సేవా కూటాల పట్టిక
ఆగస్టు 13తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఆగస్టు 27, వారపు సేవా కూటమిలో జరిగే చర్చకు సిద్ధమవడానికి కార్యాచరణలో ఉన్న నూతన లోక సంస్థ వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి.
17 నిమి: ఏప్రిల్ సేవా నివేదిక. ప్రసంగం, ఇంటర్వ్యూలను సేవా పైవిచారణకర్త నిర్వహిస్తాడు. దేశపు మరియు స్థానిక సంఘపు ఏప్రిల్ నెల క్షేత్రసేవ రిపోర్టులను ప్రధానాంశంగా చెప్పండి. ఆ నెలలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించిన వేర్వేరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. పరిచర్యలో పూర్తి భాగం వహించడంవల్ల వారు పొందిన ఆనందం గురించి, పరిచర్యలో నిమగ్నమై ఉండడానికి వారేమి చేస్తున్నారో తెలుపమనండి.—మార్చి 2001, మన రాజ్య పరిచర్యలోని లోపలి పేజీల్లో 28-30 పేరాలను చూడండి.
18 నిమి: “మీరు ఇంకా ఎక్కువ సేవ చేయాలనుకుంటున్నారా? a మీ సేవాప్రాంతంలో వేరే భాష మాట్లాడేవారికి సాక్ష్యం ఇవ్వడానికి ఇంకా ఏం చేయగలమో చూపే సలహాలను చేర్చండి. క్లుప్తంగా జూన్ 15, 1997, కావలికోట, 26-9 పేజీలపై వ్యాఖ్యానించండి.
పాట 23 (200) ముగింపు ప్రార్థన.
ఆగస్టు 20తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: “మీరు ఒక ‘వేడుకగా’ ఉన్నారు!”b యెహోవాసాక్షుల ప్రవర్తన గురించి లేక వారి పని గురించి ప్రజల ప్రశంసలు పొందిన కొన్ని స్థానిక సంఘటనలను తెలియజేయండి.—కావలికోట, మార్చి 15, 1998, 10వ పేజీ, మరియు జనవరి 15, 1999, 32వ పేజీ చూడండి.
22 నిమి: “మర్యాద—దైవభక్తి గల ప్రజలకుండే ఒక విశిష్ట లక్షణం.” 1-5 పేరాలపై పెద్ద ప్రసంగించి, మిగతా ఆర్టికల్‌ను వేరే ఒక పెద్ద, ఒక పరిచర్య సేవకునితో కలిసి వేదికపైన చర్చిస్తాడు. వారు మన కూటాలను తక్కువగా పరిగణింపజేసే అలవాట్లను, కూటముల నుండి మనం పొందే ప్రయోజనాలను తగ్గించే కొన్ని అనాలోచితమైన అలవాట్లను ఎలా అధిగమించాలో మాట్లాడతారు. మనం ఇతరుల కార్యాలపై కూడా మన ప్రేమపూర్వకమైన శ్రద్ధను చూపించినప్పుడు, మన సహవాసం నిజంగా మనకు పరస్పరం ఎలా ప్రోత్సాహమిస్తుందో వారు ఉన్నతపరుస్తారు.—ఫిలి. 2:4.
పాట 22 (130) ముగింపు ప్రార్థన.
ఆగస్టు 27తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. సెప్టెంబరు నెల పరిచర్యలో సృష్టి (ఆంగ్లం) పుస్తకమును ఎలా ఇవ్వాలో క్లుప్తంగా ఒకటి లేక రెండు సలహాలను పంచుకోండి.—మన రాజ్య పరిచర్య, జూన్ 1995, 4వ పేజీలోని ఉదాహరణలను చూడండి.
15 నిమి: “విరామాన్ని సరైన స్థానంలో ఉంచండి.” ఒక పుస్తక అధ్యయన నిర్వాహకుడు, అధ్యయనం అయిన తర్వాత ఒక జంటతో మాట్లాడతాడు. ఇటీవల ప్రాంతీయ సేవలో లేక వారాంతపు కూటాల్లో వారిని చూడలేదని దయాపూర్వకంగా వారితో అంటాడు. సెలవులకు వెళ్ళడంవల్ల మరియు ఇతర కొన్ని పనులవల్ల బిజీగా ఉండిపోయామని వారు వివరిస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తులకు ఎప్పుడూ మొదటి స్థానం ఇవ్వడానికి ఆ జంటకు సహాయపడేందుకు ఆర్టికల్‌లోని ముఖ్యాంశాలను పెద్ద వారితో సమీక్షిస్తాడు. అలాంటి మంచి విషయాలను గుర్తుచేసినందుకు వారు తమ కృతజ్ఞతను తెలియజేస్తారు. భవిష్యత్తులో శ్రేష్ఠమైన ప్రాధాన్యతలను ఏర్పరచుకుంటామని వారు ఒప్పుకుంటారు.—అక్టోబరు 1, 2000, కావలికోట, 19-20 పేజీలను చూడండి.
20 నిమి: “కార్యాచరణలో ఉన్న నూతన లోక సంస్థపై చారిత్రక పునఃసమీక్ష.” ప్రేక్షకులతో చర్చ మరియు ఇంటర్వ్యూలు. అందజేయబడిన ప్రశ్నలను చర్చించిన తర్వాత, ఒరిజినల్ ఫిలింను చూసినవారు లేక 1950లలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరైనవారు ఎవరైనా ఉంటే వారితో ఇంటర్వ్యూ చేయండి. ఆ సంఘటనల గురించి ఏమి జ్ఞాపకముందో, అవి వారిపై ఆధ్యాత్మికంగా ఎలాంటి ప్రభావాన్ని చూపాయో వారిని చెప్పమనండి. అంతేగాక, ఇదే యెహోవా సంస్థ అని దేన్నిబట్టి దృఢ నమ్మకం కలిగిందో తెలియజేయమనండి. అక్టోబరు నెలలో మనం దైవిక బోధ ద్వారా ఐక్యమయ్యారు (ఆంగ్లం) అనే వీడియోను పునఃసమీక్షిస్తాం.
పాట 11 (85) ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 3తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
8 నిమి: స్థానిక ప్రకటనలు.
17 నిమి: “క్రైస్తవ సాంగత్యం ఎంత ప్రాముఖ్యమైనది?”c జనవరి 15, 1996, కావలికోట, 22వ పేజీలోని “సంఘం ద్వారా” అనే ఉప శీర్షిక క్రిందవున్న వ్యాఖ్యానాలను చేర్చండి.
20 నిమి: ఎవరైనా ఇలా అంటే. చర్చ, ప్రదర్శనలు. పరిచర్యలో ప్రజలు మనం ఎదురు చూడని విధంగా వ్యాఖ్యానించినప్పుడు లేక ప్రశ్నలు వేసినప్పుడు, మనం మాట్లాడే అంశాన్ని మార్చడంగానీ, ముగించడంగానీ చేయకుండా జవాబు చెప్పడానికి కృషి చేయాలి. అలాంటి సందర్భాల్లో రీజనింగ్ పుస్తకం తరచుగా సహాయపడుతుంది. సాధారణంగా చేసే కొన్ని వ్యాఖ్యానాలను సూచించి, రీజనింగ్ పుస్తకంలోని వ్యాఖ్యానాల ఆధారంగా వాటికి ఎలా స్పందించాలో ప్రచారకులను ప్రదర్శించమనండి. ఉదాహరణకు: ‘నేను దేవుణ్ణి నమ్మను.’ (150-1 పేజీలు) ‘సమాజాభివృద్ధికర పనుల్లో మీరెందుకు పాల్గొనరు?’ (207-8 పేజీలు) ‘మీరు ఏ చర్చికి చెందినవారైనా పరవాలేదు.’ (332వ పేజీ) పరిచర్యలో ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు రీజనింగ్ పుస్తకంలోని ఈ పద్ధతిని పాటించమని అందరినీ ప్రోత్సహించండి.
పాట 21 (191) ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.