విశ్వాసమందు నిలుకడగా ఉండేందుకు మనకేది సహాయపడగలదు?
1 మనం యెహోవా సంస్థతో సహవసించడం మొదలుపెట్టినప్పటినుండీ, మన ఆధ్యాత్మిక అభివృద్ధి, మన ఆనందానికి మూలముగా నిరూపించబడింది! అయినా, ‘వేరుపారినవారై, యంటివలె కట్టబడుచు, విశ్వాసమందు స్థిరపరచబడి’ నిలిచి ఉండేందుకు ఎడతెగని ఆధ్యాత్మిక పెరుగుదల అవశ్యం. (కొలొ. 2:6, 7) ఎంతోమంది ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుండగా, కొందరు “విశ్వాసమందు నిలుకడగా” ఉండటంలో విఫలులై కొట్టుకొని పోయారు. (1 కొరిం. 16:13) అది మనకు జరుగకుండా మనం చూసుకోవచ్చు. ఎలా?
2 ఎడతెగని ఆధ్యాత్మిక కార్యకలాపాలు: యెహోవా సంస్థపరిధిలో మంచి ఆధ్యాత్మిక నిత్యకృత్యాన్ని ఏర్పరచుకోండి. దాంట్లో మన ఆధ్యాత్మిక అవసరాలపట్ల ఎంతో శ్రద్ధ తీసుకోబడుతుంది. సంఘ కూటాలు, సభలు, సమావేశాలు మనం గొప్ప ఆధ్యాత్మిక ఎదుగుదలను, స్థిరత్వాన్ని పొందడానికి పురికొల్పుతాయి, అయితే మనం క్రమంగా హాజరవుతూ ఉంటేనే ప్రయోజనాలను పొందుతాము. (హెబ్రీ. 10:24, 25) నిత్యకృత్యంగా బైబిలును, కావలికోట, తేజరిల్లు! పత్రికలను, దేవుని వాక్యపు బలమైన ఆహారాన్ని చర్చించే పుస్తకాలను చదువుతూ ఉంటే, మన ఆధ్యాత్మిక వేర్లు లోతుగా బలంగా ఉంటాయి. (హెబ్రీ. 5:14) వ్యక్తిగత ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించటానికి గట్టిగా ప్రయత్నించటం కూడా నిత్య ప్రయోజనాలను తీసుకువస్తుంది.—ఫిలి. 3:16.
3 పరిణతి పొందిన వారినుంచి సహాయం: సంఘంలో ఆధ్యాత్మికంగా పరిణతి పొందిన వారితో సహవాసాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించండి. పెద్దల గురించి తెలుసుకోండి, ఎందుకంటే ప్రాథమికంగా మనల్ని బలపర్చగలిగేది వారే. (1 థెస్స. 2:11, 12) వారు ఇచ్చే ఏ సలహానైనా, సూచననైనా స్వీకరించండి. (ఎఫె. 4:11-16) పరిచర్య సేవకులు కూడా ఇతరులను తమ విశ్వాసంలో బలపర్చటానికి ఆసక్తిగల్గి ఉంటారు గనుక ఈ సహోదరుల ప్రోత్సాహాన్ని కూడా తీసుకోండి.
4 పరిచర్యలో మీకు సహాయం అవసరమా? పెద్దలతో మాట్లాడి, సహాయాన్ని కోరండి. బహుశ మీరు “పయినీర్లు ఇతరులకు సహాయపడతారు” అనే కార్యక్రమంలో భాగం కావచ్చు. మీరు కొత్తగా బాప్తిస్మం పొందారా? మన పరిచర్య పుస్తకాన్ని చదివి అందులో ఉన్నవాటిని అన్వయించుకుంటే, అది ఆధ్యాత్మిక ఎదుగుదల వైపుకు పురోగమింపజేస్తుంది. మీరు తల్లిదండ్రులా? మీ పిల్లల ఆధ్యాత్మికతను ఎడతెగక బలపర్చండి.—ఎఫె. 6:4.
5 విశ్వాసంలో వేరుపారి స్థిరంగా ఉంటే మనం యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని, మన సహోదరులతో చక్కని సహవాసాన్ని అనుభవిస్తాము. ఇది, మనం సాతాను దాడులను ఎదుర్కొనటానికి శక్తినిస్తుంది, మనకున్న నిత్యభవిష్యత్తు నిరీక్షణను బలపరుస్తుంది.—1 పేతు. 5:9, 10.