2000 సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
1 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల యెహోవా ప్రజలకు గొప్ప ఆశీర్వాదంగా నిరూపించబడింది. గత 50 ఏళ్లుగా లక్షలాదిమంది బహిరంగ ప్రసంగీకులుగా, బైబిలు సత్యాల బోధకులుగా తమ సామర్థ్యాలను వృద్ధి చేసుకోవడానికి అది సహాయపడింది. (కీర్త. 145:10-12; మత్త. 28:19, 20) ఆ పాఠశాల మీకెలా సహాయపడిందో మీరు గ్రహించారా? మీరు దాంట్లో పూర్తిగా భాగంవహించి, ఇవ్వబడిన సలహాను మీరు అన్వయించుకుంటే, అది ఈ 2000వ సంవత్సరంలో కూడా సహాయం చేయపడగలదు.
2 నియామకాలను గూర్చిన నిర్దేశాలూ, ఉపయోగించబోయే ప్రచురణలు 2000 సంవత్సరపు పాఠశాల పట్టిక మొదటి పేజీలో ఇవ్వబడ్డాయి. ప్రతి భాగానికి కేటాయించబడిన సమయం, విషయమూలం, విషయాన్ని ఎలా అందించాలి అన్నవి, మరితర వివరాలు అందించడమైనది. దయచేసి కొంత సమయం తీసుకొని ఆ నిర్దేశాలను జాగ్రత్తగా చదివి వాటిని అన్వయించుకోవలసింది.
3 వారపు బైబిలు పఠనం: పాఠశాల పట్టికలో రెండు వేర్వేరు వారపు బైబిలు పఠన కార్యక్రమాలను చేర్చడమైనది. ఒకటి బైబిలులోని దాదాపు ఐదు పేజీల వరకు ఉండే ప్రామాణిక పఠన కార్యక్రమం, బైబిలు ఉన్నతాంశాలు ఆధారపడి ఉండేది ఈ బైబిలు పఠనంమీదే. మరొక పఠన కార్యక్రమం అదనంగా ఉండేది, మొదటిదాని కన్నా దీనిలో రెండింతలు సమాచారం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తే మూడు సంవత్సరాల్లో మీరు మొత్తం బైబిలును పూర్తిచేయగలుగుతారు. కొందరు అదనంగా షెడ్యూల్ వేయబడిన దానికన్నా ఎక్కువే చదవాలనుకోవచ్చు, మరికొందరు అలా చేయలేకపోవచ్చు. ఇతరులతో పోల్చుకునే బదులు మీరు చేయగలిగినదాంట్లో సంతోషించండి. (గల. 6:4) ప్రాముఖ్యమైన విషయం ప్రతిదినమూ దేవుని వాక్యాన్ని పఠించాలన్నదే.—కీర్త. 1:1-3.
4 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరటానికి మీరు పాఠశాల పైవిచారణకర్తతో మాట్లాడాలి. దయచేసి మీకివ్వబడిన నియామకాలను గంభీరంగా తీసుకోండి, పెద్దకారణం లేకుండా వాటిని మానుకోవద్దు. పాఠశాల యెహోవానుంచి వచ్చిన ఏర్పాటని దాన్ని ప్రశంసించండి. బాగా సిద్ధపడండి, నియమించబడిన విషయంతో పూర్తి పరిచయం సంపాదించుకోండి, అది మీ హృదయంలోంచి వచ్చినట్లుగా వ్యక్తంచేయండి, అలా సాటిలేని ఈ పాఠశాలనుంచి మీరు ప్రయోజనం పొందండి.