సంతోషకరంగా ప్రవర్తించేవారిగా ఉండండి
1 నోవహు కాలంలోలానే తన ప్రత్యక్షతా కాలంలో కూడా ప్రజలలో అధికశాతం మంది ‘ఎరుగకుండా’ ఉంటారని యేసు చెప్పాడు. (మత్త. 24:37-39) కాబట్టి, అనేకమంది రాజ్య సువార్తను వినరని ఎదురుచూడవచ్చు. మనం మన పరిచర్యను నిర్వర్తిస్తుండగా ఆనందభరితమైన స్ఫూర్తిని కాపాడుకోడానికి మనకు ఏం సహాయపడగలదు?—కీర్త. 100:2.
2 మొట్టమొదటిగా, మనం అందించే సందేశమూ, అలాగే ప్రకటించమని మనకివ్వబడిన నియామకమూ దేవుని నుంచి వచ్చాయన్న విషయాన్ని మనం మనస్సునందు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పరిచర్యలో మనం ఎంతగా కృషి చేసినప్పటికీ ప్రతిస్పందన సరిగా లేకపోయినట్లైతే అది నిజానికి యెహోవాను తిరస్కరించడమే. ప్రకటనా పనిలో మనం చూపించే నమ్మకత్వానికి ఆయన చిరునవ్వుతో కూడిన అంగీకారం ఉందన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం, దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారిగా మన ఆనందాన్నీ అంతర్గత సంతోషాన్నీ కాపాడుకునేందుకు మనకు సహాయపడుతుంది.—యాకో. 1:25.
3 రెండవదిగా, యెహోవా రక్షణ మాధ్యమాన్ని అంగీకరించే వ్యక్తులు ఇంకా ఉన్నారు. అధిక శాతం మంది బహుశా ఉదాసీన వైఖరిని చూపించినప్పటికీ, అంత్యదినాల చివర్లో ఇప్పుడు కూడా సమకూర్చబడాల్సిన గొఱ్ఱెల్లాంటి వారు ఇంకా ఉన్నారు. ‘యోగ్యుడైన వానిని’ కనుగొనేందుకు ‘ఏ పట్టణములోకైనా, ఏ గ్రామములోకైనా’ మనం వెళ్తూ, ప్రకటిస్తూనే ఉండాల్సిన అవసరం ఉంది.—మత్త. 10:11-13.
4 అనుకూల వైఖరిని కల్గివుండండి: శోచనీయమైన అబద్ధ మత చరిత్ర కొంతమందిని కలతపర్చింది. మరితరులు ఈ విధానాన్ని బట్టి “విసికి చెదరి” ఉన్నారు. (మత్త. 9:36) నిరుద్యోగం, అనారోగ్యం, అభద్రత వంటి వాటిని బట్టి అనేకమంది కృంగిపోయి ఉండవచ్చు. దాన్ని అర్థంచేసుకోవడం, మన పనిలో పట్టుదలతో ఉండేలా మనకు సహాయపడుతుంది. మన సేవా ప్రాంతంలో ఉన్న ప్రజలకు అధిక చింతను కలిగించే విషయాలకు సంబంధించిన సంభాషణలు నెరపేందుకు చొరవతీసుకోడానికి కృషిచేయండి. దేవుని రాజ్యమే ఏకైక పరిష్కారమని గ్రహించేలా వారికి సహాయపడండి. సువార్తతో వారి హృదయాలను చేరుకునేందుకు లేఖనాలనూ, ప్రచురణల్లో ఉన్న నిర్దిష్టమైన విషయాలనూ ఉపయోగించండి.—హెబ్రీ. 4:12.
5 ‘యెహోవాయందు ఆనందించుటవలన మనం బలమొందుదం’ అన్న విషయాన్ని దేవుని వాక్యప్రకారం సంతోషంగా ప్రవర్తించేవారు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. (నెహె. 8:10) మన ఆనందాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. “ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.” (మత్త. 10:13) యెహోవా పవిత్ర సేవలో మనం సహనంతో కొనసాగుతుండగా ఆయన మన ఆనందాన్నీ శక్తినీ పునరుద్ధరిస్తాడు, మన విశ్వసనీయతను ఆశీర్వదిస్తాడు.