కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/99 పేజీ 7
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నా భాగము
    మన రాజ్య పరిచర్య—1992
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • వెళ్ళనివ్వడానికి నేర్చుకోవడం
    తేజరిల్లు!—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 5/99 పేజీ 7

ప్రశ్నా భాగం

◼ తమ మైనర్‌ పిల్లలు క్షేత్ర సేవలో భాగం వహిస్తున్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి?

క్రైస్తవ తల్లిదండ్రులు ఇతరులతో రాజ్య సువార్తను పంచుకోవడానికి తమ పిల్లలకు శిక్షణనిస్తూ, వారిని సముచితంగానే క్షేత్ర సేవలో తమతో పాటు తీసుకువెళ్తారు. టెరిటరీలో ప్రమాదాలు జరుగవచ్చు—“సురక్షితమైన” పొరుగు ప్రాంతాల్లోనైనా సరే—కనుక పిల్లలను సేవకు తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళను గమనించుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. మనం జీవిస్తున్న ఈ “అపాయకరమైన కాలము”లలో పేరాశా, లైంగిక దుర్నీతీ పెరిగిపోయిన కారణంగా దౌర్జన్యానికీ, అత్యాచారానికీ గురవుతున్న పిల్లల సంఖ్య అధికమౌతోంది. (2 తిమో. 3:1-5) పిల్లలను ఎరగా చేసుకొనే వారి నుండి తల్లిదండ్రులు తమ చిన్నారులను కాపాడేందుకు సహేతుకమైన జాగ్రత్తలను తీసుకోవడం అవసరం. అయితే ఏమి చేయగలం?

మనం జాగ్రత్తగా ఉండాలనీ, రాగల ప్రమాదాన్ని ముందుగానే గ్రహించాలనీ బైబిలు జ్ఞానపూర్వకమైన సలహాలను ఇస్తుంది. (సామె. 22:3; మత్త. 10:16) దీని ఉద్దేశం నియమాలను ఏర్పాటు చేయాలని కాదు గానీ, క్షేత్ర సేవకు పిల్లలతో పాటు తల్లి/తండ్రి లేదా పెద్దవాళ్ళెవరైనా ఒకరు వెళ్ళడం జ్ఞానయుక్తమైన పని అని చెప్పడమే. బాధ్యత గల ఇద్దరు యౌవన ప్రచారకులు కలిసి పని చేస్తున్నట్లయితే, అన్నివేళలా తల్లి/తండ్రి లేదా ఎవరైనా పెద్దవాళ్ళ కనుచూపు మేరలో పిల్లలు ఉండేలా చూసుకోవాలని సిఫార్సు చేయబడుతుంది. పిల్లలు పెరిగి పెద్దవారవుతుండగా, మరింత బాధ్యత గలవారిగా నిరూపించుకుంటుండగా తల్లిదండ్రుల పర్యవేక్షణ అతడికి లేదా ఆమెకు కొంచెం సరిపోతుందా అన్నది తల్లిదండ్రులు నిర్ణయించుకోగలరు.—నవంబరు 1992 మన రాజ్య పరిచర్య ప్రశ్నా భాగం కూడా చూడండి.

నడిచి వెళ్ళేటప్పుడు, మోటారు వాహనాలపై ప్రయాణించేటప్పుడు కూడా సురక్షితత్వాన్ని గురించిన స్పృహ కలిగి ఉండడం జ్ఞానయుక్తం. తగిన జాగ్రత్తలను తీసుకోవడం ప్రమాదాలను, విషాదంతో కూడిన బాధలను, చికిత్సా ఖర్చులను, చీటికీ మాటికీ కేసులు పెట్టేందుకు మ్రొగ్గుచూపే ధోరణి అధికమౌతున్న ఈ లోకంలో రాగల చట్టబద్ధమైన బాధ్యతలను నివారిస్తుంది.

యౌవనులు “యెహోవా నామమును స్తుతిం[చడం]” తగినదే. (కీర్త. 148:12, 13) వారి మర్యాదతో కూడిన మాటలు, మంచి ప్రవర్తన క్షేత్ర సేవలో ఇతరులను ప్రభావితుల్ని చేస్తుంది, యెహోవాకు ఘనతను తీసుకువస్తుంది. తల్లిదండ్రులారా, రాగల ఏ విధమైన ప్రమాదాల నుండైనా వారిని కాపాడడానికి అప్రమత్తంగా ఉంటూనే, మీ పిల్లలు సువార్తను ప్రకటించడంలో క్రమంగా భాగం వహించడానికి వారికి సహాయం చేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి