సేవా కూటాల పట్టిక
గమనిక: రాబోయే నెలల్లో ప్రతి వారం జరిగే సేవా కూటాల పట్టికను మన రాజ్య పరిచర్య మామూలుగానే అందజేస్తుంది. సంఘాలు, “దేవుని వాక్యాన్ని బోధించేవారు” జిల్లా సమావేశానికి హాజరు కావడానికి కావలసిన సర్దుబాట్లను చేసుకోవలసివుంటుంది. సమావేశానికి హాజరు కావడానికి ముందు వారంలో జరిగే చివరి సేవా కూటంలో ఈ నెల మధ్యపేజీల్లో ఉన్న సలహాల్లో స్థానికులకు ప్రయోజనకరమైనవాటిని 15 నిమిషాలపాటు పరిశీలించండి. డిసెంబరు నెలలోని అన్ని సేవా కూటాల్లో సమావేశపు ఉన్నతాంశాలను పునర్విచారించాల్సి ఉంటుంది. ఆ చర్చకు సిద్ధమవడానికి, మనమందరం సమావేశంలో అర్థవంతమైన నోట్స్ రాసుకోవాలి, వాటితోపాటు మనం మన జీవితంలో, మన క్షేత్రసేవలో అమలు చేయాలనుకొంటున్న అంశాల పట్టికను కూడా రాసుకోవాలి. అప్పుడు, సమావేశానికి హాజరయినప్పటినుండి ఆ సలహాలను మనమెలా అమలు చేశామో వివరించడానికి సిద్ధపడి ఉండగలము. మనం రాసుకొన్న మంచి సలహాలనుండి మనమెలా ప్రయోజనం పొందామో సంఘంలో వినడం పరస్పరం బలపరిచేదిగా ఉంటుంది.
జూలై 9తో ప్రారంభమయ్యే వారం
పాట 21 (191)
8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. డిసెంబరు నెల సేవా కూటాల్లో జిల్లా సమావేశపు ఉన్నతాంశాలను పునర్విచారించేటప్పుడు సేవా కూటాల ప్రణాళిక గురించి, సేవా కూటాల సర్దుబాట్ల గురించి చెప్పండి.
17 నిమి: యౌవనులారా—మీ జీవితలక్ష్యాన్ని చేరుకోవడానికి చెల్లించే మూల్యమెంతో చూసుకోండి. లౌకిక ఉద్యోగంలో ఆచరణాత్మక అనుభవమున్న ఒక పెద్ద దగ్గరకు ఒక తండ్రి తన టీనేజ్ కుమారుడు లేక కుమార్తెతో వస్తాడు. మూడు వారాల క్రితం సేవా కూటంలో చర్చించబడిన, జీవితలక్ష్యాన్ని ఎంపిక చేసుకొనే అంశం గురించి బాగా ఆలోచించిన తర్వాత, ఆ అబ్బాయి లేక అమ్మాయి క్రమ పయినీరు సేవ ప్రారంభించాలనే విషయం గురించి చాలా గంభీరంగా ఆలోచిస్తున్నా, తన నిత్యావసరాల గురించి ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు/ఉన్నది. సమతుల్యమైన దృక్కోణం యొక్క అవసరతను పెద్ద వారికి నొక్కి చెబుతాడు. (సెప్టెంబరు 1, 1999, కావలికోట, 11వ పేజీ, 13వ పేరా) తనను తాను పోషించుకోవడానికి ఉపయోగపడేలా ఏదైనా ఒక పని నేర్చుకోవడం మంచిది. చాలామంది తక్కువ పెట్టుబడి, తక్కువ సమయం అవసరమయ్యే పనులకు కావలసిన కొన్ని ప్రాథమిక నైపుణ్యతలను నేర్చుకొని మంచిగా గడపగలుగుతున్నారు. (ఫిబ్రవరి 1, 1996, కావలికోట, 14వ పేజీ; యువత ఇలా అడుగుతోంది, [ఆంగ్లం] పేజీ 178) మార్చి 8, 1996, జరిల్లు!లోని 9-11 పేజీల్లోని సారాంశాన్ని వాళ్ళు కలిసి చర్చించడంతోపాటు, లౌకిక ఉద్యోగాన్ని పొందడానికి లేక స్వయం ఉపాధి ఏదైనా ప్రారంభించడానికి కొన్ని ఆచరణాత్మకమైన సలహాలను చర్చిస్తారు.
20 నిమి: “అవసరం ఎక్కువగా ఉన్నచోట మీరు సేవచేయగలరా?”a ఐసోలేటెడ్ సేవాప్రాంతంలో లేక అరుదుగా పని చేసిన సేవాప్రాంతంలో స్థానిక ప్రచారకులకు ఎదురైన ప్రోత్సాహకరమైన అనుభవాలను చేర్చండి.—మన పరిచర్య పుస్తకంలోని 112-113 పేజీలను చూడండి.
పాట 8 (53) ముగింపు ప్రార్థన.
జూలై 16తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: సకల జనులకు సువార్త (గుడ్ న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్). ప్రేక్షకులతో చర్చ మరియు ప్రదర్శన. ఈ దేశంలో అనేక భాషలు మాట్లాడే వాళ్ళున్నారు. గుడ్ న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్ అనే బుక్‌లెట్ సహాయంతో వేరే భాష మాట్లాడేవారికి సాక్ష్యం ఎలా ఇవ్వగలమో చూపించండి. 2వ పేజీలోని “ఈ బుక్‌లెట్ ఉపయోగం” అనే అంశాన్ని క్లుప్తంగా చెప్పి, మీ సంఘం యొక్క భాషలో ఉన్న సందేశాన్ని ఆ బుక్‌లెట్ నుండి చదవండి. ఇంటింటి సేవలో వేరే భాష మాట్లాడే వ్యక్తి ఎదురవుతే ఏమి చేయాలో ప్రదర్శించండి. దీన్ని మీ సేవా ప్రాంతంలో ఎలా చేశారో మంచి అనుభవాలేమైనా ఉంటే తెలియజేయండి.—ఫిబ్రవరి 1998, మన రాజ్య పరిచర్య లోపలి పేజీల్లోని 7-8 పేరాలను చూడండి.
20 నిమి: “ప్రకటించడానికి సంకోచించకండి!”b సమయానుకూలతను బట్టి, డిసెంబరు 15, 1999, కావలికోట, 25వ పేజీలోని అనుభవాలను తెలియజేయండి.
పాట 22 (130) ముగింపు ప్రార్థన.
జూలై 23తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: యౌవనులారా—మీ పై చదువుల గురించి వివేచనతో ఆలోచించండి. ఒక పెద్ద, కొందరు తల్లిదండ్రులతోనూ, వారి టీనేజ్ పిల్లలతోనూ అదనపు విద్య గురించి మాట్లాడతాడు. సెప్టెంబరు 1, 1999, కావలికోట, 16-17 పేజీల్లోని, 11-13 పేరాల ఆధారంగా చర్చను పెద్ద ముందుకు నడిపిస్తాడు. వారి ప్రాధాన్యతల పట్టికలో పూర్తికాల పరిచర్య మొట్టమొదటి స్థానంలో ఎందుకుండాలో కారణాలను నొక్కిచెబుతాడు. (డిసెంబరు 1, 1996, కావలికోట, పేజీలు 18-19, పేరాలు 13-15) ఆ తర్వాత, అదనపు విద్యలో ఉన్న ప్రయోజనాలను, అననుకూల స్థితులను బేరీజు వేయడానికి వివేచనను చూపించాల్సిన ప్రాధాన్యతను నొక్కిచెబుతూ, ఆ గ్రూపు మార్చి 8, 1998, తేజరిల్లు!, 20-1 పేజీలలోని సలహాను సమీక్షిస్తుంది. పై చదువుల కోసం తాపత్రయపడకుండా, ఆసక్తిగా పరిచర్యలో కొనసాగుతూ కూడా తనను తాను పోషించుకోవడానికి ఏమి అవసరమో చర్చిస్తారు. యేసు చెప్పిన ఉపదేశానికి కట్టుబడి రాజ్యాసక్తులను మొదటి స్థానంలో పెట్టడానికి వాళ్ళందరూ ఒప్పుకుంటారు.—మత్త. 6:33.
20 నిమి: “యెషయా ప్రవచనాన్ని అధ్యయనం చేయడానికి సిద్ధపడండి!”c యెషయా పుస్తకాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందగలమో క్లుప్తంగా వ్యాఖ్యానించండి. (యెషయా ప్రవచనం I, మొదటి అధ్యాయంలోని 10-12 పేరాలను చూడండి.) సంఘ పుస్తక అధ్యయనానికి క్రమంగా హాజరు కావాలని అందరినీ ప్రోత్సహించండి.
పాట 8 (53) ముగింపు ప్రార్థన.
జూలై 30తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
5 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై నెల క్షేత్రసేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
14 నిమి: “సమావేశాలు—సంతోషం కలిగించే సమయాలు!” పెద్ద ఇచ్చే ప్రసంగం. యెహోవా ప్రజల పెద్ద సమావేశాలవల్ల లభించే ప్రయోజనాలు బైబిలు కాలాల్లోనూ నేడూ ఎందుకు సమానమో వివరించండి. ఈ సందర్భాలు బలం కలిగించే సహవాసాన్ని, ప్రాధాన్యమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తాయి. జిల్లా సమావేశం జరిగే మొత్తం మూడు రోజులు ప్రతి ఒక్కరు హాజరు కావడం ఎంత ప్రాముఖ్యమో నొక్కి చెప్పండి.
16 నిమి: “‘మర్యాదగాను క్రమముగాను’ వ్యవస్థీకరించబడింది.”d ఒక సమావేశాన్ని వ్యవస్థీకరించడానికి తప్పకుండా చేయాల్సిన కొన్ని పెద్ద ఏర్పాట్ల గురించి వివరించండి. మన ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన కార్యవిధానాలతో పూర్తిగా సహకరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. అందుకు మనమందరం సరైన గౌరవాన్ని ఎలా చూపగలమో, అనవసరమైన సమస్యలను ఎలా నివారించగలమో మార్గాలను సమీక్షించండి.
పాట 22 (130) ముగింపు ప్రార్థన.
ఆగస్టు 6తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు. పనిచేసే స్థలానికిగానీ, సెలవులకుగానీ ప్రయాణమై వెళ్ళేటప్పుడు లేక సాక్షులుకాని బంధువులను సందర్శించినప్పుడు అనియత సాక్ష్యమివ్వడంలో పొందిన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
17 నిమి: ‘విని, పాండిత్యము వృద్ధిచేసికొనుము.’ ప్రేక్షకులతో చర్చ మరియు ప్రసంగం. సమావేశాల్లో ఇవ్వబడే ఆదేశాలు ఏ విధంగా మనకు కావలసిన ప్రాధాన్యమైన ఆధ్యాత్మిక ఆహారమో వివరించండి. అలాంటి కార్యక్రమాన్ని సిద్ధం చేయడానికి కావలసిన అధిక సమయం, ప్రయత్నాల గురించి వ్యాఖ్యానించండి. తమకు, ఇతరులకు అత్యధికంగా ప్రయోజనం చేకూర్చడానికి ఏం చేయగలమో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ప్రతి సెషన్ ప్రారంభమైనప్పుడు మనమందరం మన మన సీట్లలో ఎందుకుండాలో కారణాలను నొక్కి చెప్పండి.
18 నిమి: “సక్రమంగా నడుచుకొని, మెప్పు పొందండి!”e పెద్ద సమావేశాలకు మనం హాజరయినప్పుడు మనం ఇతరుల దృష్టిని ఎందుకు ఎక్కువగా ఆకర్షిస్తామో వివరించండి. గమనించేవారి ప్రశంసలు రాజ్య సాక్ష్యాన్ని అధికం చేయగా, విమర్శలు ప్రజలను దూరం చేయగలవు. ఇతరులపట్ల యథార్థమైన శ్రద్ధ కలిగి ఉన్నామని చూపించడంతోపాటు మనలో క్రైస్తవ లక్షణాలున్నాయని తెలుపడానికి మనం చేయాల్సిన కొన్ని నిర్దిష్టమైన విషయాలను సూచించండి.
పాట 17 (187) ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.