కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/01 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 11తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 18తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 25తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 2తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2001
km 6/01 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జూన్‌ 11తో ప్రారంభమయ్యే వారం

పాట 20 (93)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. జూన్‌ 25తో ప్రారంభమయ్యే వారంలోని సేవా కూటంలో జరిగే చర్చకు సిద్ధపాటుగా యెహోవాసాక్షులు నాజీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా దృఢంగా నిలుచున్నారు (ఆంగ్లం) అనే వీడియో చూడమని అందర్నీ ప్రోత్సహించండి.

15 నిమి: “‘మేలు చేస్తూ’ కొనసాగండి.” ఒక పెద్ద ఇచ్చే ప్రోత్సాహకరమైన లేఖనాధారిత ప్రసంగం.

20 నిమి: “మీ విద్యార్థి హృదయాన్ని కదిలించండి.”a క్రొత్తవారు తమ హృదయాల్లో యెహోవా యేసుక్రీస్తుల మీద విశ్వాసాన్నీ ప్రేమనూ వృద్ధి చేసుకోవడానికి మనం వారికెలా సహాయం చేయవచ్చో ఆచరణాత్మకమైన సూచనల్ని చేర్చండి. జూలై 15, 1999, కావలికోట, పేజీ 14, 18-20 పేరాల్లోని మూల విషయాల్ని ఉపయోగించండి.

పాట 28 (224), ముగింపు ప్రార్థన.

జూన్‌ 18తో ప్రారంభమయ్యే వారం

పాట 20 (93)

5 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్ట్‌.

10 నిమి: సంభాషణను ఆటంకపర్చే వారికి ప్రత్యుత్తరం ఇవ్వడం. ప్రేక్షకులతో చర్చ. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలోని 7వ పేజీలో ఉన్న “వ్యాఖ్యానములు”ను సమీక్షించండి. 8-13 పేజీల్లో నుండి, మీ ప్రాంతంలోని ప్రజలు వ్యక్తం చేసే కొన్ని అభ్యంతరాల్ని ఎంపిక చేసుకోండి. వాటికి ఎలాంటి ప్రత్యుత్తరాలు ఎందుకు చక్కని ఫలితాలనిచ్చాయో చెప్పమని ప్రేక్షకుల్ని ఆహ్వానించండి.

15 నిమి: యౌవనస్థులారా—మీ కెరీర్‌ని జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోండి. ఇది సేవా కూటంలోని మూడు భాగాల్లో మొదటిది. ఇవి అదనపు విద్యకు సంబంధించిన లేఖనాధార సూత్రాల్ని సమీక్షిస్తాయి. కొందరు క్రైస్తవ యౌవనస్థులు ఉన్నత విద్య ద్వారా లౌకికమైన కెరీర్లను సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు, అది వారి ఆధ్యాత్మికతపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ భాగంలో, తల్లిదండ్రులు కౌమారప్రాయంలో ఉన్న తమ అబ్బాయి లేక అమ్మాయితో చర్చిస్తారు. ఆ అబ్బాయి/అమ్మాయి ముందు భావి లక్ష్యాల విషయమై ఒక గంభీరమైన నిర్ణయం ఉంది. ఆర్థికంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలనీ, సమాజంలో హోదాను, సుఖజీవనం కోసం అవసరమయ్యే వస్తువులను సంపాదించాలనీ కొందరు వాటి వెంట పడినా ఈ కుటుంబం బైబిలు ఏమి చెబుతుందో పరిశీలిస్తుంది. (యువత ఇలా అడుగుతోంది, [ఆంగ్లం] 174-5 పేజీలు; కావలికోట, ఆగస్టు 15, 1997, 21వ పేజీ; సెప్టెంబరు 1, 1999, 19-21 పేజీల్లోని 1-3 మరియు 5-6 పేరాల్ని చూడండి.) రాజ్యాసక్తుల అభివృద్ధి కోసం దైవపరిపాలనా సంబంధిత లక్ష్యాల్ని చేరుకోవడంలో తనకు సహాయపడే జీవిత విధానాన్ని వెంబడించడం జ్ఞానయుక్తమని అంగీకరిస్తాడు/స్తుంది.

15 నిమి: “మీరు నిరుత్సాహాన్ని తట్టుకొని నిలబడగలరు.” ఫిబ్రవరి 1, 2001, కావలికోట, 20-23 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

జూన్‌ 25తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

15 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై, ఆగస్టుల్లోని సాహిత్య ప్రతిపాదనల్ని సమీక్షించండి. స్థానికంగా స్టాకులో ఉన్న రెండు బ్రోషూర్లను ప్రేక్షకులకు చూపించండి. వాటిని పరిచర్యలో ఎలా ప్రతిపాదించాలో చూపే చక్కగా సిద్ధపడిన రెండు ప్రదర్శనలను చేయించండి. అందింపుల సూచనల కోసం 1995 నుండి 1998 సంవత్సరాల్లోని మనరాజ్య పరిచర్య యొక్క జూలై, ఆగస్టు నెలల సంచికల వెనుక పేజీలను చూడండి.

30 నిమి: “నేను దృఢంగా ఉన్నాను! దృఢంగా ఉన్నాను! దృఢంగా ఉన్నాను!” 2వ పేరాలోని ప్రశ్నల్ని ఉపయోగిస్తూ దృఢంగా నిలుచున్నారు వీడియోను గురించి ప్రేక్షకులతో చేసే చర్చ. తర్వాత 3-4 పేరాల్ని పరిశీలించండి. జనవరి 8, 2000, తేజరిల్లు!, 31వ పేజీలోని అనుభవంతో ముగించండి. ఆగస్టులో మనం కార్యాచరణలో నూతన లోక సమాజం (ఆంగ్లం) అనే వీడియోను పరిశీలిద్దాము.

పాట 18 (162), ముగింపు ప్రార్థన.

జూలై 2తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

13 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్‌ నెల క్షేత్రసేవా నివేదికల్ని ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. “మీ గ్రంథాలయంలో వార్షికపుస్తకాలు అన్నీ ఉన్నాయా?” 1997 నుండి 2000 సంవత్సరాల్లోని వార్షికపుస్తకాలు (ఆంగ్లం)లోని సమాచారం విలువను వివరించడానికి వాటిలోని అనుభవాల్ని పంచుకోండి. ఈ వార్షికపుస్తకాలు లేనివారందరూ వాటి స్టాకు అయిపోకముందే రిక్వెస్టు చేసుకోవాలని ప్రోత్సహించండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

17 నిమి: “మీ ప్రాంతంలోని బధిరులను కనుగొనడంలో చురుకుగా ఉండండి.” ఇండియాలోని సంఘాలన్నింటికీ, అక్టోబరు 15, 1998 తేదీతో వ్రాయబడిన ఉత్తరంలోని “మరో భాష మాట్లాడే వ్యక్తుల్ని కనుగొనడం” అనే భాగాన్ని సమీక్షించండి. ఏప్రిల్‌ 22, 2001, (ఆంగ్లం) తేజరిల్లు!, 19-23 పేజీల్లోని అనుభవాన్ని క్లుప్తంగా పేర్కొనండి.

పాట 3 (32), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి