కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/00 పేజీ 3
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిష్క్రియులుగా ఉన్నవారిని మరచిపోవద్దు
    మన రాజ్య పరిచర్య—2007
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—1998
  • “నా దగ్గరికి తిరిగిరండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • వీలైనంత త్వరగా తిరిగివచ్చేందుకు వారికి సహాయం చేయండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 11/00 పేజీ 3

ప్రశ్నా భాగం

◼ చాలా కాలంగా నిష్క్రియుడిగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి సువార్త ప్రచారకుడిగా యోగ్యుడు కావడానికి సహాయాన్ని ఎలా పొందగలడు?

నిష్క్రియుడిగా ఉన్న ఒక వ్యక్తి యెహోవాను సేవించడం తన హృదయపూర్వక కోరిక అని నిరూపించుకున్నప్పుడు, అది సంతోషించదగిన విషయం. (లూకా 15:4-6) బహుశా ఆ వ్యక్తి, వ్యక్తిగత పఠనం చేయడానికీ, కూటాలకు హాజరుకావడానికీ, క్షేత్రపరిచర్యలో భాగం వహించడానికీ వీలు లేకుండా చేసేందుకు వ్యతిరేకతలను లేక జీవితంలోని అనేక ఒత్తిళ్ళను తానే అనుమతించివుండవచ్చు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావల్సిన వ్యక్తిగత సహాయాన్ని ఎలా అందించవచ్చు?

ఆయన పట్ల మనకున్న స్వచ్ఛమైన క్రైస్తవ ప్రేమ ఎంతమాత్రమూ చెక్కు చెదరలేదన్న నమ్మకాన్ని కలిగించడానికి మనమందరం చొరవ తీసుకోవాలి. పెద్దలు, అతని ఆధ్యాత్మిక అవసరాల విషయంలో కావల్సిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. (యాకో. 5:14, 15) ఆ నిష్క్రియ స్థితి కొద్దికాలమే ఉన్నట్లయితే క్షేత్ర సేవలో తిరిగి పాల్గొనేందుకు ఆ వ్యక్తికి కావల్సిందల్లా ఒక అనుభవజ్ఞుడైన ప్రచారకుని సహాయం మాత్రమే కావచ్చు. అయితే ఆ స్థితిలో ఉన్న వ్యక్తి చాలా కాలంగా సంఘానికి దూరంగా ఉంటే, బహుశా ఎక్కువ సహాయం అవసరం కావచ్చు. విశ్వాసాన్ని, మెప్పును పెంపొందించుకోవడానికి ఆయన తగిన ప్రచురణ నుండి వ్యక్తిగత బైబిలు పఠనం చేయడం జ్ఞానయుక్తమైనది. అలాంటి పరిస్థితుల్లో సేవా పైవిచారణకర్త, యోగ్యుడైన ఒక ప్రచారకుడు ఆయనతో పఠనం నిర్వహించేందుకు ఒక ఏర్పాటు చేస్తాడు. (హెబ్రీ. 5:12-14; నవంబరు 1998 మన రాజ్య పరిచర్య ప్రశ్నా భాగం చూడండి.) అలాంటి సహాయం అవసరమున్న వారెవరైనా మీకు తెలిస్తే మీ సంఘంలోని సేవా పైవిచారణకర్తతో మాట్లాడండి.

చాలా కాలం నిష్క్రియ స్థితిలో ఉన్న వ్యక్తిని పరిచర్యకు ఆహ్వానించడానికి ముందు, రాజ్య ప్రచారకుడిగా ఆయన యోగ్యుడా కాదా అని తెలుసుకునేందుకు ఇద్దరు పెద్దలు అతనిని కలవడం జ్ఞానయుక్తమైనది. క్రొత్తగా ప్రచారకులు కావడానికి ఇష్టపడేవారి విషయంలో ఉపయోగించే పద్ధతినే వీరి విషయంలో కూడా అవలంబించాలి. (కావలికోట [ఆంగ్లం], నవంబరు 15, 1988, 17వ పేజీ చూడండి.) నిష్క్రియ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి సువార్తను ఇతరులతో పంచుకోవడానికి హృదయపూర్వకమైన కోరికను కలిగివుండాలి. ఆ వ్యక్తి మన పరిచర్య పుస్తకంలోని 98-9 పేజీల్లో ఇవ్వబడిన ప్రాథమిక అవసరాలకు తగినట్లుగా కూడా ఉండాలి, వాటితోపాటు సంఘ కూటాలకు క్రమంగా హాజరవుతుండాలి.

తిరిగి వచ్చిన వ్యక్తి యెహోవాతో తనకున్న ప్రశస్తమైన సంబంధాన్ని బలపరచుకొని కొనసాగించడానికీ నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో నడుస్తూ ఉండడానికీ మంచి ఆధ్యాత్మిక దైనందిన కార్యక్రమం ఆయనకు ఎంతో సహాయం చేస్తుంది. (మత్త. 7:13, 14; హెబ్రీ. 10:23-25) ఆయన “పూర్ణ హృదయంతో” చేసే “కృషి,” తనలో దీర్ఘకాలం ఉండేలా పెంపొందించుకునే క్రైస్తవ లక్షణాలు ఆయనను మళ్ళీ “నిష్క్రియుడు లేదా నిష్ఫలుడు”గా అయిన క్రైస్తవ శిష్యునిగా తయారుకాకుండా నివారిస్తాయి.​—2 పేతు. 1:5-8, NW.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి