కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/01 పేజీ 8
  • యెహోవా బలాన్నిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా బలాన్నిస్తాడు
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • అలసినవారిని యెహోవా బలపరుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా మీకు శక్తిని ఇస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • అలసిపోయినవారికి యెహోవా శక్తినిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2001
km 2/01 పేజీ 8

యెహోవా బలాన్నిస్తాడు

1 అపొస్తలుడైన పౌలుపై మీకు ఎటువంటి అభిప్రాయముంది? అపొస్తలుల కార్యములు పుస్తకాన్ని మనం చదువుతుండగా, ఆయన యెహోవా సేవలో ఎంత కష్టించి పనిచేశాడన్న విషయాన్ని మనం గుర్తిస్తాం. పౌలు తాను చేసినదాన్నంతటినీ ఎలా నెరవేర్చగలిగాడు? ఆయన ఇలా అంటున్నాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలి. 4:13) యెహోవా ఇచ్చే బలాధిక్యత నుంచి మనం కూడా ప్రయోజనం పొందగలం. ఎలా? ఆధ్యాత్మికంగా పునరుత్తేజితుల్ని చేసేందుకూ, బలపర్చేందుకూ మన కోసం ఆయన చేసిన ఆరు ఏర్పాట్ల నుంచి ప్రయోజనం పొందడం ద్వారానే.

2 దేవుని వాక్యము: మన శారీరక శక్తిని కాపాడుకోడానికి మనం ఆహారం తీసుకుంటున్నట్టుగానే, ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండేందుకు దేవుని వాక్యంతో మనల్ని మనం పోషించుకోవాలి. (మత్త. 4:4) మనల్ని బలపర్చేందుకు శక్తిని బైబిలు ఇస్తుంది. సత్యం పట్ల మన ఆసక్తినీ, ఉత్సాహాన్నీ కాపాడుకోవాలంటే, సాధ్యమైతే ప్రతిరోజూ వ్యక్తిగతంగా అర్థవంతంగా అధ్యయనం చెయ్యాలి, ధ్యానించాలి.—కీర్త. 1:2, 3.

3 ప్రార్థన: యెహోవాకు సన్నిహితమవ్వడం ప్రాముఖ్యం, ముఖ్యంగా ప్రత్యేక అవసరత ఏర్పడిన సమయాల్లో. ప్రార్థనలో శక్తి కోసం ఆయనను అడుగుతున్న వారికి ఆయన బలోపేతం చేసే శక్తిని తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. (లూకా 11:13; ఎఫె. 3:16) ‘ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలని’ లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. (రోమా. 12:12) మీరు అలా చేస్తున్నారా?

4 సంఘం: సంఘ కూటాల నుంచీ, అక్కడ మన సహోదర సహోదరీల ప్రేమపూర్వక సహవాసం నుంచీ మనం బలాన్నీ, ప్రోత్సాహాన్నీ కూడా పొందుతాం. (హెబ్రీ. 10:24, 25) మనం కష్టాలకు గురైనప్పుడు మనల్ని ప్రోత్సహించేందుకూ, మనకు ప్రేమపూర్వకంగా సహాయం చేసేందుకూ వాళ్లు సహాయపడతారు.—సామె. 17:17; ప్రసం. 4:10.

5 క్షేత్ర పరిచర్య: పరిచర్యలో క్రమంగా భాగంవహించడం, రాజ్యంపైనా అది తీసుకొచ్చే ఆశీర్వాదాలపైనా దృష్టిని కేంద్రీకరించడానికి మనకు సహాయపడుతుంది. యెహోవా గురించి తెలుసుకునేలా ఇతరులకు మనం సహాయపడినప్పుడు మనం ఉత్తేజితులమౌతాం. (అపొ. 20:35) మనలో అందరూ అవసరత ఎక్కువగా ఉన్న చోటుకి తరలి వెళ్లలేరు లేక పూర్తికాల సేవలో భాగంవహించలేరు కానీ, మనం ఇతర మార్గాల్లో పరిచర్యలో ఒక అర్థవంతమైన భాగాన్ని కల్గివుండవచ్చు.—హెబ్రీ. 6:10-12.

6 క్రైస్తవ పైవిచారణకర్తలు: పెద్దలు ఇచ్చే ప్రోత్సాహాన్నుంచీ, సహాయాన్నుంచీ మనం ప్రయోజనం పొందుతాం. తమ కాపుదలలో ఉన్న దేవుని మందను కాయడానికి యెహోవా వారిని నియమించాడు. (1 పేతు. 5:2) పౌలు తన కాలంలో సంఘాలను బలపర్చినట్టుగానే ప్రయాణ పైవిచారణకర్తలు తాము సేవ చేస్తున్న సంఘాలను బలపరుస్తారు.—రోమా. 1:11, 12.

7 విశ్వాసుల మాదిరులు: ప్రాచీనకాలానికి చెందిన, ఆధునిక కాలానికి చెందిన విశ్వాసులైన తోటి సేవకుల ప్రోత్సాహకరమైన మాదిరులను పరిశీలించడం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. (హెబ్రీ. 12:1) మీరు పునరుత్తేజాన్ని పొందాల్సిన అవసరం ఉన్నప్పుడు, మన పత్రికల్లోని జీవిత కథల్లో ఒక ప్రోత్సాహకరమైన కథనో, వార్షిక పుస్తకములోని క్షేమాభివృద్ధికరమైన ఒక రిపోర్టునో లేక ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకంలో ఉన్న ఉత్తేజాన్ని కల్గించే యెహోవాసాక్షుల ఆధునిక కాల చారిత్రక వృత్తాంతాన్నో ఎందుకు చదవకూడదు?

8 తన 90వ పడిలో ఉన్న ఒక సహోదరుడు బాలునిగా ఉన్నప్పుడే సత్యాన్ని అంగీకరించారు. ఆయనింకా చిన్నవానిగానే ఉన్నప్పుడు, ఆయన విశ్వాసం పరీక్షకు గురైంది. మొట్టమొదటిగా, సంఘంతో చురుగ్గా సహవాసం చేస్తున్న వారిలో కొందరు యెహోవా సంస్థను విడిచి వెళ్లిపోయారు. తర్వాత ఇంటింటి పరిచర్యలో పాల్గొనాలి, అది ఆయనకు ఎంతో కష్టమైందిగా అన్పించింది. అయినప్పటికీ, ఆయన ఎప్పుడూ యెహోవాపైనే ఆధారపడేవారు. త్వరలోనే పరిచర్యలో ఆనందాన్ని అనుభవించారు. మరి నేడో? ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పరిపాలక సభలో సేవచేస్తూ ఆయన బ్రూక్లిన్‌ బేతేలు కుటుంబంలో ఒక సభ్యునిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. యెహోవా సంస్థను అంటిపెట్టుకొని ఉన్నందుకు ఆయన ఎంతమాత్రం విచారించడం లేదు.

9 బ్రిటన్‌లోని బేతేలు కుటుంబ సభ్యురాలైన ఒక సహోదరి తాను 13 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాతి సంవత్సరంలోనే ఆమె తన అన్నయ్యతో కల్సి పయినీరు సేవ చేయడం మొదలు పెట్టారు, ఆ పై సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో తటస్థ వైఖరి చూపించినందున వాళ్ల నాన్నగారు జైల్లో వేయబడ్డారు. శక్తి కోసం యెహోవాపై ఆధారపడుతూ, సత్య దేవుని సేవలో ఆమె కొనసాగారు. కొంతకాలానికి, ఆమె విశ్వాసియైన ఒక సహోదరుడ్ని వివాహం చేసుకున్నారు, వారిరువురూ యెహోవా చిత్తాన్ని చేస్తున్నారు. 35 సంవత్సరాల వివాహ జీవితానంతరం, ఆమె భర్త ఆకస్మిక మరణానికి గురయ్యారు. మరలా ఆమె యెహోవా నుంచే బలాన్ని పొందారు, ఈ రోజు వరకూ యెహోవా సేవలో కొనసాగుతూ, యెహోవా భూకుటుంబంలో ఒక సభ్యురాలిగా నిరంతరం సేవ చేయడానికి ఎదురు చూస్తున్నారు.

10 యెహోవా తన సేవకులకు సహాయంచేసి పునరుత్తేజితుల్ని చేస్తాడు. “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.” పైన ప్రస్తావించబడిన ఆరు ఏర్పాట్ల నుంచీ పూర్తి ప్రయోజనం పొందడం ద్వారా అపరిమితమైన శక్తికి మూలమైన ఆయన నుంచి బలాన్ని పొందగలం. దీన్ని గుర్తుంచుకోండి: “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. . . . అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.” (యెష. 40:29-31) పౌలు బలం కోసం యెహోవాపైనే ఎక్కువగా ఆధారపడ్డాడు, మనం కూడా అలానే ఆధారపడాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి