పనులతో నిండివుండడంవల్ల, మనలో చాలామంది నిట్టూరుస్తూ అనే మాటలవి. మన దగ్గరున్న వనరుల్లో సమయం అత్యంత విలువైనదీ, అత్యంత బుద్బుదప్రాయమైనదీ అని అంటారు. మరి అలాంటప్పుడు దేవుని వాక్యం చదవడం, అధ్యయనం చేయడం వంటి నిజంగా ముఖ్యమైన కార్యముల కోసం మనకు సమయం ఎక్కడ దొరుకుతుంది?—ఫిలి. 1:9, 10.

2 అసలు, ఎక్కువ సమయం కోసం ప్రయత్నించడం కాదుగానీ, మనకున్న సమయంలోనే ఏమి చేయాలో నిర్ణయించుకోవడమే కీలకమైన విషయం. మనందరికీ వారానికి 168 గంటలుంటాయి, వాటిలో 100 గంటలు నిద్రకు, పని చేయడానికి వెచ్చిస్తుండవచ్చు. మరి మిగిలిన సమయాన్ని మనం చక్కగా ఎలా ఉపయోగించవచ్చు? ఎఫెసీయులు 5:15-17 “సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. . . . ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి” అని సిఫార్సు చేస్తోంది. యెహోవా ప్రాముఖ్యమైనవి అని చెప్పే కార్యములను చేయడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అది సూచిస్తోంది.

3 యేసు మన రోజులను నోవహు రోజులతో పోల్చాడు. (లూకా 17:26, 27) ఆ కాలంనాటి ప్రజలు తమ దైనందిన కార్యాలతోనే విరామం లేకుండా ఉండేవారు. అయినప్పటికీ, నోవహు ఒక గొప్ప ఓడను సిద్ధం చేయడానికి, ప్రకటించడానికి సమయాన్ని తీసుకున్నాడు. (హెబ్రీ. 11:7; 2 పేతు. 2:5) ఆయనకు సమయమెలా దొరికింది? దేవుని చిత్తాన్ని ప్రథమ స్థానంలో ఉంచడం ద్వారా, ఆయన చెప్పినవాటన్నింటిని విధేయతతో ‘అట్లే’ చేయడం ద్వారా.—ఆది. 6:22.

4 మొదట ఏది ఉండాలి? యేసు ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్త. 4:4) ప్రతి వారం, మనం ‘తగిన కాలమున . . . [ఆధ్యాత్మిక] ఆహారము’ అందుకుంటున్నాము. (లూకా 12:42) అది జీర్ణమై దాన్నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలనుకుంటే, క్రమ పద్ధతిలో వ్యక్తిగతంగా చదవడానికి, అధ్యయనం చేయడానికి ఒక పట్టిక అవసరమవుతుంది. ఆధ్యాత్మిక ఆహారంపట్ల మనకున్న కృతజ్ఞతనుబట్టి మనం ఫాస్ట్‌ ఫుడ్‌ను చూసినట్లు దాన్ని చూడము, లేదా భౌతిక ఆహారం గబ గబ తిన్నట్టు, ఆధ్యాత్మిక ఆహారాన్ని తినము, అంటే పైపైనే చదవము. బదులుగా, దాన్ని అధ్యయనం చేయడానికి ఆధ్యాత్మిక విషయాలను ఆస్వాదించడానికి తగిన సమయం తీసుకునేందుకు కృతజ్ఞత మనల్ని కదిలిస్తుంది.

5 ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవడంవల్ల మనం నిత్య జీవానికి నడిపించబడతాము. (యోహా. 17:3) అది మన దైనందిన పట్టికలో ప్రముఖ స్థానంలో ఉండతగినది. ప్రతిదినం బైబిలు చదవడానికి, కూటాలకు సిద్ధపడడానికి మనం సమయాన్ని పొందగలమా? పొందగలము. అలాగైతే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని చేయడం ద్వారా వచ్చే “గొప్ప ప్రతిఫలాన్ని” మనం పొందగలము.—కీర్త. 19:7-11, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి