కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/98 పేజీ 7
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిష్క్రియులుగా ఉన్నవారిని మరచిపోవద్దు
    మన రాజ్య పరిచర్య—2007
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—2000
  • “నా దగ్గరికి తిరిగిరండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • వీలైనంత త్వరగా తిరిగివచ్చేందుకు వారికి సహాయం చేయండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 11/98 పేజీ 7

ప్రశ్నా భాగం

◼ సంఘ సేవా కమిటీ సభ్యుల్లో ఒకరి నిర్దేశం ప్రకారం ఒక ఇనాక్టివ్‌ బ్రదర్‌తో గానీ సిస్టర్‌తో గాని గృహ బైబిలు పఠనం నిర్వహించడం ఇప్పుడు కూడా యుక్తమేనా?

ఇనాక్టివ్‌ అయిన సభ్యులతో సహా సంఘాన్నంతటినీ కాపరులుగా కాసే బాధ్యత పెద్దలకు ఉంది. వారు ఆ ఇనాక్టివ్‌ సభ్యులను సందర్శించి వారికి వ్యక్తిగతంగా ఏమైనా సహాయం అవసరమేమో చూస్తారు. సముచితమైతే వారి కోసం ఒక వ్యక్తిగత బైబిలు పఠనాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము పుస్తకంలోని 103, 104 పేజీల్లో, అటువంటి ఏర్పాటును ఎవరికి చేయవచ్చన్నది సంఘ సేవా కమిటీ నిర్ణయిస్తుందని ఉంది.

ఇటువంటి సహాయాన్ని చక్కని రీతిలో ఎవరు అందించగలరు, ఏ విషయాలు స్టడీ చేయాలి, ఏ పుస్తకం స్టడీ చేయడం ఉత్తమం అన్నవి సేవా పైవిచారణకర్త నిర్ధారిస్తాడు. బహుశ ఆ ఇనాక్టివ్‌ వ్యక్తితో తొలుత ఎవరు స్టడీ చేశారో వారు, లేదా ఆ వ్యక్తికి తెలిసివుండి తాను బాగా గౌరవిస్తున్న వారు సహాయాన్ని అందించగల స్థానంలో ఉంటారు. ఒక ఇనాక్టివ్‌ సిస్టర్‌కి సహాయం చేయమని ఒక సమర్థురాలైన పరిణతిగల సిస్టర్‌ను అడుగవచ్చు. నిర్వహించడానికి నియమించబడిన వ్యక్తితోపాటు మరో ప్రచారకుడు/రాలు వెళ్లడం అంతగా అవసరం ఉండకపోవచ్చు. అటువంటి స్టడీ నిర్వహిస్తున్న ప్రచారకుడు/రాలు సమయాన్నీ, పునర్దర్శనాల్నీ, స్టడీనీ తన ఫీల్డ్‌ సర్వీస్‌ రిపోర్టులో వేసుకోవచ్చు.—నవంబరు 1987 మన రాజ్య పరిచర్య (ఆంగ్లం), పేజీలు 1-2 చూడండి.

విద్యార్థి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తే కాబట్టి సాధారణంగా స్టడీని దీర్ఘకాలం పొడిగించనవసరం లేదు. లక్ష్యం ఏమిటంటే—ఇనాక్టివ్‌ వ్యక్తి సంఘంలోని కూటాలన్నింటికీ మళ్లీ హాజరయ్యేందుకు, సువార్తను మళ్లీ క్రమంగా ప్రకటించే ప్రచారకునిగా అయ్యేందుకు సహాయం చేయడమే. అటువంటి స్టడీలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో సేవా పైవిచారణకర్త పర్యవేక్షిస్తాడు. ఈ ప్రేమపూర్వకమైన ఏర్పాటు ఫలితంగా, ఈ సహోదర సహోదరీలు యెహోవా ఎదుట తమ స్వంత బాధ్యతను భరిస్తూ సత్యములో “వేరుపారి స్థిరపడి”నవారు అవ్వగల్గాలి.—ఎఫె. 3:15, 17; గలతీ. 6:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి