ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు అక్టోబరు: కావలికోట, తేజరిల్లు!ల విడిప్రతులనూ, పునర్దర్శనాలు చేసేటప్పుడు ఆసక్తిని కనబరచిన చోట చందాలనూ ప్రతిపాదించవచ్చు. నవంబరు: ఈ నెల ఆరంభం నుండి రాజ్య వార్త నెం. 36 పంపిణీ. ప్రతీ ఇంటికి రాజ్య వార్త నెం. 36ను అందించడం ద్వారా తమ ప్రాంతాన్ని పూర్తిచేసిన సంఘాలు దేవుడు కోరుతున్నాడు అన్న బ్రోషూర్‌ను గానీ లేక జ్ఞానము పుస్తకాన్ని గానీ ప్రతిపాదించవచ్చు. ఒకవేళ ఈ పుస్తకాలు గృహస్థుల దగ్గర ఉంటే నిరంతర జీవితము పుస్తకం గానీ, సృష్టి (ఆంగ్లం) పుస్తకం గానీ ప్రతిపాదించవచ్చు. డిసెంబరు: నూతన లోక అనువాదముతో పాటు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. జనవరి: బ్రోషూర్లు: ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు, యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు. 192 పేజీల పాత పుస్తకాలనైనా సరే అందివ్వవచ్చు.
◼ ఈ సంచికలోని మధ్యపేజీల్లో, “2001వ సంవత్సరం కోసమైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” ఉంది, దీన్ని రెఫరెన్సు కోసం 2001వ సంవత్సరమంతా ఉంచుకోవాలి.
◼ జనవరి 1 నుంచి సంఘ కూటాల సమయాల్లో మార్పు ఉన్నట్లయితే, సంఘ కూటాల వివరాలతో హ్యాండ్ బిల్ రిక్వెస్ట్ ఫారమ్ (S-5) ను సంస్థకు పంపుతూ మార్పు గురించి సంఘ సెక్రటరీ సంస్థకు తెలియజేయాలి. అవసరమైతే, అదే ఫారమ్‌లో క్రొత్త హ్యాండ్ బిల్లుల కోసం ఆర్డరు పెట్టవచ్చు. మీకు హ్యాండ్ బిల్లులు చేరవలసిన గడువుకి కనీసం ఎనిమిది వారాల ముందే మీరు వాటి కోసం రిక్వెస్ట్ చేయాలి.