పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“మన పట్టణాల్లో అనేకానేక హాస్పిటళ్ళూ, మెడికల్ సెంటర్లూ వెలుస్తున్నాయి, కానీ నేడు ప్రజలు మంచి ఆరోగ్యం కలిగివున్నారని మీకనిపిస్తుందా? [జవాబు విన్న తర్వాత యెషయా 33:24 చదవండి.] నేడు వైద్య విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందో, సంపూర్ణ ఆరోగ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా ఏమి చేయాలో ఈ పత్రిక మీకు తెలియజేస్తుంది.”
కావలికోట సెప్టెం. 15
“సత్యాన్ని ప్రేమించేవారు దాదాపు అన్ని మతాల్లోను ఉన్నారు. అయితే, సాధారణంగా మానవుల్లో అనైక్యతకు మతాలే కారణమవుతున్నాయి. మరి అలాంటప్పుడు యథార్థ హృదయులైన ప్రజలను ఐక్యం చేయడానికి ఏమి అవసరమౌతుంది? [ప్రతిస్పందించాక, జెఫన్యా 3:9 చదవండి.] సత్యదేవుని గురించిన పరిజ్ఞానం ప్రజలందరినీ ఎలా ఐక్యం చేస్తోందో ఈ పత్రిక చూపిస్తుంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“మనలో చాలా మందిమి మన జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ప్రార్థిస్తుంటాము, కానీ మన ప్రార్థనను దేవుడు వింటాడని మీకనిపిస్తుందా? [గృహ యజమానిని సమాధానం చెప్పనీయండి.] మన ప్రార్థనలకు జవాబులు పొందాలంటే మనకు ఏమి అవసరమో గ్రహించడానికి, “దేవుడు నా ప్రార్థనలు వింటాడా?” అనే ఈ ఆర్టికల్ మనకు సహాయం చేస్తుంది. దీన్ని చదివి మీరు, మీ కుటుంబం తప్పకుండా ఆనందిస్తారని నా నమ్మకం.”
కావలికోట అక్టో. 1
“నేడు విశ్వాసం ఏ మాత్రం ప్రజాదరణ లేని విషయం అయింది, దాని గురించి చాలా తక్కువమంది మాట్లాడడానికి ఇష్టపడతారని మీరు ఒప్పుకుంటారనుకుంటా. కానీ అలా అవడానికి కారణమేమిటి? [ప్రతిస్పందన తర్వాత, హెబ్రీయులు 11:1 చదవండి.] ఈ పత్రిక నిజమైన విశ్వాసమంటే ఏమిటో వివరిస్తూ, అలాంటి విశ్వాసాన్ని మనం కలిగివుంటే ఏమవుతుంది, కలిగివుండకపోతే ఏమవుతుందనే వ్యత్యాసాన్ని మీకు తెలియజేస్తుంది.”