నవంబరులోని సేవా కూటాలు
నవంబరు 1తో ప్రారంభమయ్యే వారం
పాట 156 (28)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. “బైబిలు యొక్క ప్రభావాన్ని చూడండి !” అనే శీర్షికను సమీక్షించండి.
15 నిమి: “ప్రకటనాపని మనలను వ్యత్యాసంగా ఉంచుతుంది.” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువకు పరిమితం చేయాలి. తర్వాత, ప్రశ్నా జవాబుల చర్చను చేయండి. జ్ఞానము పుస్తకం 173వ పేజీ, 8వ పేరాను ఉపయోగించి పరిచర్యలో పాల్గొనేలా బైబిలు విద్యార్థిని ప్రోత్సహించేందుకు ఏమి చెప్పవచ్చో వివరించండి.
20 నిమి: “బైబిలు పఠనాన్ని ఎవరు అంగీకరించవచ్చు?” ప్రసంగము ప్రదర్శనలు. మన ప్రచురణలు ఏమి కలిగివున్నాయో వాటిని నేర్చుకొనేలా వివిధ రకాలుగా వారిలో ఆసక్తిని రేకెత్తించేందుకు 4వ పేరాకు అనుగుణంగా కొన్ని సలహాలను ఇవ్వండి. అది ఎలా చేయవచ్చో రెండు క్లుప్త అందింపులను ప్రదర్శించండి. పఠనాలను ప్రారంభించడంలో ఎలా విజయాన్ని సాధిస్తున్నారో చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 198 (6), ముగింపు ప్రార్థన.
నవంబరు 8తో ప్రారంభమయ్యే వారం
పాట 204 (25)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్ట్. తర్వాత వారానికి నవంబరు ఇన్‌సర్ట్‌లోని మొదటి 18 పేరాలను సిద్ధపడి రమ్మని సహోదరులకు గుర్తుచేయండి.
15 నిమి: ప్రశ్నా భాగం. ఒక ప్రసంగం. రాజ్యమందిరాన్ని శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచేందుకు చేసిన స్థానిక ఏర్పాట్లను సంక్షిప్తంగా వివరించండి.
20 నిమి: “ఒక యూదునికి మీరేమని చెప్తారు?” ప్రశ్నా జవాబులు. ఛాందసులైన యూదుల, సంస్కరణవాదులైన యూదుల, మితవాదులైన యూదుల మధ్య ఉన్న తేడాలను వివరించండి. (దేవుని కోసం మానవజాతి అన్వేషణ [ఆంగ్లం], 226-7 పేజీలు చూడండి.) ఒక యూదునితో ఏ అంశాల్లో సామ్యం ఏర్పరుచుకోవచ్చో ఆ అంశాలను తెలియజేయండి. బాగా సిద్ధపడిన అందింపును ప్రదర్శించండి. యూదామతం మీద మరింత సమాచారం కోసం ఫిబ్రవరి 1998 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్, తర్కించుట (ఆంగ్లం) పుస్తకం 22-3 పేజీలు, దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) 9వ అధ్యాయం చూడండి.
పాట 208 (8), ముగింపు ప్రార్థన.
నవంబరు 15తో ప్రారంభమయ్యే వారం
పాట 211 (22)
8 నిమి: స్థానిక ప్రకటనలు.
25 నిమి: “ఇంటర్‌నెట్ ఉపయోగించడంలో రాగల ప్రమాదాల విషయమై అప్రమత్తులుగా ఉండండి !” 1-18 పేరాలు ప్రశ్న జవాబుల చర్చ. 4-7, 12, 16, 17 పేరాలను చదవండి. తర్వాతి వారానికి 19-36 పేరాలను బాగా సిద్ధపడి రమ్మని అందరినీ ప్రోత్సహించండి.
12 నిమి: తల్లిదండ్రులారా—మీరు క్రమ కుటుంబ పఠనాన్ని జరుపుతున్నారా? ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. కుటుంబాలు ఎందుకు కలిసి పఠించాలో వివరించండి. (పాఠశాల నిర్దేశక పుస్తకము [ఆంగ్లం], 37-8 పేజీలు చూడండి.) కుటుంబపఠనానికి గల ఈ క్రింది ఆటంకాలను గమనించండి: (1) ప్రయోజనం పొందేంత పెద్దవాళ్లేమీ కాదు, ఇంకా చిన్నవాళ్ళే అన్న భావన, (2) సంఘకూటాలకు హాజరవ్వడం సరిపోతుందిలే అనుకోవడం, (3) బిజీగా ఉండటం వల్ల అలసిపోవడం, (4) టీవీ చూడటం ద్వారా ఏకాగ్రత చెదరి పోవడం. (మే 15, 1994, కావలికోట, 11-12 పేజీలు చూడండి.) కుటుంబ పఠనాన్ని చక్కగా క్రమంగా చేయడానికి కలిగే అడ్డంకుల్ని ఎలా ఎదుర్కొంటున్నారో చెప్పమని కుటుంబ శిరస్సులను ఆహ్వానించండి. దీనికి కృషి, తీర్మాన, సహకారాలు అవసరమని నొక్కి తెల్పండి.
పాట 217 (9), ముగింపు ప్రార్థన.
నవంబరు 22తో ప్రారంభమయ్యే వారం
పాట 158 (23)
10 నిమి: స్థానిక ప్రకటనలు. క్షేత్ర సేవలోని అనుభవాలు.
10 నిమి: నియామకాల పట్ల మీ దృక్పథం ఏమై వుంది? పెద్ద ఇచ్చే ప్రసంగం. సంఘం పని చేస్తూ ఉండటానికి అవసరమైన కొన్ని పనుల పెద్ద లిస్టు ఉంది: కార్యక్రమ నియామకాలను సిద్ధపర్చడం; ఇతరులను కూటాలకు తీసుకురావడం లేదా సేవకు తీసుకువెళ్ళడం; వయస్సు మళ్ళిన వారికి సహాయం చేయడం; రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడం, బాగుచేయడం, దానిపట్ల శ్రద్ధ వహించడం మొదలైనవి. అలాంటి వాటికి సహాయం చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారు? కొంతమంది నిరాకరించవచ్చు, కొంతమంది అయిష్టంగా అంగీకరించవచ్చు, కొంతమంది పూర్తి చేయలేక పోవచ్చు. నియామకాలను అంగీకరించడం, నిర్వర్తించడం ఎందుకు ఒక సంతోషకరమైన ఆధిక్యతో చర్చించండి. ఇష్టపూర్వక స్వచ్ఛంద ఆత్మను ప్రదర్శించమని సంఘంలోని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.—కీర్త. 110:3; యెష. 6:8.
25 నిమి: “ఇంటర్‌నెట్ ఉపయోగించడంలో రాగల ప్రమాదాల విషయమై అప్రమత్తులుగా ఉండండి !” 19-36 పేరాలు ప్రశ్న జవాబుల చర్చ. 23-5 పేరాలు, 34-6 పేరాలు చదవండి.
పాట 223 (6), ముగింపు ప్రార్థన.
నవంబరు 29తో ప్రారంభమయ్యే వారం
పాట 215 (22)
10 నిమి: స్థానిక ప్రకటనలు. నవంబరు క్షేత్ర సేవ రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి.
15 నిమి: కూటాలకు హాజరవ్వమని క్రొత్త వారిని ప్రోత్సహించండి. దేవుని చిత్తాన్ని చేస్తున్నారు (ఆంగ్లం) అనే బ్రోషూర్ 14-15 పేజీలపై ఆధారపడిన అంశాన్ని పెద్ద, ఒకరు లేక ఇద్దరు పరిచర్య సేవకులు చర్చిస్తారు. క్రొత్తవారు కూటాలకు హాజరవ్వడం ఎందుకు ప్రాముఖ్యమో సమీక్షించండి. అక్కడ వారు ఉపదేశం, ప్రోత్సాహం, సహాయం ఎక్కువ మోతాదులో పొందుతారు. వారపు ఐదు కూటాలను సమీక్షించి ప్రతిదాని వల్ల వచ్చే ప్రయోజనాలను సమీక్షించండి. దైవిక ప్రవర్తన కలిగివుండేందుకు, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి, మనలను సంస్థ వైపుకు నడిపించడానికి, ఇతరులతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకొనేందుకు, మన పరిచర్య యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకొనేందుకు సహాయపడేందుకు కూటాలు మనకు ఎలా తోడ్పాటునిస్తాయో చర్చించండి. క్రొత్తవారు కూటాలకు వచ్చేందుకు ప్రేరేపణ కల్గించేందుకు ఈ బ్రోషూర్‌ను ఉపయోగించమని ప్రేక్షకులను ప్రోత్సహించండి.
20 నిమి: మన ఎంపిక—న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్. ప్రసంగం మరియు ప్రదర్శనలు. అన్ని మతాల కన్నా మనది అనుపమానమైనది, ఎందుకంటే మనం అభిషిక్తులైన యెహోవా ఆరాధకులు ఉత్పత్తి చేసిన బైబిలు అనువాదాన్ని ప్రచురిస్తాము, ఉపయోగిస్తాము, పంచిపెడతాము. వాణిజ్యపరమైన లాభాలను పొందాలనీ, లేక ఒక మత తెగకు సంబంధించిన విశ్వాసాలను ప్రచారం చేయాలనీ మనం కోరుకోవడంలేదు. బదులుగా, దేవుని నామానికి ఘనతనివ్వాలన్న, ఆయనను అందరూ బాగా తెలుసుకోవాలన్న అభిలాష ద్వారా కదిలించబడ్డాము. ఇతర అనువాదాలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, అందుకని న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ వల్ల ఖచ్చితమైన ప్రయోజనాలను సమీక్షించండి. (“ప్రతి లేఖనము” [ఆంగ్లం] పుస్తకంలో 327-31 పేజీలు చూడండి. 3వ పేరాలోని వ్యాఖ్యానాలను చూసి, 6వ పేరాలో సరైన అనువాదాన్ని గూర్చిన ఉదాహరణలను ఎత్తి చూపండి. 22-3పేరాల్లో ఉన్న ప్రయోజనాలను ఉన్నతపర్చండి.) “మీరు మీ స్వంత బైబిలు అనువాదాన్ని ఉపయోగిస్తారు” అని ఇతరులు అన్నప్పుడు మనమెలా ప్రతిస్పందించాలో సలహానిచ్చే రెండు క్లుప్త ప్రదర్శనలను చూపండి.—తర్కించుట (ఆంగ్లం) 279-80 పేజీలు చూడండి.
పాట 205 (28), ముగింపు ప్రార్థన.