కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/00 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 12తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 19తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 26తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2000
km 6/00 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జూన్‌ 12తో ప్రారంభమయ్యే వారం

పాట 26 (212)

8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుంచి ఎంపిక చేసిన ప్రకటనలు.

15 నిమి: ‘మీ ప్రయాస వ్యర్థముకాదు.’ ఉపోద్ఘాతాన్ని నిమిషంలోపుకు పరిమితం చేసి ప్రశ్నా-జవాబుల చర్చను చేయండి. జూన్‌ 15, 1996 కావలికోట 32వ పేజీలో ఇవ్వబడిన అనుభవంపై వ్యాఖ్యానాలను కూడా ఇమడ్చండి.

22 నిమి: దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌తో బైబిలు పఠనాలను ప్రారంభించడం. మన రాజ్య పరిచర్య అక్టోబరు 1999, 8వ పేజీలో ఉన్న శీర్షికను ఉపయోగిస్తూ ప్రసంగం. 6వ పేరాలో సూచించబడిన అందింపును ప్రదర్శించండి. ఒకరు లేక ఇద్దరు ప్రచారకులు, తాము పఠనాన్ని ఎలా పరిచయం చేశారో, వారం వారం పఠనం కొనసాగుతూ ఉండేందుకు ఏమి చేస్తున్నారో చెబుతూ పఠనాలను ప్రారంభించడంలో వాళ్ళు పొందిన విజయాన్ని గూర్చి క్లుప్తంగా వివరించమని అడగండి.

పాట 3 (32) ముగింపు ప్రార్థన.

జూన్‌ 19తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు, మరియు మూడునెలల అక్కౌంట్‌ ఆడిట్‌ను గూర్చిన ప్రకటన. మీ సంఘంలో యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌, యూత్‌ అనే పుస్తకాలు స్టాకులో ఉంటే, రానున్న నెలల్లో పరిచర్యలో వాటిని ప్రయోజనకరమైన విధంగా ఎలా ఉపయోగించాలో ప్రదర్శించి చూపండి.

8 నిమి: ప్రశ్నాభాగము. పెద్ద ఇచ్చే ప్రసంగం.

25 నిమి: ‘ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే నేనెలా . . .?’ సేవా పైవిచారణకర్త నిర్వహించే ప్రశ్నాజవాబుల చర్చ. ప్రతి పేరాను బిగ్గరగా చదివించి, 3, 4, 7 పేరాల్లోని లేఖనాలను చదవండి. 6వ పేరా చర్చిస్తున్నప్పుడు, బాప్తిస్మం తీసుకున్నవారితో వ్యక్తిగత బైబిలు పఠనాలు మళ్ళీ మరోసారి చేయాలా వద్దా అన్నది నిర్ణయించడంలో సేవా పైవిచారణకర్తకున్న పాత్రను గూర్చి వివరించండి.—నవంబరు 1998 మన రాజ్య పరిచర్య ప్రశ్నాభాగాన్ని చూడండి.

పాట 21 (191) ముగింపు ప్రార్థన.

జూన్‌ 26తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్‌ కొరకైన ప్రాంతీయ సేవా రిపోర్ట్‌లను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. జూలై సాహిత్య ప్రతిపాదనలను పునఃసమీక్షించండి. స్థానికంగా అందుబాటులోవున్న పాత బ్రోషూర్‌లను చూపించి, ప్రతి ఒక్క బ్రోషూర్‌ యొక్క సంకల్పమేమిటో క్లుప్తంగా తెల్పండి. వాటిలో ఒక దాన్ని పరిచర్యలో ఎలా అందించాలో చూపించే, బాగా సిద్ధపడిన ఒక ప్రదర్శనను చేయండి.

18 నిమి: సమాధానము ఎలా ఇవ్వాలో తెలుసుకోండి. (కొలొ. 4:6) ప్రసంగము, ప్రేక్షకులతో చర్చ. లేఖనరహితంగా వాదించే వ్యక్తి మీకు తారసపడినప్పుడు మీరు ఏమి చేస్తారు? యుక్తిగా ఎలా సమాధానమివ్వాలి అనే విషయంపై ఆచరణాత్మక సలహాలను ఇస్తూ తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకం తరచూ అలాంటి సందర్భాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు, మరణాన్ని మనం క్రీస్తు విమోచన క్రయధనం ద్వారా జయించబడగల శత్రువుగా దృష్టించినప్పటికీ, దాన్ని ఏదీ నిర్మూలించలేదని ఇంకా ఇతరులు గట్టిగా నమ్ముతారు. తర్కించుట (ఆంగ్లం) పుస్తకంలోని 103-4 పేజీలలోనూ, 321వ పేజీలోనూ ఉన్న “ఇఫ్‌ సమ్‌వన్‌ సేస్‌—” అనే ఫీచర్‌లోగల ప్రతిస్పందనలను చర్చించండి. క్షేత్రపరిచర్యకు ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాన్ని తీసుకొనివెళ్ళాలని ప్రోత్సహించండి.

17 నిమి: “మీరు అక్కడ ఉంటారా?” ప్రసంగం, అనుభవాలు, దీనిని పెద్ద నిర్వహిస్తాడు. బైబిలు కాలాల నుండి నేటి వరకూ దేవుని ప్రజలను బలపరచడంలో పెద్ద పెద్ద సమావేశాలు ప్రముఖ పాత్ర వహించాయి. (ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకం, 254వ పేజీ, 1-3 పేరాలనూ, అంతర్దృష్టి (ఆంగ్లం) పుస్తకం, సంపుటి 1, 821వ పేజీ, 5వ పేరానూ చూడండి.) ఈ సంవత్సర జిల్లా సమావేశానికి మూడురోజులూ హాజరయ్యేలా ఇప్పటినుండే సిద్ధపాట్లను ప్రారంభించమని అందరినీ ప్రోత్సహించండి. అలా హాజరయ్యేందుకు గతంలో చేసిన శ్రద్ధాపూర్వక ప్రయత్నాలకు లభించిన ఆధ్యాత్మిక ప్రతిఫలాన్ని చూపించే అనుభవాలను తెలియజేయమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 6 (45) ముగింపు ప్రార్థన.

జూలై 3తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ను ఉపయోగించి పఠనాలు ప్రారంభించిన ప్రచారకులను వారది ఎలా సాధించారో అడగండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం కుటుంబ జీవితాన్ని బలపరుస్తుంది. తర్కించుట (ఆంగ్లం) పుస్తకం 253-4 పేజీల్లో ఉన్న 8 అంశాల ఆధారంగా ఇద్దరు సహోదరుల మధ్య చర్చ. దేవుని వాక్యంలో ఉన్న సూత్రాలను అర్ధం చేసుకొని వాటిని అన్వయించుకోవడంలోనే కుటుంబ సంతోషానికి గల రహస్యం దాగి ఉందని తెలుసుకోవడానికి బైబిలు విద్యార్థులకు సహాయపడటం యొక్క ప్రాముఖ్యతను వివరించండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌లోని 8వ పాఠాన్ని ఉపయోగించి దాన్నెలా చేయవచ్చో ప్రదర్శించండి. బైబిలు సలహాలకు ప్రతిస్పందించే కుటుంబాల్లో ఒకరిమధ్య ఒకరికి సన్నిహితత్వంతో పాటు, ప్రేమ ఐక్యతల అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబ సంతోషం పుస్తకంలోని 13వ అధ్యాయంలో 1, 21-2 పేరాల్లోని అనుభవాన్ని తెలియజేయండి.

పాట 7 (51) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి