కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/01 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఉపశీర్షికలు
  • జనవరి 8తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 15తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 22తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 29తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 5తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2001
km 1/01 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జనవరి 8తో ప్రారంభమయ్యే వారం

పాట 18 (162)

7 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

18 నిమి: “మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.”a కావలికోట జూన్‌ 1, 1997, 15వ పేజీలో, 12-13 పేరాల నుంచి తీసుకోబడిన వ్యాఖ్యానాలను చేర్చండి. సాక్ష్యమివ్వడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అందరినీ ప్రోత్సహించండి.

20 నిమి: మన ఆరోగ్య సంరక్షణ కోసం ప్రేమపూర్వకమైన ఏర్పాట్లు. అర్హుడైన ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. అవాంఛిత రక్తమార్పిడుల నుంచి మనల్ని మనం కాపాడుకోడానికి ఉన్న శ్రేష్ఠమైన మార్గం అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డును నింపడమేనని నొక్కిచెప్పండి. ఈ కూటం తర్వాత, బాప్తిస్మం తీసుకున్న సాక్షులు అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డును పొందవచ్చుగానీ వాటిని ఈ రాత్రికే పూరించకూడదు. పంచిపెట్టడానికి కావల్సినన్ని కార్డులు సంఘంలో ఉండాలి. తర్వాతి వారంలో జరిగే పుస్తక పఠనానంతరం కార్డులపై సంతకం చేయడం, సాక్షులు సంతకం పెట్టడం, తారీఖు వేయడం వంటివి జరగాలని, అవసరమైనట్లైతే పుస్తక పఠన నిర్వాహకుడు సహాయం చేస్తాడని దయచేసి సూచించండి. సాక్షులుగా సంతకం చేసేవారు, కార్డు హోల్డరు దానిపై సంతకం చేయడాన్ని వాస్తవంగా చూడాలి. పుస్తక పఠన నిర్వాహకులు తమ తమ గుంపులకు నియమించబడిన వారందరికీ అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డును నింపడంలో అవసరమైన సహాయం అందేలా చూడాలి. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఐడెంటిటీ కార్డులను ఈ కూటం అయిన వెంటనే పొందవచ్చు. బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు, ఈ కార్డులోని పరిభాషను ఉపయోగించుకుని, తమ పరిస్థితులకూ నమ్మకాలకూ తగినట్లుగా తమ కోసం తమ పిల్లల కోసం తమ స్వంత డైరెక్టివ్‌ను వ్రాసుకోవచ్చు.

పాట 20 (93), ముగింపు ప్రార్థన.

జనవరి 15తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్ట్‌.

20 నిమి: “మన సరళీకృత సాహిత్య పంపిణీ ఏర్పాటు.” అర్హుడైన పెద్ద, ఆర్టికల్‌లో ఉన్న సమాచారాన్ని ప్రేక్షకులతో చర్చిస్తాడు. మంచి అనుభవంగల ప్రచారకుడు బాగా సిద్ధపడిన మూడు క్లుప్తమైన ప్రదర్శనలను ప్రదర్శించాలి. ఈ నెల ప్రతిపాదిత సాహిత్యాన్ని ఉపయోగిస్తూ మొదటి ప్రదర్శన, మన రాజ్య పరిచర్య డిసెంబరు 1999, 3వ పేజీలో 4వ పేరానందున్న సూచనల ఆధారంగా చేయాలి. ప్రచారకుడు పునర్దర్శనం కోసం ఏర్పాట్లను చేసికొని, గృహస్థుడు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాన్ని తీసుకోవడానికి ఎన్వెలప్‌ను ఉపయోగిస్తాడు. రెండవ ప్రదర్శనలో, గృహస్థుడు మాట్లాడడానికి సుముఖత చూపించినా రాజ్య సందేశమందు నిజంగా ఆసక్తి చూపించనందున ప్రచారకుడు అతనికి ప్రచురణను అందించకపోవడాన్ని ఉదహరించండి. మూడో ప్రదర్శనలో నిజమైన ఆసక్తిని చూపించినా, బిజీగా ఉన్న ఒక వ్యక్తికి ఒక కరపత్రాన్ని ఎలా అందించవచ్చో చూపించండి. పునర్దర్శించడానికి ప్రచారకుడు ఏర్పాట్లు చేసుకుంటాడు.

15 నిమి: మీరు లేఖనాలను అనుదినం పరిశీలిస్తున్నారా? ప్రసంగం, ఇంటర్వ్యూలు. కుటుంబ సమేతంగా దినవచనాన్ని చర్చించడంలో ఉన్న జ్ఞానాన్ని ఉన్నతపరుస్తూ, కావలికోట డిసెంబరు 15, 1996 సంచికలో 17-18 పేజీలలో ఉన్న 12-14 పేరాలను పరిశీలించండి. కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేయండి. వారిలో ప్రతీ ఒక్కరూ ప్రయోజనకరమైనదని రుజువైనటువంటి ఇటీవల జరిగిన దినవచన చర్చను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. అది ఎందుకు ప్రయోజనకరమైనదో తెలియజేస్తారు. మన కుటుంబాలను బలపర్చేందుకూ, పరిచర్యలో కుటుంబాన్ని చురుకుగా ఉంచేందుకూ రూపొందించబడిన క్రమమైన కుటుంబ అధ్యయన కార్యక్రమంలో అది ఒక భాగమై ఉండాలని నొక్కి చెప్పండి.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

జనవరి 22తో ప్రారంభమయ్యే వారం

పాట 12 (113)

7 నిమి: స్థానిక ప్రకటనలు.

18 నిమి: ఉపోద్ఘాతాలను సిద్ధపడడం ఎలా? ప్రసంగం, ప్రదర్శనలు. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 2వ పేజీనందు ఉన్న కీలక విషయాలను పునఃసమీక్షించండి. మన పద్ధతికీ, వ్యక్తిత్వానికీ, సేవా ప్రాంతానికీ చక్కగా సరిపోయే ఉపోద్ఘాతాలను మనం ఎలా ఎంపికచేసుకోవచ్చో చూపించండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరుతో ఉపయోగించగల్గే కొన్ని నమూనా ఉపోద్ఘాతాలను సమీక్షించండి. వాటిలో ఒకటి రెండు ఉపోద్ఘాతాలను ప్రదర్శించండి. (మన రాజ్య పరిచర్య ఏప్రిల్‌ 1997 సంచిక, 8వ పేజీ చూడండి.) బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలోనూ, మన రాజ్య పరిచర్యలోనూ ఇవ్వబడిన సలహాలను క్షేత్ర సేవ కార్యకలాపంలో చక్కగా ఉపయోగించుకోమని అందరినీ ప్రోత్సహించండి.

20 నిమి: “చక్కగా వినేవారై ఉండండి.”b ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం), 27-8 పేజీలలో 15-17 పేరాలలో ఉన్న విషయాలను పునఃసమీక్షించండి. మన వినే అలవాట్లను గురించిన ఒక చక్కని పరీక్ష ఏమిటంటే, విన్నవాటిలో మనం ఎన్నింటిని గుర్తించుకోగలమన్నదే. ఈ నాటి దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రసంగించినవారు తెలియజేసిన వాటిలో కొన్ని విశిష్ఠమైన అంశాలను జ్ఞప్తికి తెచ్చుకోమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

జనవరి 29తో ప్రారంభమయ్యే వారం

పాట 16 (143)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి కొరకైన క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వాలని ప్రచారకులకు గుర్తుచేయండి. ఫిబ్రవరి కొరకైన సాహిత్య అందింపును ప్రస్తావించి, సంఘమందు స్టాకులో ఉన్న పుస్తకాల గురించి తెలియజేయండి.

15 నిమి: సృష్టికర్తను మరింత బాగా తెలుసుకోండి. కావలికోట జూన్‌ 15, 1999, 24-6 పేజీల ఆధారంగా, మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) పుస్తకాన్ని సంఘంలో పఠించడం కోసం ఆతురతను పెంపొందింపజేయండి. పుస్తక పఠనంలో జరిగే చర్చల్లో భాగంవహించమని యువతను ప్రోత్సహించండి. మన మహాగొప్ప సృష్టికర్తను గురించి సాధ్యమైనంత ఎక్కువగా నేర్చుకోవాలనే ఆతురతతో అందరూ క్రమంగా హాజరవ్వాలని కోరుకుంటారు. సంఘాలు సృష్టికర్త (ఆంగ్లం) పుస్తకాన్ని పఠించనట్లైతే, నియమిత ఐదు బ్రోషూర్ల పఠనం కోసం ఈ సమాచారాన్ని తగిన విధంగా మలచండి.

20 నిమి: “తల్లిదండ్రులారా—మీ పిల్లల్లో ఉపయోగకరమైన అలవాట్లను నాటండి.”c ప్రసంగం, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధిస్తున్న పిల్లలు గల తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయండి. తమ పిల్లలు క్షేత్ర సేవలో భాగంవహించేలా తాము చేసిన అనుకూలమైన విషయాల గురించి ఆ తల్లిదండ్రులు తెలియజేస్తారు. సమయం అనుకూలిస్తే, కుటుంబ సంతోషం పుస్తకము 55-9 పేజీల్లో ఉన్న సలహాలను చేర్చండి.

పాట 9 (37), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 5తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: “సంతోషకరంగా ప్రవర్తించేవారిగా ఉండండి.”d అంతర్దృష్టి (ఆంగ్లం) పుస్తకం, సంపుటి 2, 120వ పేజీ 6-8 పేరాల్లో ఉన్నట్టుగా, దేవుని సేవలో మన ఆనందాన్ని ఏది అధికం చేస్తుందో చూపించండి.

20 నిమి: క్షేమాభివృద్ధికరమైన వినోదాన్ని మీరు కనుగొనగలరు. తేజరిల్లు ! జూన్‌ 8, 1997 సంచికలో ఇవ్వబడిన సలహాను కుటుంబం చర్చిస్తుంది. కుటుంబపు వినోద వ్యవహారాలపై తండ్రి శ్రద్ధవహిస్తాడు. “వినోదానికి ఏం సంభవించింది?” (4-7 పేజీలు) అన్న దాని క్రింద ఉన్న సమాచారాన్ని క్లుప్తంగా పునఃసమీక్షించిన తర్వాత, వాళ్లు క్షేమాభివృద్ధికరంగానూ, ప్రయోజనకరంగానూ ఉండే వివిధ రకాల వినోదంపై దృష్టి సారిస్తారు. మన పరిచర్య పుస్తకంలో 131-2 పేజీలలో “వినోదం” అనే ఉపశీర్షిక క్రిందా, 135-6 పేజీల్లో “సమస్తమును దేవుని మహిమ కొరకుచేయుడి” అనే ఉపశీర్షిక క్రిందా ఉన్న సమాచారాన్ని పరిశీలించండి. నడిపింపు ఇవ్వడంలో తల్లిదండ్రుల పాత్రనూ, యావత్‌ కుటుంబ ప్రయోజనం కోసం కుటుంబ సభ్యులు సహకరించాల్సిన అవసరాన్నీ నొక్కి చెప్పండి.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి