కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/99 పేజీ 1
  • యెహోవా మనకు బోధిస్తున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మనకు బోధిస్తున్నాడు
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • మరింత ఎక్కువగా యెహోవా సేవచేయడానికి తోడ్పడే పాఠశాలలు అవి యెహోవా ప్రేమకు నిదర్శనాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • రాజ్య పరిచర్య పాఠశాల దైవపరిపాలనా విద్యను అందించును.
    మన రాజ్య పరిచర్య—1992
  • పరిచర్య శిక్షణా పాఠశాల—ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశం
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 6/99 పేజీ 1

యెహోవా మనకు బోధిస్తున్నాడు

1 దైవిక నడిపింపు క్రింద ఒక అంతర్జాతీయ విద్యా కార్యక్రమం ఇప్పుడు 233 దేశాల్లో నిర్వహించబడుతోంది. ఈ లోకం అందించే దేన్నీ దానితో పోల్చలేము. మన గొప్ప ఉపదేశకుడైన యెహోవా, మనకుగా మనం ఇప్పుడు ఎలా ప్రయోజనం పొందవచ్చో బోధిస్తున్నాడు. అంతేగాక నిరంతర జీవితాన్ని పొందేలా మనలను విద్యావంతుల్ని చేస్తున్నాడు.—యెష. 30:20; 48:17.

2 దైవిక విద్యా పాఠశాలలు: యెహోవా ప్రజల ప్రయోజనార్థమై ప్రస్తుతం నిర్వహించబడుతున్న పాఠశాలలను పరిశీలించండి. దైవ పరిపాలన పరిచర్య పాఠశాల ప్రతివారం దాదాపు 87,000 సంఘాల్లో నిర్వహించబడుతుంది. అది లక్షలాది మంది రాజ్య ప్రచారకులను ప్రభావవంతమైన సువార్త పరిచారకులుగా అయ్యేలా తర్ఫీదునిస్తుంది. అందులో మీరు భాగం వహించారా? రెండు వారాలపాటు జరిగిన పయినీరు సేవా పాఠశాలకు హాజరైన వేలాదిమందిలో మీరూ ఉన్నారా? బహుశా క్రమ పయినీర్ల కోసం తగ్గించబడిన గంటలు, మరెక్కువ మంది పయినీరు సేవ చేసేలా సహాయపడి ఆ పాఠశాలకు హాజరయ్యేందుకు అర్హుల్ని చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతటా ప్రధానమైన భాషల్లో నిర్వహించబడుతున్న రెండు నెలల పరిచర్య శిక్షణ పాఠశాల గొప్ప దైవ పరిపాలన బాధ్యతల్ని చేపట్టేలా అవివాహితులైన పెద్దలను, పరిచర్య సేవకులను సంసిద్ధం చేస్తోంది. నియమిత కాలంలో పెద్దలు, పరిచర్య సేవకులు అందరూ రాజ్య పరిచర్య పాఠశాలలో ప్రత్యేకమైన ఉపదేశాన్ని పొందుతారు.

3 న్యూయార్క్‌ నందలి ప్యాటర్‌సన్‌లోని వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్లో ఉన్న వసతులు, మూడు ప్రత్యేకమైన పాఠశాలలకు నిలయంగా ఉపయోగించబడుతున్నాయి, ఉన్నత దైవపరిపాలనా శిక్షణ ఇవ్వబడుతోంది. వాచ్‌టవర్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌లో ఇచ్చే ఐదు నెలల శిక్షణ విదేశాల్లో మిషనరీ సేవ చేసేందుకు పరిచారకులను సంసిద్ధం చేస్తోంది. బ్రాంచి ఆర్గనైజేషన్‌పై రెండు నెలల శిక్షణా కోర్సును తీసుకునేందుకు ప్రపంచంలోని ఆయా దేశాలనుండి బ్రాంచి కమిటీ సభ్యులు హాజరౌతారు. అమెరికా, కెనడాలనుండి వచ్చిన 48మంది విద్యార్థులతో ప్రయాణ పైవిచారణకర్తల కోసం క్రొత్తగా రెండు నెలల శిక్షణా కోర్సు 1999 మే నెలలో ప్రారంభమైంది. ఈ వేర్వేరు పాఠశాలల ద్వారా యెహోవా ఇస్తున్న శిక్షణ నుండి యెహోవా సేవకులందరూ చివరకు శ్రేష్ఠమైన ప్రయోజనాలను పొందుతారు.

4 ఏ సంకల్పం కోసం బోధించబడుతున్నాము? “సామెతలు 1:1-4లో వర్ణించబడిన పరిణతిగల శ్రేష్ఠమైన పరిస్థితికి ప్రతీచోటా ఉన్న యెహోవా ప్రజలందరినీ తీసుకొచ్చేందుకు మన ప్రస్తుత విద్యాకార్యక్రమం రూపొందించబడింది” అని పరిపాలక సభ సభ్యుడొకరు తెలియజేశారు. యెహోవా మనలో ప్రతి ఒక్కరికీ “శిష్యునికి తగిన నోరు” అనుగ్రహించును గాక.—యెష. 50:4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి