కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/99 పేజీ 7
  • రాజ్యమందిరపు ఋణాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్యమందిరపు ఋణాలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 5/99 పేజీ 7

రాజ్యమందిరపు ఋణాలు

ఇండియాలోని అనేక ప్రాంతాల్లో యెహోవాసాక్షులు ఎదుర్కొనే గొప్ప సవాళ్ళలో కూటానికి తగిన స్థలాలను ఏర్పాటు చేసుకోలేకపోవడం ఒకటి. అనేక సంఘాలకు సొంత రాజ్యమందిరాలు ఉన్నప్పటికీ, ఇతర సంఘాలు కూటాల కోసం స్థలాలను అద్దెకు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. అనేకమంది ప్రచారకులు అధిగమించవలసిన బీద పరిస్థితులు ఈ సమస్యకు తోడవుతున్నాయి. వాళ్ళ సంపాదన తమ కుటుంబాలను పోషించడానికే సరిపోతుంది. కనుక, సొంత రాజ్యమందిరాన్ని కట్టుకోవచ్చనే ఆశకు ఆధారం ఏమీ కనిపించడం లేదు.

కాబట్టి, అవసరమైన ఫండ్‌ల కోసం ప్రయత్నించి, సేకరించడం కోసం కొందరు ఆర్థిక సహాయాన్ని కోరుతూ, విదేశాల్లో ఉన్న సహోదరులకు వ్రాశారు. అలా చేయకూడదు. వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఈ పద్ధతి లేఖనాలకు లేదా సంస్థ ఏర్పాటులతో పొందిక గలది కాదు. 2 కొరింథీయులు 8:10-15 లో వ్రాయబడిన నిర్దేశం తమ సొంత సంఘ అవసరతల కోసం వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. అనేక సహోదరుల అవసరాలను తీర్చడానికి పరిపాలక సభ నుండి వచ్చిన నిర్దేశమది.

ఈనాడు, ఇండియాలో, సొసైటీకి ఒక “రాజ్యమందిర పరస్పర సహాయ నిధి” ఉంది. దాని ద్వారా ఈ లేఖనాధార నిర్దేశం అమలు చేయబడు​తుంది. రాజ్యమందిరాల కోసం స్థలాలను కొనడానికి, వాటిని కట్టడానికి సహాయం అవసరమున్న సంఘాలు నిర్దేశం కోసం సొసైటీకి వ్రాయాలి. సహాయం కోసం విదేశాల్లో ఉన్న సహోదరులకు వ్రాయడం సరి కాదు. మనకు సహాయం చేయడానికి వారి దగ్గర డబ్బు ఉందని మనం అనుకోవచ్చు. ఒకవేళ వారు తమ సొంత ఫండ్‌లను ప్రభువు పనికై విరాళంగా ఇవ్వాలనుకుంటే, సొసైటీ ప్రపంచవ్యాప్త పనికి లేదా రాజ్యమందిర నిధికి విరాళాలను ఇచ్చే ఏర్పాటు వాళ్ళ దేశంలో కూడా ఉంది.​—2 కొరిం. 9:7.

పెద్దలు సొసైటీ సహాయాన్ని ఒక పద్ధతిలో ఎలా కోరవచ్చన్న విషయంలో, పెద్దల సభలన్నింటికీ సొసైటీ చాలా స్పష్టమైన మార్గ నిర్దేశాలను ఇచ్చింది. “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ[డం]” సాధ్యమయ్యేందుకు మనలో ప్రతి ఒక్కరం ఈ దైవపరిపాలనా నడిపింపుకు సహకరించుదము గాక.​—“సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయంచుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”​—1 కొరిం. 14:40.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి