పత్రికల చందాలను రిన్యూ చేసే సరళీకృత విధానం
ఇంతకు ముందు, కావలికోట, తేజరిల్లు!ల చందాదారులు చందా గడువు పూర్తవుతోందని తెలిపే రెండు స్లిప్పులను అందుకునేవారు. మొదటిది, సంఘం ద్వారా చందాదారులకు పంపించబడే ప్రీప్రింటెడ్ (ముందే ప్రింటు చేయబడిన) ఎక్స్‌పైరింగ్ సబ్‌స్క్రిప్షన్ స్లిప్. అది చందా కాలపరిమితిని పొడిగించమని కోరే ఫారమ్.
రెండవ స్లిప్పు సబ్‌స్క్రిప్షన్ రిన్యువల్ ఫారమ్, అది పత్రికలో పెట్టి నేరుగా చందాదారునికి పోస్టులో పంపించబడేది. కానీ సరళీకృత సాహిత్య పంపిణీ ఏర్పాటు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్లిప్పులు పంపించడం ఆగిపోయింది. అయినప్పటికీ, బ్రెయిలీ లేబుల్లను అందుకునే చందాదారులకు మాత్రం ఈ రిన్యువల్ స్లిప్పులను పంపించడం జరుగుతోంది.
పత్రికల స్వంత కాపీల కొరకు వ్యక్తిగత సబ్‌స్క్రిప్షన్‌లను చేయడానికి బదులుగా, రాజ్య మందిరములోనే సంఘపు స్టాకునుండి పొందమని ప్రచారకులను, పయినీర్లను ప్రోత్సహిస్తున్నాము. ఈ పద్ధతి సొసైటీకి కాస్త పనిని, డబ్బును ఆదా చేస్తుంది. అక్టోబరు 15, 1999 తేదీతో ఇండియాలోని అన్ని సంఘాలకు వ్రాసిన ఉత్తరంలోని రెండవ పేజీలోనున్న “కావలికోట, తేజరిల్లు! పత్రికల సబ్‌స్క్రిప్షన్ల విషయమేమిటి?” అన్న దాని క్రింద చూడండి.
క్షేత్రసేవలో పొందిన చందాలకు, ఎక్స్‌పైరింగ్ సబ్‌స్క్రిప్షన్ స్లిప్ ముఖ్యంగా సంఘం ద్వారా పంపించబడుతుంది. సంఘానికి ఈ స్లిప్పులు రాగానే, ఆ చందాలను పొందిన ప్రచారకులకు వాటిని అందజేయడానికి ప్రాముఖ్యతనివ్వాలి. చందాదారుడు రిన్యువల్ ఫారమ్‌ను ఇంతకు ముందులాగా పత్రికలో అందుకోడు కాబట్టి, అలాంటి ఆసక్తిగలవారిని మనం చురుగ్గా కలుసుకుంటుండాలి. ఆ వ్యక్తికి ఆ పత్రిక చందా పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందా, దానిపట్ల ఆయనకు నిజమైన ఆసక్తి ఉందా లేదా అని నిర్ణయించడానికి మనం ప్రయత్నించాలి. ఒకవేళ ఆ వ్యక్తి నిజమైన ఆసక్తిని కనబరిస్తే సబ్‌స్క్రిప్షన్ రిన్యూ చేయడానికి బదులుగా, పోస్టల్ ఖర్చులు ఆదా చేయడంలో సహాయపడడానికి ఆ వ్యక్తిని మన పత్రిక మార్గంలో చేర్చండి, ఆ విధంగా ప్రతి సంచిక వచ్చినప్పుడు ఆ వ్యక్తికి పత్రికను స్వయంగా అందించి ఆయన ఆసక్తిని పెంపొందించే అవకాశం ఉంటుంది. కానీ స్వయంగా పత్రికలను అందించడం ఆచరణ యోగ్యం కాని సందర్భాల్లో సబ్‌స్క్రిప్షన్ రిన్యూ చేయడానికే నిర్ణయించవచ్చు. రిన్యూ చేసే ప్రక్రియను త్వరితం చేయడానికిగాను, మీకు అందిన ప్రీప్రింటెడ్ ఎక్స్‌పైరింగ్ సబ్‌స్క్రిప్షన్ స్లిప్‌నే పంపించడం మంచిది. రిన్యూ చేయబడిన సబ్‌స్క్రిప్షన్స్ ఎప్పుడూ సంఘంద్వారా మాత్రమే పంపించాలి.—నవంబరు 1988, (ఆంగ్లం) మన రాజ్య పరిచర్య, 4వ పేజీ, ఫిబ్రవరి 1986, (ఆంగ్లం) 4వ పేజీలను చూడండి.
చందాదారులు మనం స్వయంగా చేరుకోలేని ప్రాంతాల్లోగానీ మారుమూల ప్రాంతాల్లోగానీ నివసిస్తున్నట్లైతే సంఘం వారి ఎక్స్‌పైరింగ్ సబ్‌స్క్రిప్షన్ స్లిప్పులను పోస్టు ద్వారా వారికి పంపించవచ్చు.
సమయోచితమైన ఈ సాహిత్యాలు, అంధకార బంధురమైన ఈ లోకంలో ఆధ్యాత్మిక వెలుగును ప్రకాశింపజేస్తూనే ఉంటాయి. కావలికోట, తేజరిల్లు!ల చందాదారులందరికీ ఒక్క పత్రిక కూడా తప్పిపోకుండా అందజేయడంలో, ఈ క్రొత్త విధానానికి అందరూ సహకరిస్తారని మేము నమ్ముతున్నాము.