ప్రశ్నా భాగం
◼ క్రొత్త వారు బాప్తిస్మం తీసుకొనే ముందు మనం వారితో ఏ ప్రచురణలను పఠించాలి?
ఒక వ్యక్తి యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకునే ముందు అతడు ఖచ్చితమైన జ్ఞానాన్ని తప్పకుండా పొందాలి. (యోహా. 17:3) దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్‌నూ నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్నీ రెండింటినీ పఠించడం ద్వారా తనకు అవసరమైన సమాచారాన్ని అతను పొందుతాడు. చాలామంది విషయానికి వస్తే, దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు మొదట పఠించబడుతుంది. అయితే, జ్ఞానము పుస్తకంతో పఠనం ప్రారంభమైనప్పుడు, ఆ పుస్తక పఠనానంతరం దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును కూడా పఠించాలి. ఇది ఎందుకు అవసరం?
మొత్తంమీద, బైబిలు యొక్క ప్రాథమిక బోధలు ఏమిటి అనేదాన్ని దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరు తెలియజేస్తుంది. మొదటే దాన్ని పఠిస్తే, యెహోవాను సంతోషపరిచేందుకు కావలసినవేమిటి అనే వాటిని గురించిన ప్రాథమిక అవగాహనను అది విద్యార్థికిస్తుంది. దాన్ని ఆఖరున పఠిస్తే జ్ఞానము పుస్తకంలో చర్చించబడినదాని చక్కని పునఃసమీక్షగా పనిచేస్తుంది. ఈ రెండింటిలో ఎలా చేసినా, చర్చించబడిన విషయాలకు మద్దతునిచ్చే లేఖనాలను చూడమనీ, వాటిని ధ్యానించమనీ విద్యార్థిని ప్రోత్సహించండి. చిత్రాలు చాలా ప్రభావవంతమైన బోధనా సహాయకాలు కనుక, వాటివైపుకు అవధానాన్ని మళ్ళించండి.—జనవరి 15, 1997 కావలికోట, 16-17 పేజీలు చూడండి.
బైబిలు విద్యార్థి రెండు ప్రచురణలను పఠించడం పూర్తి చేశాడంటే, ఇక బాప్తిస్మ సిద్ధపాటులో భాగంగా, పెద్దలు పునఃసమీక్ష చేస్తూ ఆయనను అడిగే ప్రశ్నలన్నింటికీ ఆయన సులభంగా సమాధానం ఇవ్వగల్గవచ్చు. అలాగైతే, అతనితో ఇతర ప్రచురణలతో నియత పఠనం చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు, తర్వాత కూడా, అతని అభివృద్ధిలో పఠన నిర్వాహకుడు క్రియాశీల శ్రద్ధను తీసుకోవడంలో కొనసాగవలసి ఉన్నప్పటికీ నియత పఠనం అవసరం లేదు.—జనవరి 15, 1996 కావలికోట, 14, 17 పేజీలు చూడండి.