కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/99 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 8/99 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఆగస్టు: ఈ క్రింది 32-పేజీల బ్రోషూర్‌లలో వేటినైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . వీలైన చోట్ల మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? మృతుల ఆత్మలు అవి మీకు సహాయం చేయగలవా లేక హాని చేయగలవా? అవి నిజానికి ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధం లేని లోకం ఎప్పటికైనా వస్తుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూర్‌లను ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! పత్రికలకు చందాలు. నవంబరు: దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము.

◼ ప్రతి సమాజంలోనూ సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో లౌకిక సెలవుదినాలు ఉంటాయి, ఆ సెలవు దినాల్లో పిల్లలకు స్కూలుకు హజరవ్వడం నుండి మినహాయింపు దొరుకుతుంది, ఉద్యోగస్థులకు లౌకిక ఉద్యోగాలనుండి కాస్త ఖాళీ దొరుకుతుంది. ఇవి, సంఘాలు ప్రాంతీయ పరిచర్యలో మరింత ఎక్కువగా భాగం వహించేందుకు మంచి అవకాశాలను ఇస్తాయి. ఇలాంటి సందర్భాలకోసం పెద్దలు ముందుగానే ప్రణాళికవేసి, ఆ సెలవుదినాల్లో గుంపు సాక్ష్యం ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లను గురించి సంఘానికి ఎంతో ముందుగా తెలియజేయాలి.

◼ ప్రతి సంఘానికి మూడు లిటరేచర్‌ ఇన్వెంటరీ ఫారంలు (S-AB-18) అందుతాయి. ఆగస్టు నెలారంభంలో సంఘ కార్యదర్శి, సాహిత్యాల్ని పర్యవేక్షించే సేవకునితో కలిసి, నెలాఖరులో సంఘంలో స్టాకు ఉన్న సాహిత్యాన్ని ఇన్వెంటరీ తీసుకోవడానికి ఒక తేదీని నిర్ణయించుకోవాలి. అసలు స్టాకులో ఉన్న సాహిత్యాలన్నింటినీ లెక్కించి, వాటి మొత్తాల్ని లిటరేచర్‌ ఇన్వెంటరీ ఫారంలో ఎక్కించాలి. స్టాకులో ఉన్న పత్రికల మొత్తాన్ని పత్రికలను పర్యవేక్షించే సేవకుని నుండి పొందవచ్చు. దయచేసి ఒరిజినల్‌ లిటరేచర్‌ ఇన్వెంటరీ ఫారంను సొసైటీకి సెప్టెంబరు 6వ తారీఖుకు ముందే పోస్టు చేయండి. మీ ఫైళ్ళ నిమిత్తం ఒక కార్బన్‌ కాపీని ఉంచుకోండి. మూడవ కాపీని వర్క్‌ షీటుగా ఉపయోగించవచ్చు. లిటరేచర్‌ ఇన్వెంటరీ కార్యదర్శి పర్యవేక్షణలో జరగాలి, పూర్తి చేయబడిన ఫారాన్ని సంఘ పైవిచారణకర్త చెక్‌ చేయాలి. కార్యదర్శీ, సంఘ పైవిచారణకర్తా ఇద్దరూ ఫారంపై సంతకాలు చేస్తారు.

◼ సంఘ కార్యదర్శి, కాంగ్రిగేషన్‌ అనాలసిస్‌ రిపోర్ట్‌ ఫారం (S-10) ని కూడా నింపుతాడు. పబ్లిషర్‌ రికార్డ్‌ కార్డులనుండి (S-21) అవసరమయ్యే సమాచారాన్ని రిపోర్టు ఫారంలో ఖచ్చితంగా గణించి వేస్తున్నామని రూఢిపర్చుకునేందుకు ఆయన, రిపోర్టును నింపడంలో బహుశ తనకు సహాయం చేస్తున్న పెద్దకు గానీ లేక పరిచర్య సేవకునికి గానీ జాగ్రత్తగా నిర్దేశనాలనిస్తాడు. కాంగ్రిగేషన్‌ అనాలసిస్‌ రిపోర్ట్‌ ఫారాన్ని నింపడానికి ముందు దాంట్లో ఉన్న నిర్దేశకాలన్నింటినీ దయచేసి చదవండి. ఆ రిపోర్టు ఫారాన్ని ఖచ్చితంగానూ శుభ్రంగానూ నింపి, సంతకం చేసేముందు సేవా కమిటీ జాగ్రత్తగా చెక్‌ చేయాలి. దయచేసి ఒరిజినల్‌ S-10 ఫారాన్ని సొసైటీకి సెప్టెంబరు 10వ తారీఖుకు ముందే పోస్టు చేయండి; ఒక కార్బన్‌ కాపీని మీ ఫైలులో ఉంచండి.

◼ ఆగస్టు 16, 1999 నుండి ఆగస్టు 31 1999 వరకు లొనావ్లా బేతేలులోనూ, అలాగే కోట్టయం, చెన్నై బుక్‌ డిపోలలోనూ స్టాకులో ఉన్న సాహిత్యాలన్నింటినీ సొసైటీ ఇన్వెంటరీ తీసుకుంటుంది. అందుమూలంగా, ఆ సమయంలో సాహిత్యాలు సంఘాలకు పంపించబడవు లేక సాహిత్యాల కోసం సంఘం పెట్టిన ఆర్డరు ఫారంలు తీసుకోబడవు.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

ప్రాథమిక బైబిలు బోధలు (బాప్తిస్మం పొందగోరే వారి కోసం మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకం నుంచి తీసుకొనబడిన ప్రశ్నలు ఉన్న 64-పేజీల బుక్‌లెట్‌)-అస్సామీ.

యెహోవా స్తుతి గీతములు- హిందీ (29 పాటలున్న బ్రోషూర్‌). సంఘాలు వాటి కోసం తమ ఆర్డర్‌లను సొసైటీకి పంపించవచ్చు. దాని ఖరీదు పయినీర్లకైనా, పబ్లిషర్లకైనా, ప్రజలకైనా 5 రూపాయలే.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి