కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/99 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 8/99 పేజీలు 5-6

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

1999 మే 3 నుండి ఆగస్ట్‌ 23 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. తల్లిదండ్రులు తమ పిల్లలతో సహేతుకంగా వ్యవహరించేందుకు బైబిలు సూత్రాల విషయంలో రాజీపడవసరం లేదు. [fy 108వ పేజీ 14వ పేరా]

2. హెబ్రీ మూలపురుషులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురూ కూడా ‘యెహోవా పేరట ప్రార్థన చేసేవారు,’ కానీ, ఆ దైవిక నామము యొక్క పూర్తి విశిష్టత వాళ్ళకు అప్పట్లో తెలియదు. (ఆదికాండము 21:33; 26:25; 32:9; నిర్గమకాండము 6:3) [kl 25వ పేజీ 8వ పేరా]

3. ప్రతి ఒక్కరూ యేసును వాగ్దానం చేయబడిన మెస్సీయగా అంగీకరించారు, లేఖనాలు దీన్ని గురించి ప్రవచించాయి. (కీర్తన 2:3) [kl 36వ పేజీ, 9వ పేరా]

4. కడు పేదరికంలో జీవిస్తున్నవాళ్ళు రాజ్యాసక్తుల పురోభివృద్ధికి తోడ్పడేందుకు ఆర్థిక విరాళాలిచ్చే స్థితిలో లేరు. [w97 9/15 5వ పేజీ 7వ పేరా]

5. తల్లిదండ్రులకూ, తాతమామ్మలకూ చేయవలసిన ప్రత్యుపకారాన్ని చేయడం మనం యెహోవాను ఆరాధించడంలో ఒక భాగం. (1 తిమో. 5:4) [w97 9/1 4వ పేజీ, 1-2 పేరాలు]

6. సబ్బాతు ఆచరణ, మొదట్లో యెహోవాకూ సమస్త జనాంగాలకూ గురుతుగా ఉండేది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w89 11/15 4వ పేజీ]

7. పిల్లవాడు స్వయంగా నిర్ణయాలు తీసుకోనారంభించేంతగా పెద్దవాడైనప్పుడు, తన చర్యలకు తను ఎక్కువ బాధ్యత వహిస్తాడు, ముఖ్యంగా దైవిక చట్టం సంబంధంగా. (రోమా. 14:12) [fy 135వ పేజీ 17వ పేరా]

8. అపవాది అంటే ఒకరి హృదయంలో ఉండే చెడేనని బైబిలు వెల్లడి చేస్తుంది. (మత్త. 4:1-11) [kl 55వ పేజీ 5వ పేరా]

9. లూకా 21:20, 21లో వ్రాయబడిన యేసు మాటలు సా.శ. 66లో రోమా సైన్యాలు జనరల్‌ టైటస్‌ ఆజ్ఞ మేరకు యెరూషలేము నుండి వెనుదిరిగిపోయినప్పుడు నెరవేరాయి. [w97 4/1 5వ పేజీ 3-4 పేరాలు]

10. ఎపిక్యూరస్‌ బోధ క్రైస్తవులకు ప్రమాదకరమైనది. ఎందుకంటే, అది 1 కొరింథీయులు 15:32 లో వివరించబడిన అతని అవిశ్వాసపు దృక్కోణంపై ఆధారపడి ఉంది. [w97 11/1 24వ పేజీ, 5వ పేరా]

క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:

11. లేవీయకాండము 3:16, 17 లలో పేర్కొనబడిన క్రొవ్వు తినకూడదన్న నిషేధాజ్ఞ నుండి మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటాం? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E84 2/15 29వ పేజీ 2వ పేరా]

12. అపవాదియైన సాతాను ఉనికిలో ఉండడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు? (నిర్గ. 915) [వారంలో చదవవలసి బైబిలు భాగం; చూడండి w-E92 3/15 10వ పేజీ 14వ పేరా.]

13. కుటుంబ సభ్యుల్లో ఒకరు తీవ్రమైన అనారోగ్యాకి గురైనట్లయితే, ప్రాధాన్యతలను నిర్ణయించేందుకు కుటుంబం చేపట్టాల్సిన తొలి చర్యలు ఏవి? (సామె. 1522) [fy 122వ పేజీ 14వ పేరా]

14. ఇశ్రాయేలు జనాంగం ఏ భావంలో “యాజక రూపమైన రాజ్యము”గా ఉండేది? (నిర్గ. 19:6) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 7/1 16వ పేజీ 8వ పేరా.]

15. “తేటగా” ఉన్న కన్నుకూ, “చెడిన” కన్నుకూ మధ్య ఉన్న తేడా ఏమిటి? (మత్త. 6:22, 23) [w97 10/1 26వ పేజీ 5వ పేరా]

16. దావీదు తప్పిదాలు చేశాక కూడా, ఆయనను గురించి ‘యథార్థహృదయుడై, నీతిని బట్టి’ నడుచుకున్నాడని ఎలా చెప్పబడింది? (1 రాజు. 9:4) [w97 5/1 5వ పేజీ 2వ పేరా]

17. ప్రత్యక్షపు గుడారం విషయంలో ఆజ్ఞాపించబడిన “ప్రకారముగానే” ఇశ్రాయేలీయులు ‘చేయడం’ ఏ ఆధునిక దిన ఆధిక్యతలకు ముందు ఛాయగా ఉంది? (నిర్గ. 39:32) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 12/15 12వ పేజీ 9వ పేరా.]

18. “నేను ఉన్నవాడను అను వాడనై యున్నానని” యెహోవా తనను తాను వెల్లడిపరచుకున్నాడన్న వాస్తవం దేనిని సూచిస్తుంది? (నిర్గ. 3:13-15) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 3/1 10వ పేజీ 6వ పేరా.]

19. లేవీయకాండము 10:1, 2 లో నాదాబు అబీహులు ఇమిడి ఉన్న సంఘటన ఏ పాఠాన్ని నేర్పిస్తుంది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E84 2/15 29వ పేజీ 3వ పేరా.]

20. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ప్రసవించినప్పుడు స్త్రీ “అశుద్ధంగా” ఎందుకు అవుతుంది? (లేవీ. 12:2, 5 పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E84 2/15 29వ పేజీ 5వ పేరా.]

క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:

21. ఒంటరితనానికి అద్భుతకరమైన చికిత్స లేకపోయినప్పటికీ, ఒంటరి తల్లి/తండ్రి ________ నుండి వచ్చే బలంతో దాన్ని భరించగలరు, అటువంటి బలం ఎడతెగని __________ ద్వారా వస్తుంది. (1 తిమో. 5:5) [fy 112వ పేజీ, 21వ పేరా]

22. ________కీ _________కూ గురికావడం వల్లనే లేక, మనం _______గా పొందిన _____ వల్లనే జీవితంలో దుర్ఘటన సంభవించి ఉండవచ్చు. [w97 5/15 22వ పేజీ 7వ పేరా]

23. మనం ______ ______లతో పూర్ణంగా నింపబడివున్న _________చే పురికొల్పబడినవారమై, “ఆత్మతో” దేవుడ్ని ఆరాధించవలసిన అవసరం ఉంది. [kl 45వ పేజీ 4వ పేరా]

24. మనం ________గా ఎవరమై ఉన్నాం అన్నది కాదు కానీ ప్రాథమికంగా ______లో ఎవరమై ఉన్నాం అన్నదే అంతరంగంలో నిజానికి మనమెవరమై ఉన్నాం అన్నదాన్ని బయలుపరుస్తుంది. [w97 10/15 29వ పేజీ 4వ పేరా]

25. కోత పండుగలకు ________తో లేక _________తో సంబంధం ఉన్నట్లయితే, నిజమైన క్రైస్తవులు అలాంటి కలుషితమైన ఆరాధనలో ఏ విధంగానూ _________ వహించకుండా ఉండడం ద్వారా యెహోవాకు అప్రీతి కలిగించకుండా ఉండవచ్చు. [w97 9/15 9వ పేజీ 6వ పేరా]

క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

26. మొండివాడైన ఫరో మరియు అతని సైన్యం, (600, 800, 900) యుద్ధ రథాలతో ఇశ్రాయేలీయులను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు బయలుదేరారు. వాళ్ళు సమీపిస్తుండగా, దేవుడు (ఎర్ర సముద్రాన్ని; యొర్దాను నదిని; మధ్యధరా సముద్రాన్ని) అద్భుతరీతిలో రెండు పాయలుగా వేరు చేయగా ఇశ్రాయేలీయులు ఆరిననేలపై నడిచి వెళ్ళగలిగారు. [kl 26వ పేజీ 11వ పేరా]

27. ఒక కుటుంబం తీవ్రమైన అనారోగ్యాన్ని విజయవంతంగా తాళుకుంటుందా లేదా అనేది చాలా మేరకు కుటుంబ సభ్యుల (ఆర్థిక భద్రత; దృక్పథం; ఇన్స్యూరన్స్‌ పాలిసీల)పై ఆధారపడి ఉంటుంది. (సామెతలు 17:22) [fy 120వ పేజీ 10వ పేరా]

28. “దేవుడు [“యెహోవా,” NW] లేడని” తన హృదయంలో చెప్పుకునేవాడు ‘బుద్ధిహీనుడు’ అని పిలువబడుతున్నాడు, ఎందుకంటే, అతడు (నైతికత లోపించిననవాడు; విద్యలేనివాడు; తార్కికంగా ఆలోచించే సామర్థ్యంలేనివాడు). (కీర్త. 14:1) [w97 10/1 6వ పేజీ 8వ పేరా]

29. ఆదాము హవ్వలు తిరుగుబాటు చేసినప్పుడు, వాళ్ళు కోల్పోయిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, (పరిపూర్ణత; దేవుడితో సంబంధం; వనగృహం) [w97 10/15 6వ పేజీ 8వ పేరా]

30. ఆదాము హవ్వలు తన పక్షం వహించేలా వాళ్ళను ప్రలోభపెట్టేందుకు, సాతాను (ధ్వనివిడంబన చేసే వ్యక్తిలా; మాంత్రికుడిలా; వశీకరణ వైద్యుడిలా) ఒక సర్పాన్ని ఉపయోగిస్తూ అబద్ధమాడాడు. [kl 57వ పేజీ 10వ పేరా]

క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జతచేయండి:

నిర్గ. 5:2; నిర్గ. 21:29; సామె. 1:8; గల. 5:20; యాకో. 1:14, 15

31. క్రైస్తవుడనని చెప్పుకునే ఎవరైనా సరే, తన భార్యపై లేక పిల్లలపై శారీరక దాడి చేయడంతో సహా, పశ్చాత్తాపం చెందకుండా మరలా మరలా కోపోద్రేకంతో విరుచుకుపడుతున్నట్లయితే, అతడు క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడవచ్చు. [fy 150వ పేజీ 23వ పేరా]

32. మనం ఎలా ప్రవర్తిస్తామన్నది మనం ఎలా ఆలోచిస్తాం అన్న దానితో ప్రారంభమౌతుంది. [fy 148వ పేజీ 18వ పేరా]

33. తన దైవత్వాన్ని గుర్తించేందుకు ధిక్కారపూర్వకంగా నిరాకరించేవాళ్ళందరూ సిగ్గుపడేటట్లు యెహోవా దేవుడు చేస్తాడు. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E92 12/15 13వ పేజీ 18వ పేరా.]

34. బైబిలు, పిల్లలకు ఉపదేశాన్నిచ్చే ప్రాథమిక బాధ్యతను తండ్రికి ఇస్తున్నప్పటికీ, తల్లికి కూడా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. [fy 133వ పేజీ 12వ పేరా]

35. ఎవరైనా చంపబడినప్పుడు, నిర్లక్ష్యం వల్ల జరిగిందంటే దయచూపించడానికి ధర్మశాస్త్రం అనుమతించేది కాదు. [చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 11/15 11వ పేజీ 5వ పేరా.]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి