కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/01 పేజీ 1
  • బలం కోసం యెహోవా మీద ఆధారపడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బలం కోసం యెహోవా మీద ఆధారపడండి
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • అలసినవారిని యెహోవా బలపరుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవా మీకు శక్తిని ఇస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2001
km 11/01 పేజీ 1

బలం కోసం యెహోవా మీద ఆధారపడండి

1 మనం యెహోవా మీద ఆధారపడడానికి అనేక కారణాలున్నాయి. “సకల జనములకు” సువార్త ప్రకటించడమంటే అంత సులభమైన పనేమీ కాదు. (మత్త. 24:14) నిరంతరం మనం మన అపరిపూర్ణ శరీరంతో పోరాడాలి. (రోమా. 7:21-23) అంతేగాక, ‘మనము . . . ప్రస్తుత అంధకారసంబంధులగు [మానవాతీత] లోకనాథులతోను పోరాడుచున్నాము.’ (ఎఫె. 6:11, 12) మనకు సహాయం నిజంగా అవసరమేనన్నది విస్పష్టం. మనం యెహోవా నుండి బలాన్ని ఎలా పొందగలం?

2 ప్రార్థన ద్వారా: యెహోవా తన శక్తివంతమైన పరిశుద్ధాత్మ కోసం అడిగే తన సేవకులకు దాన్ని ధారాళంగా ఇస్తాడు. (లూకా 11:13) ఇంటింటి సాక్ష్యమివ్వడానికి, వీధి సాక్ష్యమివ్వడానికి, లేక టెలిఫోన్‌ సాక్ష్యమివ్వడానికి మీకు మీ సామర్థ్యం మీద నమ్మకం సన్నగిల్లుతోందా? అనియత సాక్ష్యమివ్వడానికి మీరు తత్తరపడతారా? క్షేత్రంలోని ప్రజల ఉదాసీనత మీ ఆసక్తిని తగ్గిస్తోందా? మీరు మీ విశ్వాసంతో లేక యథార్థతతో రాజీపడాల్సినంతటి ఒత్తిడికి గురైతే ఎలా? యెహోవా మీద ఆధారపడండి. బలం కోసం ప్రార్థించండి.—ఫిలి. 4:13.

3 వ్యక్తిగత అధ్యయనం ద్వారా: భౌతిక ఆహారం తినడం ద్వారా మనం ఎలాగైతే బలాన్ని పొందుతామో, అలాగే క్రమంగా దేవుని వాక్యంతో, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందిస్తున్న ప్రచురణలతో పోషింపబడడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలవంతులమవుతాము. (మత్త. 4:4; 24:45) స్టాన్లీ జోన్స్‌ చైనా జైల్లో బైబిలు కూడా లేకుండా కొన్ని సంవత్సరాలపాటు ఒంటరిగా ఉన్నప్పుడు, అంతకాలం సహించడానికి ఆయనకు బలమిచ్చిందేమిటి అని ఆయనను అడిగితే, “మనం విశ్వాసంలో నిశ్చలంగా ఉండగలం. అందుకు మనం మొట్టమొదట అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయకపోతే మనలో ఆత్మబలం ఉండదు” అని జవాబిచ్చాడు.

4 కూటాలకు హాజరవడం ద్వారా: మొదటి శతాబ్దంలోని ఒక క్రైస్తవ కూటమిలో యూదా, సీలలు “సోదరులతో చాలా సేపు మాట్లాడి వాళ్ళను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు.” (అపొ. 15:32, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అదేవిధంగా నేడు, మనం కూటాల్లో ఏమైతే వింటామో అవి యెహోవాపట్ల మన కృతజ్ఞతను, మన విశ్వాసాన్ని అధికం చేయడమే కాకుండా పరిచర్య చేయడానికి మనల్ని ఉత్తేజపరుస్తాయి. ‘దేవుని రాజ్యము నిమిత్తము జత పనివారితో’ క్రమంగా కలుసుకునే అవకాశం కూటాల ద్వారా మనకు లభిస్తుంది, వారి వలన మనకు “ఆదరణ” కలుగుతుంది.—కొలొ. 4:11.

5 ‘ఈ అపాయకరమైన కాలములలో’ మనకు సహాయము తప్పకుండా కావాలి. (2 తిమోతి 3:1) యెహోవానుండి బలాన్ని పొందేవారి గురించి మనకు హామీ ఇవ్వబడింది: “వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.”—యెష. 40:31.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి