కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/00 పేజీ 1
  • మీరు అక్కడ ఉంటారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు అక్కడ ఉంటారా?
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1993 “దైవిక బోధ” జిల్లా సమావేశము నుండి పూర్తిగా ప్రయోజనం పొందుట
    మన రాజ్య పరిచర్య—1993
  • 2006 “విడుదల సమీపించింది” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం
    మన రాజ్య పరిచర్య—2005
  • “దైవిక జీవిత మార్గము” 1998 యెహోవాసాక్షుల జిల్లాసమావేశాలు
    మన రాజ్య పరిచర్య—1998
  • 1990వ సంవత్సరపు “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు రండి
    మన రాజ్య పరిచర్య—1990
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 6/00 పేజీ 1

మీరు అక్కడ ఉంటారా?

1 “మీరు సమావేశానికి మొదటి రోజున హాజరుకాలేకపోతే మీరు చాలా కోల్పోయినట్లే” అని చాలాకాలం నుండి సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి చెప్పారు. ఆయన ఎందుకలా భావించాడు? ఎందుకంటే, యెహోవా సంస్థ మనకోసం సిద్ధపరచిన సుసంపన్నమైన ఆధ్యాత్మిక విందు మొదటి దినముతోనే ప్రారంభమవుతుంది. (యెష. 25:6) కాబట్టి, మనం ప్రారంభం నుంచీ అక్కడ ఉండటం, “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని” అని చెప్పిన కీర్తనకర్తతో మనం ఏకీభవిస్తున్నామని చూపిస్తుంది.—కీర్త. 122:1.

2 గత సంవత్సరం జరిగిన “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశాలలోని కొన్నింట్లో శనివారం, ఆదివారం హాజరుకన్నా శుక్రవారం హాజరు చాలా తక్కువగా ఉన్నట్లు కనుగొనడం జరిగింది. అంటే మన సహోదరులలో చాలా శాతం మంది ప్రవచన వాక్యాన్ని గురించి ప్రాముఖ్యమైన సమాచారాన్ని అందజేసిన సమావేశ కార్యక్రమ భాగాలను వినలేకపోయారని దానర్థం. ఇంకా వాళ్ళు తోటి విశ్వాసుల ఆహ్లాదకర సహవాసాన్ని కూడా కోల్పోయారు.

3 హాజరవడానికి మీ లౌకిక పని ఆటంకం కలిగించకుండా చూసుకోండి: కొంతమంది శుక్రవారం సమావేశానికి హాజరుకాలేకపోవడానికి కారణం తమ ఉద్యోగానికి ముప్పు వాటిల్లుతుందేమోనన్న చింత కావచ్చు. అయితే, సెలవు గురించి ముందుగానే అడిగితే తమ యజమానులు సహకరించేందుకు ఇష్టపడుతున్నట్లు చాలామంది సాక్షులు కనుగొన్నారు. సంఘకూటాలన్నింటికీ సమావేశాలకూ హాజరు కావాలనీ ఒక పయినీరు సహోదరి కలిగివున్న దృఢనిశ్చయానికి ఎంతగానో ప్రభావితమైన ఆమె యజమాని, ఆమె హాజరయిన సమావేశానికి తాను కూడా ఒక రోజంతా హాజరయ్యాడు!

4 అందువల్ల, మీ యజమాని మీకు సెలవు ఇవ్వడేమోననీ, లేక ఒకరోజు సమావేశానికి హాజరుకాకపోతే పెద్ద నష్టమేమీ లేదులే అనీ అనుకోవద్దు. బదులుగా, సమావేశానికి హాజరవడం మీ ఆరాధనలో ఎందుకు ప్రాముఖ్యమైన అంశమైయుందనే విషయాన్ని హృదయపూర్వక నమ్మకంతో, మీ యజమానికి లేఖనాల ద్వారా యుక్తిగా చూపించడానికి సిద్ధంకండి. (హెబ్రీ. 10:24, 25) ఆ తర్వాత, మీరు మీ జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనిస్తే, మీ వస్తుసంబంధ అవసరతలన్నీ తీర్చబడతాయన్న యెహోవా వాగ్దానంపై మీ పూర్తి విశ్వాసాన్ని ఉంచండి.—మత్త. 6:33; హెబ్రీ. 13:5, 6.

5 “శ్రేష్ఠమైన కార్యముల” పట్ల మెప్పుదల కలిగివుండటం కీలకం. (ఫిలి. 1:9; కీర్త. 27:4) యెహోవా నుంచి వచ్చే ఈ ప్రాముఖ్యమైన ఏర్పాటు నుండి పూర్తి ప్రయోజనం పొందేలా ప్లాన్‌ చేసుకునేందుకు ఆ మెప్పుదల మనలను కదిలిస్తుంది. ఇప్పటి నుండే ప్లాన్‌ వేసుకోవడం మొదలుపెట్టి, మీరు మూడు రోజులూ అక్కడ ఉండేందుకు నిశ్చయించుకోండి!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి