కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/01 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—2001
మన రాజ్య పరిచర్య—2001
km 4/01 పేజీలు 5-6

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

జనవరి 1 నుండి ఏప్రిల్‌ 23, 2001 మధ్య వారాల్లో జరిగిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నియామకాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించాలి. ప్రశ్నల ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. గంభీరమైన తప్పులను చూడకుండా భావోద్వేగాలు మనల్ని గ్రుడ్డివారిని చేయడానికి ఎన్నడూ అనుమతించకపోయినా, మనకు విరుద్ధంగా పాపం చేసి పశ్చాత్తాపపడిన వ్యక్తిని దయాపూర్వకంగా క్షమించడం ద్వారా మనం యోసేపు మాదిరిని అనుకరించగలం. (ఆది. 42:21; 45:4, 5) [w99 1/1 31వ పేజీ, 2-3 పేరాలు]

2. వివాహ జీవితంలో ఐక్యతకుగల ఏకైక అంశం ఒకే విశ్వాసాన్ని కల్గివుండడం. [fy 21, 22 పేజీలు, 14వ పేరా]

3. క్రీస్తు ఆధ్వర్యంలో ఉన్న దేవుని రాజ్యం భూమంతా ఆవరించి దాన్ని పరిపాలిస్తుందని హబక్కూకు గ్రంథము ప్రవచిస్తుంది. [br78 16వ పేజీ, 3వ పేరా]

4. పరలోకాన్ని వదలి భూమి మీదకు రావడమనే తనకు నిర్దేశించబడిన నిరుపమానమైన పనిని స్వీకరించడం ద్వారా, దేవదూతల కంటే తక్కువ వానిగా, ఒక సాధారణ మానవునిగా తన్ను తాను తగ్గించుకోవడం ద్వారా యేసు తన నమ్రతను ప్రదర్శించాడు. (ఫిలి. 2:5-8; హెబ్రీ. 2:7) [w99 2/1 6వ పేజీ, 3వ పేరా]

5. షీషకు యూదాపై దాడిచేసి, “యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచు”కున్న విషయాన్ని పురాతత్వశాస్త్రం ధ్రువీకరిస్తుంది. (2 దిన. 12:9) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 2/1 26వ పేజీ, 4వ పేరా చూడండి.]

6. యేసు బాప్తిస్మము తీసికొనుచుండగా ‘ఆకాశము తెరవబడింది,’ అంటే ఆయనకు పరలోకమందలి తన మానవపూర్వపు జీవితం జ్ఞాపకం వచ్చిందని దాని భావమని స్పష్టమౌతుంది. (మత్త. 3:16) [gt 12]

7. ఒకరు ప్రతిఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దేవుని సేవచేయాలి. [w99 4/15 16వ పేజీ, 1వ పేరా]

8. కీర్తన 103:2లో వ్రాయబడినట్టుగా దావీదు యెహోవా ‘చేసిన ఉపకారములను’ సూచించినప్పుడు ఆయన మనస్సులో ఉన్నది యెహోవా దేవుని భౌతిక సృష్టే. [w99 5/15 21వ పేజీ, 5-6 పేరాలు]

9. ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేసేందుకు కుటుంబపఠనం మాత్రమే ఒక సందర్భం కాదు. [fy 70వ పేజీ, 14వ పేరా]

10. తన భర్త మంచి కుటుంబ శిరస్సుగా ఉండేందుకు భార్య సహాయపడలేదు. [fy 34, 35 పేజీలు, 17, 18 పేరాలు]

క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:

11. వివాహ సంబంధ సలహాల కొరకు బైబిలును అధికారిక మూలంగా అంగీకరించడం ఎందుకు సహేతుకం? [fy 10వ పేజీ, 18వ పేరా]

12. యోసేపు మరియల వివాహము జరగక ముందే యోసేపు ఆమెకు ఏవిధంగా ‘విడాకులివ్వాలని ఉద్దేశించాడు’? (మత్త. 1:18, 19) [gt 4]

13. యూదా రాజైన ఉజ్జియా నుంచి ప్లస్‌పాయింట్ల లేదా ప్రత్యేకతల విషయంలో ఏ గుణపాఠాన్ని మనం నేర్చుకోగలం? (2 దిన. 26:15-21) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 12/1 26వ పేజీ, 1-2 పేరాలు చూడండి.]

14. యేసు తన శిష్యుల పాదాలు కడగడం ద్వారా, మత సంబంధమైన ఒక ఆచారాన్ని ఏర్పాటుచేయడానికి బదులుగా, ఏ శక్తివంతమైన పాఠాన్ని అందజేశాడు? (యోహా. 13:4, 5) [w99 3/1 31వ పేజీ, 1వ పేరా]

15. మొదటి దినవృత్తాంతములు 14:8-17 వచనాల్లో ఉన్న వృత్తాంతం యెషయా కాలంలో ఎందుకు ఆసక్తిని కల్గించింది, నేడు క్రైస్తవ మత సామ్రాజ్యానికి ఎందుకు ఆసక్తిని కల్గించాలి? (యెష. 28:21) [వారం వారం చదవాల్సిన బైబిలు భాగం; w91 6/1 21వ పేజీ, 2-3 పేరాలు చూడండి.]

16. బయలు ఆరాధనలో ఉన్న ఏ అంశాలు, అనేకమంది ఇశ్రాయేలీయులకు దాన్ని ఆకర్షణీయమైనదిగా చేశాయి? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 4/1 29వ పేజీ, 3-6 పేరాలు చూడండి.]

17. యెరూషలేము నీటి సరఫరాను కాపాడి, దాన్ని ఎక్కువ చేసేందుకు హిజ్కియా చేసిన ప్రయత్నాల నుంచి మనం ఏ ఆచరణాత్మకమైన పాఠాలను నేర్చుకోవచ్చు? (2 దినవృత్తాంతములు 32:3, 4) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w96 8/15 6వ పేజీ 1-2 పేరాలు చూడండి.]

18. దేవునిని సేవించేందుకూ, అబద్ధ ఆరాధనకు విరుద్ధంగా స్థిరంగా నిలబడేందుకూ నేటి యౌవనులకు యోషీయా మాదిరి ఏ విధంగా ప్రోత్సాహకరంగా ఉండగలదు? (2 దిన. 34:3, 8, 33) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w91 9/1 5వ పేజీ, 2వ పేరా చూడండి.]

19. బబులోనులో నిలిచిపోయిన యూదులందరూ అవిశ్వాసులేనా, దాన్నుంచి మనం ఏ ఆచరణాత్మకమైన గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు? (ఎజ్రా 1:3-6) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 1/15 8వ పేజీ, 4, 7 పేరాలు చూడండి.]

20. రెండవ దినవృత్తాంతములు 5:13, 14 వచనాల్లో, యెహోవా తన ప్రజల శ్రావ్యమైన స్తుతిని వింటున్నాడనీ, దానితో ఆయన ప్రీతిపర్చబడ్డాడనీ ఏది చూపిస్తోంది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w94 5/1 10వ పేజీ, 7వ పేరా చూడండి.]

క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:

21. తోటి క్రైస్తవునికి సలహా ఇచ్చేవ్యక్తి __________ ఆధారంగా ఇవ్వాలేగానీ, __________ ఆధారంగా, __________ ఆధారంగా ఇవ్వకూడదు. (కొలొ. 2:8) [w99 1/15 22వ పేజీ, 1వ పేరా]

22. ఆసక్తిగల వ్యక్తుల __________ యెహోవాసాక్షులు ఉచితంగానే __________ను నిర్వహిస్తారు. [br78 28వ పేజీ 1వ పేరా]

23. లేత మొక్కలు ఎదిగి ఫలాలు ఫలించకుండా ముళ్లపొదలు ఎలాగైతే అణచివేస్తాయో అలాగే అదుపులేని __________, __________ యొక్క మోసకరమైన శక్తి ఆధ్యాత్మిక పరిణతికి పురోభివృద్ధి సాధించకుండా ఆటంకపరచగలవు. (మత్త. 13:19, 22) [w99 3/15 22వ పేజీ 5వ పేరా]

24. అదేరీతిన మనము లోక సంపదను, __________ను, లేక __________ను సంపాదించుకొను అవకాశములను బహుశ మనముందుంచుచు మనలను __________కు అపవాది ప్రయత్నించవచ్చును. [gt 13]

25. సొలొమోను ఎచ్చట తప్పిపోయాడో, అచ్చట విజయమొందడానికి ఒక నిజ క్రైస్తవుడు తన ఆరాధనలో __________ను, __________నాన్ని ప్రక్కనబెట్టి, ‘నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణహృదయముతో ప్రేమించమని’ __________ చెప్పిన మాటలను ఆచరణలో పెట్టాలి. (మత్త. 22:37; 1 దిన. 28:9) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w87 1/1 12వ పేజీ, 17, 18 పేరాలు చూడండి.]

క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

26. రెండవ రాజులు 17:5, 6 వచనాల్లోని వృత్తాంతం, (తిగ్లత్పిలేసెరు; షల్మనేసెరు V; ఏసర్హద్దోను) ఉత్తరపు దిక్కున ఉన్న పది గోత్రముల ఇశ్రాయేలు రాజ్యముపై ఎలా దండెత్తి, బహుబలమైన ప్రాకారములుగల ముఖ్యపట్టణమైన సమరయను మూడు సంవత్సరాలపాటు ముట్టడి వేశాడో తెలియజేస్తుంది, చివరకు అది అష్షూరీయుల చేతిలో సా.శ.పూ. (740లో; 607లో; 537లో) నాశనమాయెను. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w89 8/1 29వ పేజీ 1వ పేరా చూడండి.]

27. బైబిలును వ్రాయడం దాదాపు (3500; 2000; 1000) సంవత్సరాల పూర్వం ముగించబడినప్పటికీ, దాని సలహా వాస్తవంగా నేటి కాలానికి తగినది. [fy 12వ పేజీ, 23వ పేరా]

28. నిర్గమకాండము 4:11 సూచిస్తున్నట్లుగా, యెహోవా దేవుడే ‘మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టిస్తున్నాడు’ గనుక దాని భావమేమిటంటే, ఆయనే (ప్రజలకున్న వైకల్యాలనుబట్టి నిందించబడాలి; సేవాధిక్యతల కోసం వేర్వేరు వ్యక్తులను ఎంపిక చేసుకుంటున్నాడు; మానవుల్లో శారీరక లోపాలు ఉండేందుకు అనుమతించాడు.) [w99 5/1 28వ పేజీ 2వ పేరా]

29. క్రైస్తవ తలిదండ్రులు (దయగా; దృఢంగా; కఠినంగా) ఉండాల్సిన అవసరతను గుర్తిస్తూ, తమ పిల్లలకు క్రమశిక్షణనిచ్చే సమయంలో ఎఫెసీయులు 6:4లో ఉన్న సలహాను మనస్సులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తారు. [fy 60వ పేజీ, 21వ పేరా]

30. క్రైస్తవమత సామ్రాజ్య మూల సిద్ధాంతాలు బైబిలు మీద కాదుగాని ప్రాచీనకాల (వాస్తవాలపై; పుక్కిటి పురాణాలపై; పారంపర్యాచారాలపై) ఆధారపడియున్నవి. [pr 17వ పేజీ, 4వ పేరా]

క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:

అపొ. 17:10, 11; సామె. 25:11; రోమా. 12:2; యోహా. 2:15-17; మత్త. 13:55, 56

31. మన ఆలోచనా సరళిని మార్చుకొని, దైవిక సత్యంతో మన మనస్సును నింపుకునేందుకు ఇష్టపూర్వక ప్రయత్నం అవసరం. [w99 4/1 22వ పేజీ, 2వ పేరా]

32. ఉపదేశం ఇచ్చేటప్పుడు, సరైన పదాలను ఎంపిక చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. [w99 1/15 23వ పేజీ, 1వ పేరా]

33. బైబిలు సత్యాలుగా అందజేయబడిన బోధల విషయానికొస్తే, యెహోవాసాక్షులు మొదటి శతాబ్దానికి చెందిన బెరయలోనివారు అనుసరించిన పద్ధతిని దృఢంగా బలపరుస్తారు. [br78 3వ పేజీ, 4వ పేరా]

34. యేసుకు కనీసం ఆరుగురు తమ్ముళ్లు చెల్లెళ్లు ఉన్నారు. [gt 9]

35. యేసు దేవాలయంలో నుండి వర్తకులను, అమ్మువారిని తోలివేసినప్పుడు, ఆయన శిష్యులు దేవుని కుమారుని గూర్చిన ప్రవచనాన్ని జ్ఞాపకము చేసికొనిరి. [gt 16]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి