జూలైలోని సేవా కూటాలు
జూలై 5తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (16)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. దేశం యొక్క, స్థానిక సంఘం యొక్క మార్చి నెల ప్రాంతీయ సేవా నివేదికలపై వ్యాఖ్యానించండి. దైవపరిపాలనా వార్తలు.
20 నిమి: “యెహోవా సహాయం కోసం ప్రార్థించండి.” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువ సమయానికి పరిమితం చేసి, ఆ తర్వాత ప్రశ్నా జవాబుల చర్చతో కొనసాగండి. యథార్థమైన వివిధ ప్రార్థనలు విజయవంతమైన పరిచర్యలో ఎలా ప్రముఖ పాత్రను వహిస్తాయో వివరించండి. సమయోచితమైన ప్రార్థనలు తమ పరిచర్యలో ఎలా సహాయం చేశాయో చూపించే అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.—అక్టోబరు 15, 1996, కావలికోట 32వ పేజీ చూడండి.
15 నిమి: బ్రోషూర్‌లను సద్వినియోగం చేసుకోండి. ప్రసంగము, ప్రదర్శనలు. మన పరిచర్యలో బ్రోషూర్‌లు ఎందుకు విలువైన ఉపకరణాలో వివరించండి. అవి, అందరినీ ఆకట్టుకునే విషయాలను ఫలకరంగా చర్చిస్తాయి, ఒక ప్రాథమిక అంశాన్ని క్లుప్తంగా వివరిస్తాయి, లేఖనాధార బోధలను సరళంగా విశదీకరిస్తాయి. ఈ నెలలో ప్రతిపాదించబడుతున్న బ్రోషూర్‌లను పేర్కొని, స్థానికంగా బాగా సరఫరా అవుతున్న బ్రోషూర్‌లను చూపించండి. వాచ్ టవర్ పబ్లికేషన్ ఇండెక్స్‌లో “ప్రెసెంటేషన్స్” అనే శీర్షిక క్రింద కనుగొనబడే సూచనల ఆధారంగా రెండు లేదా మూడు క్లుప్త అందింపుల ప్రదర్శనలను చూపించండి.
పాట 181 (17), ముగింపు ప్రార్థన.
జూలై 12తో ప్రారంభమయ్యే వారం
పాట 103 (11)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: “ముందుగా సిద్ధపడడం ఆనందాన్ని తీసుకువస్తుంది.” ప్రసంగం, ఇంటర్వ్యూలు. ప్రాంతీయ సేవా క్రియాశీలతలకు సిద్ధపాటు ఎందుకు అత్యవసరమో, మనం చేస్తున్న దానిలో మనం గొప్ప ఆనందాన్ని అనుభవించగల్గేలా అదెలా చేస్తుందో వివరించండి. (పాఠశాల నిర్దేశక పుస్తకం (ఆంగ్లం) 39వ పేజీ, 1-3 పేరాలు చూడండి.) ఇద్దరు ముగ్గురు సమర్ధులైన ప్రచారకులను ఇంటర్వ్యూ చేసి, సేవకు వెళ్ళే ముందు వారెలా సిద్ధపడతారో, ఆ సిద్ధపాటు వారికెలా సహాయం చేస్తుందో చెప్పమనండి. పరిచర్య కోసం సిద్ధపడుటలో బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించాలి అనే చిన్న పుస్తకం యొక్క ఫలకరమైన ఉపయోగాన్ని చూపిస్తూ, ఏప్రిల్ 15, 1993 కావలికోట (ఆంగ్లం) 30వ పేజీలోని అనుభవాన్ని చెప్పండి.
20 నిమి: “విషయానికి వద్దాం!” ప్రేక్షకులను పాల్గొనజేయడమూ, ప్రదర్శనలూ. గృహస్థుడు మనం చెప్పేది ఆలకించేలా చేయాలంటే, ఏమి చెప్పాలి అనే విషయంలో దానికి ఇవ్వబడిన ప్రతి ఒక్క సూచనను పునఃసమీక్షించండి. ఫలకరమైన అనేక ఉపోద్ఘాతాలను అనుభవజ్ఞులైన ప్రచారకులచేత ప్రదర్శింపజేయండి. అదనపు సూచనలను ప్రతిపాదించమని ప్రేక్షకులను ఆహ్వానించండి, నిజంగా స్థానికంగా పని చేయగల ఉపోద్ఘాతాలేవో చూపించే ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పండి.
పాట 183 (27), ముగింపు ప్రార్థన.
జూలై 19తో ప్రారంభమయ్యే వారం
పాట 31 (22)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: నేను ఒక సంస్థలో చేరవలసిందేనా? తర్కము పుస్తకం (ఆంగ్లం) 280-4 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. మనకు తరచూ తారసపడే ప్రజలు, రాజ్య సందేశాన్ని అంగీకరిస్తారు కానీ, ఒక మత సంస్థలో “చేరేందుకు” విముఖత చూపిస్తారు. “సంస్థ” యొక్క నిర్వచనాన్నీ, యెహోవా దృశ్య సంస్థను గుర్తించేలా చేసే ఏడు ప్రత్యేకతలను పునఃసమీక్షించండి. అది ఇతర మతసంస్థల నుండి ఎందుకు భిన్నమై ఉందో, దానితో సహవసించడం నిజమైన ఆశీర్వాదాలను ఎలా తీసుకువస్తుందో వివరించండి.
పాట 189 (4), ముగింపు ప్రార్థన.
జూలై 26తో ప్రారంభమయ్యే వారం
పాట 184 (28)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై ప్రాంతీయ సేవా రిపోర్ట్‌లను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. ప్రశ్నా భాగం.
15 నిమి: మనం శిష్యులను చేస్తున్నామా? ఫిబ్రవరి 15, 1996 కావలికోట 19-22 పేజీల్లోని పాయింట్లను ఒకరు లేక ఇద్దరు పరిచర్య సేవకులతో సేవా పైవిచారణకర్త చర్చిస్తారు. మనం మన ప్రాంతంలో అర్హులైన వారి కోసం వెదకి వారిని శిష్యులను చేయవలసిన అవసరం ఎందుకు ఉందనే దానికి లేఖనాధార కారణాలను ఉన్నతపరచండి. (మత్త. 10:11) తమ చుట్టూ తాము చూస్తున్న దుష్టపరిస్థితులను బట్టి, దేవుడ్నే కాదంటున్న పరిస్థితులన్నింటిని బట్టి నిట్టూర్పులు విడుస్తున్న ప్రజలూ, యెహోవా ఉగ్రతదినము రాకమునుపే ఆయనను వెదికే ప్రజలూ వీరే. (యెహె. 9:4; జెఫ. 2:2, 3) వారిలో ‘నిత్యజీవమునకు నిర్ణయంపబడిన వారు’ ఉన్నారు. (అపొ. 13:48) యేసు ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ ప్రజలకు బోధిస్తూ, శిష్యులను చేసేవాళ్ళంగా ఉండాలన్నదే మనకివ్వబడిన దౌత్యం. (మత్త. 24:14; 28:19, 20) ఇంటింటి పరిచర్యా, అనియత సాక్ష్యమూ, వీధి సాక్ష్యమూ, మనం కలిసే ప్రజల్లో తొలి ఆసక్తిని రేకెత్తిస్తుంది, అయితే, దాని తర్వాత జరిగే పరిచర్యతో, అంటే పునర్దర్శనాలు, బైబిలు పఠనాలు చేయడంతో శిష్యులను చేసే పని పూర్తి అవుతుంది. దీన్ని ఎలా చేయవచ్చనే దానిపై ఆచరణాత్మక సూచనలను ఇవ్వండి.
20 నిమి: “మన దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.” జనవరి 1997 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్ 3-6 పేజీలపై ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ఉత్సాహపూరితమైన ప్రసంగం. మీకు సొంత రాజ్యమందిరం ఉండాలనీ ఇప్పటికే ఉంటే దాన్ని మంచి స్థితిలో ఉండేలా చూసుకోవాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలు సొంత రాజ్యమందిరాలు నిర్మించుకొనేందుకు తోడ్పాటునివ్వమని మీ సంఘాన్ని ప్రోత్సహించండి. ఇన్‌సర్ట్ 6వ పేజీలోని బాక్స్ వైపుకు అవధానాన్ని మళ్ళించండి.
పాట 118 (20), ముగింపు ప్రార్థన.