సత్క్రియల ద్వారా యెహోవాను మహిమపరచండి
1 మీరు పెనుతుపానులో చిక్కుకున్నప్పుడు, తలదాచుకోడానికి ఆశ్రయాన్ని పొందితే ఎంత ఉపశమనంగా ఉంటుందో కదా! ఆశ్రయాన్ని ఇచ్చిన ఆ ఇల్లు వెచ్చగాను సురక్షితంగాను ఉన్నట్లయితే, దాంట్లో ఉంటున్న వాళ్లు అతిథి ప్రియులైతే, మీరు అక్కడ ఉండడానికి సంతోషిస్తారు. రాజ్య ప్రకటనా పని, ప్రజలు సాతాను విధానం నుంచి అటువంటి ఆశ్రయ స్థలానికి వెళ్లేలా త్రోవ చూపిస్తుంది. మన అనుదిన ప్రవర్తన, ఆ సురక్షితమైన ఆశ్రయ స్థలం తమను ఎంతగా ఆకట్టుకుంటుందో చూసేలా ఇతరులకు సహాయపడగలదా? సహాయపడుతుంది, ఎందుకంటే ‘మనుష్యులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుస్తారని’ యేసు చెప్పాడు.—మత్త. 5:16.
2 మన సత్క్రియలు ఇతరులను యెహోవా వైపుకూ, ఆయన సంస్థవైపుకూ ఆకర్షించేలా మనమెలా ప్రవర్తించగలం? ప్రతీరోజూ మన జీవితాలను మలిచేందుకు లూకా 6:31లోను 10:27లోను రాయబడిన యేసు మాటలను అనుమతించడం ద్వారానే. అది, తోటి మానవుల పట్ల ప్రేమపూర్వక శ్రద్ధను చూపించేందుకు మనలను కదిలిస్తుంది; ప్రేమరహితమైన, ఇతరులను పట్టించుకోని ఈ లోకం నుంచి వేరుగా ఉండేలా చేస్తుంది.
3 సముద్రయానం పడకపోవడం వల్ల వాంతులతో కూడిన అనారోగ్యంతో బాధపడుతూ తన చిన్న బిడ్డను సరిగా చూసుకోలేకపోతున్న ఒక యౌవన స్త్రీని ఆమెతోపాటు ప్రయాణిస్తున్న ఒక సహోదరి గమనించింది. ఆ బిడ్డను తాను చూస్తానని సహోదరి ఆమెతో చెప్పింది. నేను మీ రుణం ఎలా తీర్చుకోగలను అని ఆమె ఆ సహోదరిని అడిగినప్పుడు, ‘ఈ సారి యెహోవాసాక్షులు మీ ఇంటికి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళు చెప్పేది వినండి’ అని ఆ సహోదరి బదులిచ్చింది. ఆ స్త్రీ అలాగే చేసింది. ఇప్పుడు, ఆమె, ఆమె భర్త సాక్షులు. సత్క్రియలు, వాళ్ళు రాజ్య సందేశానికి ప్రతిస్పందించిన విధానంలో మార్పును తీసుకొచ్చాయి.
4 మన యావత్ జీవితం ఇమిడి ఉంది: ఉద్యోగ స్థలంలోనైనా, స్కూల్లోనైనా పొరుగువారి మధ్యన అలాగే వినోద కార్యక్రమాల్లో నిమగ్నమైయున్న సమయాల్లో మనం ప్రవర్తించే విధానం, ఇతరులు మనపైనా మన మతంపైనా ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకోవడానికి కారణమౌతుంది. అందుకని, ‘చూసేవాళ్ళు నన్నూ, మా కుటుంబాన్నీ ఎలా దృష్టిస్తారు? మా ఇల్లూ పరిసరాలూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాయని మా పొరుగువాళ్ళు తలుస్తారా? మా తోటి ఉద్యోగస్థులు, తోటి విద్యార్థులు మమ్మల్ని సమయాన్ని పాటించేవారిగా, పనిలో లేదా చదువులో శ్రద్ధగలవారిగా దృష్టిస్తున్నారా? మనం కన్పించేతీరు తగినరీతిలోనూ, గౌరవప్రదంగానూ ఉన్నట్లు ఇతరులు కనుగొంటారా?’ అని మనలను మనం ప్రశ్నించుకోవడం మంచిది. మన సత్క్రియలు యెహోవా ఆరాధనను ఇతరులకు మరింత ప్రీతిపాత్రమైందిగా చేస్తాయి.
5 క్రైస్తవులు ఎగతాళి చేయబడతారని పేతురు హెచ్చరించాడు. (1 పేతు. 4:4) మన ప్రవర్తన మన గురించి చెడుగా మాట్లాడుకోడానికి కారణం కాకుండా చూసుకోవాలి. (1 పేతు. 2:12) అనుదినం మనం చేసే పనులు మనం ఆరాధించే దేవుడ్ని మహిమపరస్తున్నట్లైతే, అప్పుడు మనం యెహోవా ఇస్తున్న సురక్షితమైన ఆశ్రయం వైపుకు ఇతరులను ఆకర్షిస్తూ ఎత్తున ఉంచబడిన దీపాల్లా ఉంటాం.—మత్త. 5:14-16.