సేవా కూటాల పట్టిక
అక్టోబరు 8తో ప్రారంభమయ్యే వారం
పాట 2 (15)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. అక్టోబరు 22తో ప్రారంభమయ్యే వారంలోని సేవా కూటమిలో చర్చించడానికి సిద్ధంగా దైవిక బోధచే ఐక్యమవ్వడం (ఆంగ్లం) వీడియో చూడమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి. మొదటి పేజీలోని సూచనలను ఉపయోగిస్తూ, అక్టోబరు - డిసెంబరు తేజరిల్లు!ను ఉపయోగిస్తూ ఒకటి, అక్టోబరు 15 కావలికోటను ఉపయోగిస్తూ మరొకటి, రెండు పత్రిక అందింపులను క్లుప్తంగా ప్రదర్శించండి.
35 నిమి: “పండుగల సమయాన్ని యెహోవాను ఘనపరచడానికి ఉపయోగించండి.”a ఒకటి 4వ పేరా ఆధారంగా, మిగతావి 5, 6 పేరాల ఆధారంగా కొన్ని సంక్షిప్త ప్రదర్శనలను కూడా చేర్చండి.
పాట 18 (162), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 15తో ప్రారంభమయ్యే వారం
పాట 12 (113)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: “విధేయ హృదయం” మీకుందా? (1 రాజు. 3:9, NW) జూలై 15, 1998, కావలికోట, 29-31 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. సంఘంతో పని చేసేటప్పుడు ఏయే మార్గాల్లో మనం విధేయతను చూపించవచ్చో చర్చించండి.
20 నిమి: మన పత్రికలను సమర్థవంతంగా ఉపయోగించండి. సేవా పైవిచారణకర్త, పత్రికా సేవకుడు స్థానికంగా పత్రికల పంపిణీ గురించి చర్చిస్తారు. ప్రతి నెల పంచిపెట్టినట్లు రిపోర్టు చేసిన కాపీల సంఖ్యతో పోలిస్తే వారి సంఘానికి వచ్చే కాపీలు ఎన్నో వారు పేర్కొంటారు. చాలా కాపీలను కూడబెడుతున్నారనో లేదా పడేస్తున్నారనో తేలుతుంది. ప్రచారకులు మన పత్రికలను ఫలవంతంగా ఎలా ఉపయోగించగలరు? 1999లో అక్టోబరు 4తో ప్రారంభమైన సేవా కూటమిలోని “పత్రికలను ఇవ్వాలన్న స్పృహ గలవారై ఉండండి!” అనే భాగం నుండి ఏడు పాయింట్లను సహోదరులు చర్చిస్తారు. వాళ్ళు ఫిబ్రవరి 15, 1998, కావలికోట, 28-9 పేజీల్లోనున్న అనుభవాన్ని సమీక్షించి, ఆ సూచనలు స్థానికంగా అమలు చేయగల కొన్ని మార్గాలను గురించి ఆలోచిస్తారు. మన రాజ్య పరిచర్యలో ప్రతి నెల వస్తున్న మాదిరి అందింపులను ప్రయత్నించమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.
పాట 28 (224), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 22తో ప్రారంభమయ్యే వారం
పాట 25 (204)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మొదటి పేజీలోని సూచనలను ఉపయోగించి, అక్టోబరు - డిసెంబరు తేజరిల్లు!ను ఉపయోగిస్తూ ఒకటి, నవంబరు 1 కావలికోటను ఉపయోగిస్తూ మరొకటి, రెండు పత్రిక అందింపులను క్లుప్తంగా ప్రదర్శించండి.
10 నిమి: మీరెలా ప్రతిస్పందిస్తారు? “యెహోవాసాక్షులు తాము బోధించే ఏ బైబిలు బోధనైనా అంత ఖచ్చితంగా ఎలా బోధిస్తారు?” అనే ప్రశ్నకు రీజనింగ్ పుస్తకంలోని 204-5 పేజీల్లో ఇచ్చిన స్పష్టమైన సమాధానాన్ని క్లుప్తంగా సూచించండి. అలాంటి ప్రశ్నకు పునర్దర్శనంలో ఎలా ప్రత్యుత్తరమివ్వాలో ఆ తర్వాత, సంఘ కూటాలకు ఎలా ఆహ్వానించాలో చూపించే చక్కగా సిద్ధపడిన ఒక ప్రదర్శనను ఇవ్వండి.
25 నిమి: “దైవిక బోధచే ఐక్యమవ్వడం—నిజమైన సహోదర ఐక్యత యొక్క పరిశీలన.” ప్రేక్షకులతో చర్చ. ఈ భాగాన్ని ప్రారంభించడానికి, ముగించడానికి మొదటి మరియు చివరి పేరాలను ఉపయోగించండి. వీడియో మీద ఉత్సాహవంతమైన చర్చను కొనసాగించడానికి, ఇవ్వబడిన ప్రతి ప్రశ్నను అడగండి. ఇతర దేశాల్లో సమావేశాలకు హాజరైన వారెవరైనా సంఘంలో ఉంటే, మన సంస్థ యొక్క అంతర్జాతీయ విస్తృతి గురించీ ఐక్యత గురించీ వారికి ఏమనిపించిందో తెలియజేయమనండి. లేదా, హృదయాన్ని స్పృశించే అనుభవాలను 1994 వార్షిక పుస్తకం (ఆంగ్లం), 7-9 పేజీల్లో నుండి, 1995 వార్షిక పుస్తకం (ఆంగ్లం), 8-11 పేజీల్లో నుండి పేర్కొనండి. మనం డిసెంబరులో భూదిగంతముల వరకు (ఆంగ్లం) అనే వీడియోను సమీక్షిస్తాము.
పాట 11 (85), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 29తో ప్రారంభమయ్యే వారం
పాట 19 (164)
12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్టోబరు నెల క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. నవంబరు నెలలో ప్రతిపాదించాల్సిన సాహిత్యాలు, దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు లేక జ్ఞానము పుస్తకము. ఈ చిన్న అందింపును ప్రదర్శించండి: “ఆర్థికంగా చాలా గడ్డు పరిస్థితులున్న ఈ రోజుల్లో, అనేకమందికి పొట్టగడవడమే చాలా కష్టంగా ఉంది. అందరికీ న్యాయంగా ఉండేలా మానవ ప్రభుత్వాలేమైనా ఈ సమస్యను పరిష్కరిస్తాయని మీకేమైనా అనిపిస్తుందా? [జవాబు చెప్పనీయండి.] చాలా ప్రోత్సాహకరమైన ఈ వాగ్దానాన్ని నేను బైబిల్లో కనుగొన్నాను.” కీర్తన 72:12-14 చదవండి. తర్వాత, దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు నుండైనా లేక జ్ఞానము పుస్తకం నుండైనా తగిన వ్యాఖ్యానం ఒకటి చేసి వాటిని ఇవ్వండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
18 నిమి: “మీ ఆధ్యాత్మిక ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి?”b మంచి ఆధ్యాత్మిక ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడానికి మనమెందుకు తీవ్ర ప్రయత్నం చేయాలో వివరించడానికి, ఏప్రిల్ 15, 1997, కావలికోట, 28-31 పేజీల ఆధారంగా వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.
పాట 17 (187), ముగింపు ప్రార్థన.
నవంబరు 5తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
18 నిమి: కూటాలకు కుటుంబ సమేతంగా సిద్ధపాటు. కూటాల్లో అందరూ చక్కగా పాల్గొనడానికి ఎలా సిద్ధపడాలో కుటుంబ పెద్ద తన కుటుంబంతో చర్చిస్తాడు. జూలై 1, 1999, కావలికోట, 20వ పేజీలోని 9వ పేరాలోనున్న సలహాలను ఉపయోగిస్తూ, ఈ వారపు కావలికోట అధ్యయనంలో వ్యాఖ్యానించడానికి వారు సిద్ధపడతారు. (1) కుటుంబ సభ్యుల్లోని ప్రతి ఒక్కరు వ్యాఖ్యానించడానికి ఒకటి లేక రెండు ప్రశ్నలను ఎంపిక చేసుకుంటారు. (2) వాటికి సంబంధించిన పేరాలను పరిశీలించిన తర్వాత, వారు తమ స్వంత మాటల్లో వ్యాఖ్యానాన్ని సిద్ధం చేసుకుంటారు. (3) కీలకమైన లేఖనాలను ఎంపిక చేసుకొని, అవి చర్చాంశానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చర్చించి, ఆ పాఠానికి తగిన విధంగా ఏమని చెప్పాలో నిర్ణయించుకుంటారు. కూటమిలో పాల్గొనడానికి అందరూ కుతూహలంతో ఉంటారు.
17 నిమి: “మన లక్ష్యం ఏమిటి?”c కూటాలకు హాజరవడంలోనున్న విలువను గ్రహించేలా విద్యార్థికి సహాయం చేయాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. జ్ఞానము పుస్తకమునుండి 17వ అధ్యాయంలోని 6-8 పేరాలను ఉపయోగించి, చక్కగా సిద్ధపడిన ఒక ప్రదర్శనతో దాన్నెలా చేయాలో చూపించండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.