ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమైనచోట్ల సర్వమానవాళి కొరకైన గ్రంథము, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), అనే బ్రోషూర్లను ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరు: జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం). అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! విడిప్రతులనూ, పునర్దర్శనాలలో ఆసక్తిని కనబరచిన చోట చందాలను ప్రతిపాదించవచ్చు. నవంబరు: “నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?” అనే పేరుగల రాజ్య వార్త నెం. 36 పంపిణీ. ప్రతీ ఇంటికి రాజ్య వార్త నెం. 36ను అందించడం ద్వారా తమ ప్రాంతాన్ని పూర్తి చేసిన సంఘాలు దేవుడు కోరుతున్నాడు అన్న బ్రోషూర్ గానీ లేక జ్ఞానము పుస్తకం గానీ ప్రతిపాదించవచ్చు. ఒకవేళ ఈ పుస్తకాలు ప్రజల దగ్గర ఉంటే, నిరంతర జీవితము పుస్తకం గానీ, లేక సృష్టి పుస్తకం (ఆంగ్లం) గానీ ప్రతిపాదించవచ్చు.
◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయనచే నియమించబడిన వేరొకరు, సెప్టెంబరు 1న లేక ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘం యొక్క లెక్కలను ఆడిట్ చేయాలి. ఆడిట్ అయిన తర్వాత, ఆడిట్ జరిగినట్లు తర్వాతి అక్కౌంట్స్ రిపోర్ట్‌లో సంఘానికి ప్రకటించండి.
◼ 2001 సేవా సంవత్సరమంతటికీ ఉపయోగపడేలా సరిపడేనన్ని ఫారమ్‌లను ప్రతీ సంఘానికీ పంపడం జరుగుతుంది. దయచేసి ఈ ఫారమ్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి. ఏ ఉద్దేశం కోసమైతే వాటిని తయారుచేశారో కేవలం ఆ ఉద్దేశం కోసమే ఉపయోగించండి.
◼ 2000, ఆగస్టు 31న గానీ, లేదా దానికి కొద్దిగా ముందు గానీ సంఘంలోని సాహిత్యాల, పత్రికల మొత్తం జాబితాను తయారు చేయాలి. లిటరేచర్ కో-ఆర్డినేటర్ ప్రతి నెలలో తీసుకొనే ఇన్వెంటరీ లాంటిదే ఇదీను. మొత్తం లిటరేచర్ జాబితాను లిటరేచర్ ఇన్వెంటరీ ఫారమ్‌లో (s(d)-18) వ్రాసి పెట్టాలి. మొత్తం పత్రికల సంఖ్య, మ్యాగజిన్ సర్వెంట్‌ల దగ్గర ఉంటుంది. కో-ఆర్డినేటింగ్ కాంగ్రిగేషన్ మూడు సాహిత్య ఇన్వెంటరీ ఫారమ్‌లను (s(d)-18) అందుకుంటుంది. ఒరిజినల్ ఫారమ్‌ను సంస్థకు సెప్టెంబర్ 6కన్నా ముందే దయచేసి పంపండి. మీ ఫైల్‌లో పెట్టడానికి రెండవ కాపీని మీ దగ్గర ఉంచుకోండి. మూడవ కాపీని వర్క్ షీట్‌గా ఉపయోగించండి. కో-ఆర్డినేటింగ్ కాంగ్రిగేషన్ సెక్రటరీ ఇన్వెంటరీ పనిని పర్యవేక్షించాలి. సెక్రటరీ, ప్రిసైడింగ్ ఓవర్సీర్‌లు ఫారమ్ మీద సంతకం పెడతారు.
◼ ఆగస్టు 24, 2000 నుండి ఆగస్టు 31, 2000 వరకు లోనావ్లా బేతేలులో స్టాకులో ఉన్న సాహిత్యాలన్నింటినీ సొసైటీ ఇన్వెంటరీ తీసుకుంటుంది. అందువల్ల సాహిత్యాల కోసం సంఘం పెట్టిన ఆర్డరులు తీసుకోబడవు.