ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరు: రాజ్య వార్త నెం. 36 పంపిణీ. ప్రతీ ఇంటికి రాజ్య వార్త నెం. 36ను అందించడం ద్వారా తమ ప్రాంతాన్ని పూర్తిచేసిన సంఘాలు దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ను గానీ లేక జ్ఞానము పుస్తకాన్ని గానీ ప్రతిపాదించవచ్చు. ఒకవేళ ఈ పుస్తకాలు గృహస్థుల దగ్గర ఉంటే నిరంతరము జీవించగలరు పుస్తకం గానీ, సృష్టి (ఆంగ్లం) పుస్తకం గానీ ప్రతిపాదించవచ్చు. డిసెంబరు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. జనవరి: బ్రోషూర్లు: ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు, యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు. అలాగే, 192 పేజీల పాత పుస్తకాలనైనా సరే అందివ్వవచ్చు. ఫిబ్రవరి: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం), ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకాలు లేక సంఘపు స్టాకులో ఉన్న 192 పేజీల పుస్తకానైనా సరే అందివ్వవచ్చు.
◼ రాజ్య వార్త నెం. 36 అనేక భాషల్లో లభ్యమౌతుంది. అదనపు సప్లై కావాలనుకుంటున్న సంఘాలు తమ రిక్వెస్టులను తక్షణమే పంపించాలి. రాజ్య వార్త ప్రచార పని ముగిసిన తర్వాత కూడా రాజ్య వార్త నెం. 36 ప్రతులు ఇంకా ఉన్న సంఘాలు, వాటిని ఇంత వరకు పంచిపెట్టిన రీతిలోనే—ఇంటింట గానీ, మరెక్కడైనా కానీ ఇప్పుడు కూడా పంచిపెట్టాలని ప్రచారకులను ప్రోత్సహించవచ్చు. సముచితమైతే, గృహస్థులను కలవని ఒక్కో ఇంట్లో ఒక్కో కరపత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళవచ్చు. అయితే ఆ దారిన వెళ్ళేవారికి కనబడని విధంగా దాన్ని ఉంచాలి. ముఖ్యమైన సమాచారాన్ని తెలిపే ఈ కరపత్రం యొక్క ప్రతులనన్నింటినీ పంచిపెట్టేందుకు ప్రయత్నాలు జరగాలి.
◼ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వేరొకరు సంఘ లెక్కలను డిసెంబరు 1న లేక ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా ఆడిట్ చేయాలి. అలా చేసిన తర్వాతి వారం అక్కౌంట్ రిపోర్టు చదివాక ఆడిట్ జరిగినట్లు సంఘానికి ప్రకటించండి.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది?—ఉర్దూ
◼ లభ్యమయ్యే క్రొత్త వీడియో క్యాసెట్లు:
యంగ్ పీపుల్ ఆస్క్—హౌ కెన్ ఐ మేక్ రియల్ ఫ్రెండ్స్?—ఇంగ్లీషు
◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:
కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట—కన్నడ, తమిళం & తెలుగు.
◼ లభ్యమయ్యే ఆడియో క్యాసెట్లు:
మ్యూజిక్-ఆర్కెస్ట్రా: కింగ్‌డమ్ మెలొడీస్, 1 నుంచి 8 వరకూ (ఎనిమిది ఆడియోక్యాసెట్లు)
(ఈ ఆడియో క్యాసెట్లకు ఆల్బమ్‌లు లేవు)