వినుటకు ఇష్టపడు వారిని, “రమ్ము!” అని చెప్పుటలో కొనసాగుము
1 ప్రజలు సత్యవర్తమానమును శ్రద్ధతో విను అవసరతను యేసు నొక్కి తెలియజేసెను. (మత్త. 11:15; 13:9, 43) గుణగ్రహణతో విను వారిని నిత్యజీవమునకు నడిపించగల జ్ఞానమును తెలియజేస్తున్నందున తన బోధలోని భావమును గ్రహించుట ప్రాముఖ్యమని ఆయన యెరిగి యుండెను.—యోహాను. 17:3.
2 అలాంటి జీవమునిచ్చు—జ్ఞానము దప్పిక గలవారికి ఇప్పుడు ఇవ్వబడుచున్న “జీవ జలము”లలో ఒక ముఖ్యభాగమై యున్నది. (ప్రక. 22:17) యోహాను మాటలను బట్టి అది అనుగ్రహమొందిన కొందరి వ్యక్తిగత సొత్తయి, డబ్బుగల వారికి అమ్మేది లేనివారికి కాదనేది కాదు. నీతి కొరకు దప్పిక గల వారందరు యెహోవా ఉచితముగా ఇచ్చు ఆ బహుమతి నుండి ప్రయోజనము పొంద ప్రోత్సహించబడవలెను. (యెష. 55:1) వినుటకు ఇష్టపడు వారిని “రమ్ము!” అని చెప్పు లక్షలాది ప్రజలలో నీవును ఒకడవై యున్నావా?
“రమ్ము!” అని మీరెట్లు చెప్పగలరు?
3 మన వాచ్‌టవర్ చందా అందించు ప్రత్యేక కార్యక్రమములో జూన్ రెండవ నెల జీవమునకై యెహోవా చేసిన అద్భుత ఏర్పాటుకు పిలువగల శ్రేష్టమైన సాధనము ఇంతకంటె ఇంకొకటేమున్నది? మహాబబులోను దుష్టపన్నాగములను ప్రత్యేకముగా నొక్కి బహిర్గతము చేయుట ద్వారా, మత అబద్ధములు మూఢ నమ్మకముల నుండి విడుదల పొంద వాచ్‌టవర్ సహాయము చేయగలదు. కావున చందానందించు ఏ అవకాశములను నీవు కనుగొందువు?
4 అందుకు చక్కని మార్గమైన ఇంటింటి సేవతోపాటు పునర్దర్శనములు చేయునప్పుడు, తాజా పత్రికలను మాగజైన్ రూటులోని ప్రజలకిచ్చునప్పుడు అట్లు చేయవచ్చును. వీధి సాక్ష్యములో కలుసుకొనిన ఆసక్తిగల వారికి చందానందించుటలో కొందరు ప్రచారకులు విజయము పొందుతున్నారు. ఇప్పటికే చందాదారులైన వారిని వారి స్నేహితులకు, బంధువులకు బహుమతిగా చందాలను పంపమని ప్రోత్సహిస్తూ మీరును ఆలాగే చేయవచ్చును. వ్యాపార పరిచయస్తులు, తోటి పనివారు, తోటి విద్యార్థులకు చందా అందించవచ్చును.
“రమ్ము!” అని చెప్పుచునే యుండుడి
5 మే నెలలో చందా తీసుకొనిన వారికి సహాయపడుటలో కొనసాగుము. వెంటనే పునర్దర్శించుటకు తప్పిపోకుము. వారికి పత్రికలందుచున్నవో లేవో రూఢిపరచుకొనుము. అలా దర్శించునప్పుడు ఒక ప్రత్యేక శీర్షికను సూచించి దానిని చదవమని ప్రోత్సహించుము. బహుశా బైబిలు పఠనమును ప్రారంభించి సంఘ కూటములకు హాజరు కమ్మనియు వారికి సలహా ఇవ్వవచ్చును. ఆ విధముగా నీవు వారిపై చూపు యథార్థమైన శ్రద్ధ వారిని ఆత్మీయముగా వృద్ధి చెందుటకు నడిపించవచ్చును.
6 ఇండియాలో జ్ఞాపకార్థ దినమునకు హాజరగు వారి సంఖ్య ఇట్లు హాజరగువారిలో ఇంకనూ ప్రచారకులుగా కావలసినవారు 14,500 మంది ఉన్నారని చూపుతుంది. మీ సంఘములో ఇట్టి ఆసక్తిగల వారెవరో నీకు తెలియునా? వారు వాచ్‌టవర్‌కు చందాదారులా? వారు ఆత్మీయముగా పెరుగుటకు ఏమి చేయబడుచున్నది?
7 “రమ్ము!” అను ఆహ్వానము సకలజాతి మనుషులకు ఇవ్వబడుతుంది. ఈ ఆహ్వానమునకు జవాబునిచ్చి జీవజలములను ఉచితముగా తీసుకొను వారందరికి యెహోవా దేవుడు దయతో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జీవమును పొందు ఏర్పాటును చేసియున్నాడు. కావున జూన్ నెలలో ఇతరులకు ఈ ఆహ్వానమును ఇచ్చుటయందు నీవు పూర్తిగా భాగము వహించుదువా?