కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/00 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—2000
మన రాజ్య పరిచర్య—2000
km 8/00 పేజీలు 5-6

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

2000 మే 1 నుంచి ఆగస్టు 21 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించాలి. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. ఎఫ్రాయిమీయులు అన్యాయంగా చేసిన మౌఖిక దాడికి గిద్యోను ఇచ్చిన సమాధానం, అణకువను వినయాన్ని ప్రతిబింబించి, నిజాయితీలేని వారి విమర్శను భంగపరచి, సమాధానాన్ని కాపాడింది. (న్యాయా. 8:1-3) [వారంలో చదవవలసిన బైబిలు భాగం]

2. “మనము దేవుని చూచితిమి” అని మానోహ అన్నప్పటికీ నిజానికి ఆయనా, ఆయన భార్యా చూసింది స్వయంగా యెహోవాను కాదు గానీ కంటికి కనపడే రూపం దాల్చిన దేవుని వ్యక్తిగత వాగ్దూతను. (న్యాయా. 13:22) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w88 5/15 23వ పేజీ, 3వ పేరా.]

3. భార్య ఎలాగైతే తన జతచేత సన్మానింపబడుతున్నానని, ప్రియంగా ప్రేమించబడుతున్నానని భావించడం అవసరమో, అలాగే ఒక భర్త తాను తన భార్యచే గౌరవించబడుతున్నానని భావించడం అవసరం. [kl 144 వ పేజీ, 12వ పేరా]

4. మన ప్రార్థనల్లో మనం మన అవసరతలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. [kl 155వ పేజీ, 13వ పేరా]

5. ఏ విషయంలోనైనప్పటికీ ఎలాంటి నడిపింపునూ ఇవ్వకుండా యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని విడిచిపెట్టేసిన కాలాన్ని న్యాయాధిపతులు 21:25 సూచిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 6/15 22వ పేజీ, 16వ పేరా.]

6. నిబంధన మందసం పైనున్న కెరూబుల ప్రతిమలు “కెరూబులమధ్య ఆసీనుడై”యున్నట్లు చెప్పబడుతున్న యెహోవా రాజరిక సాన్నిధ్యాన్ని సూచించేవి. (1 సమూ. 4:4) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w80 11/1 29వ పేజీ, 2వ పేరా.]

7. తప్పనిసరి పరిస్థితిలో సౌలు సైనికులు రక్తాన్ని తిన్నప్పుడు వారు శిక్షించబడలేదు, ఒకరు తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి దైవిక సూత్రాన్ని తాత్కాలికంగా అలక్ష్యం చేయడానికి తగిన కారణాలు ఉండవచ్చని ఇది చూపించింది. (1 సమూ. 14:24-35) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w94 4/15 31వ పేజీ, 7-9 పేరాలు.]

8. కొంతమంది “ఒప్పించడం” అనే పదాన్ని తప్పుదారి పట్టించడంతోనూ, చాతుర్యంతోనూ ముడిపెట్టినప్పటికీ, చక్కని సహేతుకమైన తర్కంతో మనస్సులో మార్పును తీసుకురావడమనే తలంపును అందజేయడానికి కూడా అనుకూలమైన విధంగా దాన్ని ఉపయోగించవచ్చు. (2 తిమో. 3:14, 15, NW) [w98 5/15 21వ పేజీ, 4వ పేరా]

9. “జీవపు మూట” అనేది దావీదు, దేవుని యెదుట తాను రక్తాపరాధి కాకుండ తప్పించుకొంటే ఆయనకు ప్రయోజనం చేకూర్చివుండే, రక్షించి భద్రపరచే దైవిక ఏర్పాటును సూచిస్తుంది. (1 సమూ. 25:29) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w92 5/1 11వ పేజీ, 3వ పేరా.]

10. రెండవ సమూయేలు 7:16 నందు సూచించబడిన దావీదు రాజ్య నిబంధన, మెస్సీయా ఏ వంశంలో నుండి వస్తాడో గుర్తించింది, దావీదు వంశమునందలి ఒకరు వచ్చి ‘శాశ్వతముగా పాలిస్తారు,’ అన్నదానికి చట్టబద్ధమైన హామీనిచ్చింది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w90 2/1 14వ పేజీ, 21వ పేరా నుండి 15వ పేజీ 22వ పేరా వరకూ.]

క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:

11. కీర్తనలు 34:18 ఏ హామీని ఇస్తుంది? [w98 4/1 31వ పేజీ, 2వ పేరా]

12. యోసేపుకు బర్నబా అనే మారు పేరు ఉందన్న వాస్తవం దేన్ని సూచిస్తుంది? (అపొ. 4:36) [w98 4/15 20వ పేజీ, 3వ పేరా అథఃసూచి.]

13. ఏలీ తన కుమారుల్ని యెహోవాకన్నా మిన్నగా గౌరవించాడు అని బైబిలు వృత్తాంతము ఎందుకు చెప్తుంది? (1 సమూ. 2:12, 22-24, 29) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w96 9/15 13వ పేజీ, 14వ పేరా.]

14. మనం ఆయనను ‘అడుగకమునుపే మనకు ఏవి అవసరమో ఆయనకు తెలుసు’ గనుక సహాయం కొరకు దేవున్నెందుకు ప్రార్థించాలి? [kl 151వ పేజీ 4వ పేరా]

15. మొదటి సమూయేలు 1:1-7 ప్రకారం, సమూయేలు కుటుంబం ఎలాంటి విశేషమైన మాదిరి చూపించింది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w98 3/1 16వ పేజీ, 12వ పేరా.]

16. ‘ధనం మోసకరమైనదని’ ఏ విధంగా చెప్పవచ్చు? (మత్తయి 13:22) [w98 5/15 5వ పేజీ, 1వ పేరా]

17. పెద్దవాడైన యోనాతాను యెహోవా అభిషిక్తుడైన దావీదును గుర్తించినట్లు ఎలా చూపించాడు, ఇది నేడు దేన్ని సూచిస్తుంది? (1 సమూ. 18:1, 3, 4) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w89 6/1 24, 26 పేజీలు, 4, 13 పేరాలు.]

18. యోబు “యథార్థవర్తనుడును న్యాయవంతుడు”ను అయినప్పటికీ, దాని భావం ఆయన పరిపూర్ణుడు కాదని యోబు పుస్తకం ఎలా తెలియజేస్తుంది? (యోబు 1:8) [w98 5/1 31వ పేజీ, 1వ పేరా]

19. “తీవ్రంగా పోరాడండి” అన్న మాట ఏమి సూచిస్తుంది? (లూకా 13:24 NW) [w98 6/15 31వ పేజీ, 1, 4 పేరాలు]

20. రెండవ సమూయేలు 12:26-28 నందు వ్రాయబడి ఉన్నట్లుగా, మనం ఇతరులతో కలిసి పనిచేస్తుండగా, ఏ విలువైన పాఠాన్ని హృదయానికి తీసుకోవాలి? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w93 12/1 24వ పేజీ, 19వ పేరా.]

క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:

21. యథార్థత వివాహానికి __________ ను __________ ను చేకూరుస్తుంది. [kl 141వ పేజీ, 6వ పేరా]

22. సా.శ. మొదటి శతాబ్దంలో, యెహోవా __________ ను ఏర్పాటు చేశాడు. సంఘాలు స్థాపించబడ్డాయి, అపొస్తలులు మరియు పెద్దలచే రూపొందించబడిన __________ నడిపింపు క్రింద అవి పనిచేశాయి. (అపొ. 15:22-31) [kl 160వ పేజీ 3 పేరా]

23. దైవిక నామమైన యెహోవా అంటే __________ అని అర్థం, యెహోవా తన __________ నెరవేర్చుకోవడానికి తాను ఏ పాత్ర వహించవలసిన అవసరం ఉంటే ఆ పాత్ర వహించగలడని అది సూచిస్తుంది. [w98 5/1 5వ పేజీ 3వ పేరా]

24. సంఘమునకివ్వబడిన ప్రాంతంలోని అన్ని రకాలైన ప్రజలకు సువార్తను ప్రకటించడం __________ కనుగొనడానికి ఒక మార్గం మరియు మీకు __________ ఉందని నిరూపించే మంచి పనులలో ఒకటి. [kl 175వ పేజీ, 9వ పేరా]

25. మంచి పొరుగువాడైన సమరయుని గూర్చి యేసు చెప్పిన ఉపమానం నిజంగా నీతిమంతుడైన వ్యక్తి దేవుని __________ విధేయుడవ్వడమే కాక ఆయన __________ కూడా అనుకరిస్తాడని చూపిస్తుంది. (లూకా 10:29-37) [w98 7/1 31వ పేజీ, 2వ పేరా]

క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

26. ప్రార్థన అనేది (అర్థరహితమైన ఆచారం, ఏదైనా పొందడానికి మార్గం, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండడానికి ఒక మార్గం.) [kl 151వ పేజీ, 3వ పేరా]

27. (సమూయేలు; దావీదు; సౌలు) రాజుగా అభిషేకించబడినప్పుడు, ఇశ్రాయేలీయులను న్యాయాధిపతులు పరిపాలించిన కాలం ముగిసింది, తర్వాత కొంతకాలానికి యెహోవా సహాయంతో వారు (అమ్మోనీయులపై; మోయాబీయులపై; ఫిలిష్తీయులపై) విజయం సాధించారు. (1 సమూ. 11:6, 11) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 12/15 9వ పేజీ, 2వ పేరా నుండి 10వ పేజీ, 1వ పేరా వరకు.]

28. తిమోతి చక్కని మిషనరీగా పైవిచారణ కర్తగా తయారయ్యేలా “పరిశుద్ధ లేఖనముల”లో ఆయనకు ఉపదేశాన్నివ్వడంలో ప్రముఖ స్థానం వహించింది (అపొస్తలుడైన పౌలు; ఆయన తండ్రి; ఆయన తల్లి, అమ్మమ్మ) (2 తిమో. 3:14, 15; ఫిలి. 2:19-22) [w98 5/15 8వ పేజీ, 3వ పేరా నుండి 9వ పేజీ, 5వ పేరా వరకు]

29. బాప్తిస్మమన్నది (మీ ఆత్మీయాభివృద్ధికి ముగింపు; యెహోవాసాక్షులలో ఒకరిగా దేవునికి జీవితాంతం చేసే సేవ యొక్క ప్రారంభం; రక్షణకు హామీ.) [kl 178వ పేజీ, 17వ పేరా

30. యెహోవా దేవున్ని ప్రేమించేవారికి (నిత్యత్వం; వెయ్యేండ్లు; 70 లేక 80 ఏండ్ల జీవితకాలం) ఇవ్వబడుతుంది, వారు పరదైసు భూమిపై నివసిస్తారు. [kl 190వ పేజీ, 22వ పేరా]

క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:

న్యాయా. 11:30, 31; 1 సమూ. 15:22; 30:24, 25; 2 రాజు. 6:15-17; యాకో. 5:11

31. తన చిత్తప్రకారం తన ప్రజలను కాపాడటానికి తన పరలోక సైన్యాన్ని ఉపయోగిస్తానని యెహోవా హామీనిస్తున్నాడు. [w98 4/15 29వ పేజీ, 5వ పేరా]

32. సంఘ పైవిచారణకర్తలు, తమ ఒప్పందాల ప్రకారం కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఉంది, అది కొన్నిసార్లు బాధాకరమైనదీ, ఎంతో మూల్యం చెల్లించవలసివచ్చేదీ అయినప్పటికీ వారలా చేయాలి. [w99 9/15 10వ పేజీ, 3-4 పేరాలు]

33. శ్రమల సమయంలో మన యథార్థతను కాపాడుకోవడం యెహోవా దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందడానికి నడిపిస్తుంది. [w98 5/1 31వ పేజీ, 4వ పేరా]

34. దేవుని పట్ల నిజమైన ప్రేమ కలిగివుండాలంటే ఆయనకు కేవలం బలులు అర్పించడం కాదుగానీ దైవిక నిర్దేశాలకు విధేయత చూపించడం అవసరం. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w96 6/15 5వ పేజీ, 1వ పేరా.]

35. నేడు తన సంస్థలో మద్దతునిచ్చే పాత్రలను నిర్వహిస్తున్న వారి పట్ల యెహోవా ప్రగాఢమైన మెప్పును చూపిస్తాడు. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w86 9/1 28వ పేజీ, 4వ పేరా.]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి