ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరు: జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! విడిప్రతులనూ, పునర్దర్శనాలు చేసేటప్పుడు ఆసక్తిని కనబరచిన చోట చందాలనూ ప్రతిపాదించవచ్చు. నవంబరు: ఈ నెల ఆరంభంనుండి రాజ్య వార్త నెం. 36 పంపిణీ. ప్రతీ ఇంటికి రాజ్య వార్త నెం. 36ను అందించడం ద్వారా తమ ప్రాంతాన్ని పూర్తిచేసిన సంఘాలు దేవుడు కోరుతున్నాడు అన్న బ్రోషూర్‌ను గానీ లేక జ్ఞానము పుస్తకాన్ని గానీ ప్రతిపాదించవచ్చు. ఒకవేళ ఈ పుస్తకాలు ప్రజల దగ్గర ఉంటే నిరంతర జీవితము పుస్తకం గానీ, సృష్టి (ఆంగ్లం) పుస్తకం గానీ ప్రతిపాదించవచ్చు. డిసెంబరు: నూతన లోక అనువాదముతోపాటు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము.
◼ బహిష్కరించబడిన లేదా సహవాసాన్ని మానుకొన్న వాళ్లలో ఎవరైనా సరే, తిరిగి రావడానికి ఇష్టపడుతున్నట్లయితే అలాంటి వారి విషయమై, ఫిబ్రవరి 1, 1992 కావలికోట 16-19 పేజీల్లో ఇవ్వబడిన నిర్దేశాలను అనుసరించమని పెద్దలకు గుర్తు చేయబడుతుంది.
◼ ఒక సంఘంతో సహవసించే వారు కావలికోట, తేజరిల్లు! పత్రికలకు తమ వ్యక్తిగత చందాలతో సహా క్రొత్త చందాలనూ, నవీకరించబడిన చందాలనూ సంఘం ద్వారానే పంపించాలి.
◼ సాహిత్యాల్ని పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసే అభ్యర్థనలను సంస్థ అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి అభ్యర్థనలను సంస్థకు పంపించే ముందు ప్రతి నెలా దాని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావల్సిన సాహిత్యాల్ని తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్య అభ్యర్థన చూసుకుంటున్న సహోదరునికి తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి ప్రత్యేక అభ్యర్థనకు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.
◼ సంఘ పైవిచారణకర్త గానీ లేక ఆయన నియమించిన మరొకరు గానీ సెప్టెంబరు 1న లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘపు లెక్కల్ని తనిఖీ చేయాలి. ఇలా తనిఖీ చేసిన మరుసటి వారం, జమాఖర్చుల నివేదిక చదివిన తర్వాత ఆడిట్ అయిన విషయాన్ని సంఘానికి ప్రకటించాలి.
◼ ఈ సంవత్సరం లోనావ్లాలో జరగాల్సిన “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” ఇంగ్లీషు సమావేశం లోనావ్లాలో కాక ముంబయిలో జరుగుతుంది. సమావేశపు క్రొత్త తేదీలు నవంబరు 3-5, 2000.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
వాచ్ టవర్ పబ్లికేషన్ ఇండెక్స్ 1999 - ఆంగ్లం
◼ అందుబాటులో ఉన్న క్రొత్త కాంపాక్ట్ డిస్క్‌లు:
సింగ్ ప్రైజెస్ టు జెహోవా—ఆన్ కాంపాక్ట్ డిస్క్ (ఎనిమిది డిస్క్‌ల సెట్)
◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:
పే అటెన్షన్ టు డేనియేల్స్ ప్రోఫెసీ!—పంజాబీ
దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?—సింధీ
భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!—తమిళం, మలయాళం